Thammareddy Bharadwaj: తమ్మారెడ్డి భరద్వాజ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈయన, కొన్ని సినిమాలలో కీలక పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ మెగాస్టార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రొడ్యూసర్ గా తన మొదటి సినిమా కోతల రాయుడు సినిమా కోసం చిరంజీవి గారు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఈ సందర్భంగా తమ్మారెడ్డి వెల్లడించారు .సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలయ్యే వరకు డబ్బులు ఇవ్వలేదని తరువాత డబ్బులు ఇచ్చామని, అయితే ముందే డబ్బులు ఇవ్వలేదు కనుక ఈ సినిమాకి తన రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెబుతాను అంటూ ఈ సందర్భంగా తెలిపారు.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో రెండవ చిత్రం మొగుడు కావాలి. ఈ సినిమాకి కూడా మెగాస్టార్ పెద్దగా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు. ఈ సినిమా మంచి విజయం అందుకున్నప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ అడగలేదని తమ్మారెడ్డి తెలిపారు. ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మేమే కొంత డబ్బు ఇచ్చామని అనంతరం ఆయన ఇల్లు కొంటానంటే ఇంటి కోసం డబ్బు సహాయం చేశానని తెలిపారు.
అయితే తన ఇంటికి అయ్యే ఖర్చు మొత్తం ఇవ్వలేదని ఏదో సహాయం కొద్ది తన వంతుగా కాస్త డబ్బును ఇచ్చానని ఈ సందర్భంగా తమ్మారెడ్డి వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మరో సారి మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు అప్పటికే మెగాస్టార్ స్టార్ హీరోగా మారిపోయారు. ఆయన చుట్టూ పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవారు. అందుకే తనతో తరువాత సినిమాలు చేయలేకపోయానని ఈ సందర్భంగా తమ్మారెడ్డి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…