Thammareddy Bhardwaj : డైరెక్టర్ గా నిర్మాత గా పలు చిత్రాలతో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమ్మారెడ్డి గారు ఈ మధ్య కాలంలో సినిమాలు తీయడం, నిర్మించడం తగ్గించారు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను మాట్లాడుతూ, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ తరచూ ఇంటర్వ్యూల్లో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక చిరంజీవి గారితో ఆయనకు ముందునుండి చక్కటి అనుబంధం ఉంది. చిరంజీవి తొలినాళ్లలో భరద్వాజ గారి సినిమాల్లో నటించారు.
ఇండస్ట్రీ పెద్ద తానే, సినిమా ఇండస్ట్రీ పరువు తీయొద్దు…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద స్పందించారు. టికెట్ రేట్ల ఇష్యూపైన స్పందించారు. ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోంది, దానికి తోడు సినిమా టికెట్ రేట్లు పెరిగితే సినిమా చూడాలన్న ఆసక్తి తగ్గుతోంది, నాలుగు రోజులు పోతే ఓటీటీ లో చూడవచ్చు అనుకుంటూ ఉన్నారు. ఇక టికెట్ రేట్ల విషయంలో చిరంజీవి, మహేష్ లాంటి నటులు సీఎం జగన్ దగ్గరకు వెళ్ళినపుడు నాకు నచ్చలేదు. చిరంజీవి ఇండస్ట్రీ కి పెద్ద అని అందరూ భావిస్తున్నారు.
అలాంటి మనిషి సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడటం నచ్చలేదని ఇలాంటి పనులు చేసి ఇండస్ట్రీ పరువు తీయొద్దు అన్నాను, ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. పెద్ద అన్నపుడు అలానే ఉండాలి ఇలా వెళ్లి సినిమా ఇండస్ట్రీ పరువు తీయకూడదు అంటూ కామెంట్స్ చేసారు. అంతకు మించి నాకు చిరంజీవికి మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…