Featured

Mogilayya : నాకెందుకీ బద్నాం.. పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. నా నోట్లో మట్టి కొట్టొద్దు..: కిన్నెర మొగిలయ్య

Mogilayya : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడటంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ దర్శనం మొగిలయ్య నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన ఈయన తన తండ్రి ద్వారా కిన్నెర వాయిద్యం నేర్చుకున్నాడు. 7 మెట్ల కిన్నెరను 12 మెట్ల కిన్నెరగా మార్చి వాయించడం ఈయన ప్రత్యేకత. తన జానపద పాటలతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరుగుతూ తన పాటలతో కొంచెం డబ్బును సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మరే రాష్ట్రాలలో కూడా 12 మెట్ల కిన్నెర వాయించే కళాకారులు లేకపోగా గతంలో మొగిలియ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. అంతేకాకుండా 8వ తరగతి లో ఈయన పై ఒక పాఠ్యాంశాన్ని కూడా ప్రవేశపెట్టారు.

పద్మశ్రీ తిరిగిచ్చేస్తా…..

అంత వరకు అంతగా గుర్తింపు రాకపోయినా భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడటం వల్ల మంచి గుర్తింపు వచ్చింది. ఇక మొగిలయ్య ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది. అయితే తాజాగా మొగిలయ్య తనకొచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు.

నన్ను ఆదుకుంది తెలంగాణ ప్రభుత్వమే.. ప్రభుత్వం నన్ను సత్కరించి, హైదరాబాద్ లో 300 గజాల స్థలం, కోటి రూపాయలు ఇచ్చింది, కానీ పద్మశ్రీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమని బీజేపీ వాళ్లు సీఎం ఇంటి నుండి నీకు కోటి రూపాయలు ఇచ్చారా అంటూ గొడవపడుతున్నారు. ఈ బద్నాం నాకొద్దు.. ఆ అవార్డు ఎవరిదైతే నాకేంటి వెనక్కు ఇచ్చేస్తా కానీ నాలాంటి పేదోడి నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago