Featured

Sudigali Sudheer : మరోసారి షోలో సుధీర్ బ్రేక్ అప్ స్టోరీ.. అయ్యగారే నెంబర్ 1 అంటూ సెలెబ్రేషన్స్ ..!

Sudigali Sudheer : బుల్లి తెరపై సూపర్ క్రేజీ ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటే ఎవరైనా టక్కున చెప్పేది సుడిగాలి సుధీర్ గురించే. హైదరాబాద్ వచ్చి ఏదో సాధించాలని తనకు వచ్చిన మ్యాజిక్ ను నమ్ముకున్న సుడిగాలి సుధీర్ ఆ తరువాత జబర్దస్త్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుని కమెడియన్ గా అటు మంచి సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నాడు. కస్టపడి పైకి వచ్చిన సుధీర్ ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అన్నట్టుగా చాలా సింపుల్ గా ఉండటమే తనకు అంత మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలలో కూడా క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ బుల్లితెరకు సూపర్ స్టార్ అంటే అతిశయోక్తి కాదేమో. సుధీర్ ఉంటే ఆ షో టీఆర్పి టాప్ లో ఉంటుందంటే అది సుధీర్ కి ఉన్న ఫ్యాన్ బేస్. మల్లెమాల నుండి వస్తున్న లీడింగ్ షోస్ లో సుధీర్ పక్కా ఉండాల్సిందే. ఒకప్పుడు మ్యాజిక్ షోలు చేసే స్టేజి నుండి ఇపుడు కోట్లు సంపాదించే రేంజ్ కి వచ్చిన సుధీర్ లైఫ్ ఎందరో యూత్ కి కచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్.

అయ్యగారే నెంబర్ 1 అంటూ సుధీర్ పుట్టినరోజు వేడుకలు ….

ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ పుట్టినరోజు సందర్బంగా సన్మానం కాన్సెప్ట్ తో నవ్వులు పంచారు. సుధీర్ కి ఒక్కొక్కరు ఒక్కోలాగా సన్మానం చేస్తూ నవ్వించారు. ఇక అయ్యగారే నెంబర్ 1 అంటూ ఆ మధ్య యూట్యూబ్ లో ఫేమస్ అయిన వ్యక్తితో కామెడీ చేయించారు. ఇక రాఘవ రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. ఇక చివర్లో సుధీర్ రియల్ లవ్ స్టోరీ బ్రేక్ అప్ సంఘటనలను చూపించారు. సుధీర్ హైదరాబాద్ రాకముందు ఒక అమ్మాయిని ప్రేమించి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పి హైదరాబాద్ కి వస్తే వెయిట్ చేస్తానని చెప్పిన అమ్మాయి వెంటనే పెళ్లి చేసుకోవడంతో కుమిలిపోయిన సుధీర్ కసిగా ఎదిగాడు.

కళ్ళల్లో నీళ్లు పెట్టించిన అమ్మాయి ముందే కాలర్ ఎత్తుకు తిరిగేలా ఎదిగాడు. బ్రేక్ అప్ అవ్వగానే ఆత్మహత్య ఆలోచన చేసే కుర్రకారుకి సుధీర్ జీవితం స్ఫూర్తిదాయకం. ఎన్ని బద్దలు వచ్చిన తట్టుకుని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని చాలా నెటిజన్స్ అభిప్రాయం పడుతున్నారు. ఇక తన విజయానికి పరోక్షంగా కారణమైన ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని సుధీర్ కోరుకున్నాడు. ఈ డాన్స్ చూసిన ప్రతి ఒక్కరు సుధీర్ తో సహా కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఈ షో మే 22 నా ఈటీవీ లో ప్రసారం అవ్వబోతుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago