Featured

Rocket Raghava: నాకు అంత సహాయం చేసిన శ్రీనివాస్ రెడ్డిని మోసం చేసి నా జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. రాకెట్ రాఘవ షాకింగ్ కామెంట్స్!

Rocket Raghava: రాకెట్ రాఘవ కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి కమెడియన్ గా కొనసాగుతున్న రాకెట్ రాఘవ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాకెట్ రాఘవ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తను డిగ్రీ పూర్తి చేసి కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో కూర్చున్న తర్వాత నటనపై ఆసక్తితో తన తండ్రిని ఆరునెలల సమయం అడిగి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. తాను హైదరాబాద్ వచ్చిన సమయంలో సీరియల్ నటుడు శ్రీరామ్ తనకు ఎంతో సహాయం చేశారని నా జీవితంలో అతని సహాయం ఎప్పటికి మర్చిపోలేనని తెలిపారు. అదేవిధంగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా తనకు ఎంతో సహకరించారని రాకెట్ రాఘవ వెల్లడించారు.

Rocket Raghava: శ్రీనివాస్ రెడ్డి విషయంలో నా జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా… రాకెట్ రాఘవ షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో పలు సినిమాలు, కామెడీ షోలలో శ్రీనివాస్ రెడ్డితో కలిసి నటించానని, ఆయన తనకు ఎన్నో అద్భుతమైన సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారని రాఘవ వెల్లడించారు. ఈక్రమంలోనే తనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి విషయంలో తాను పెద్ద తప్పు చేశానని ఆ తప్పు తన జీవితంలో చేరుపుకోలేనని,ఇప్పటికీ ఆ విషయం గుర్తుకు వస్తే తనకు ఎంతో గిల్టీ ఫీలింగ్ ఉంటుందని తెలిపారు.మరి శ్రీనివాస్ రెడ్డి విషయంలో రాకెట్ రాఘవ ఎలాంటి తప్పు చేశారనే విషయానికి వస్తే…

Rocket Raghava: శ్రీనివాస్ రెడ్డి విషయంలో నా జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా… రాకెట్ రాఘవ షాకింగ్ కామెంట్స్!

జెమినీ టీవీలో నవ్వుల సవాల్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రామ్ కి శ్రీనివాస్ రెడ్డి యాంకర్ గా వ్యవహరించేవారు. ఇక ఈ కార్యక్రమ డైరెక్టర్ నా పక్క రూమ్ లోనే ఉండేవారు. ఒక రోజు రాఘవ ఈ కార్యక్రమాన్ని చేస్తావా అని అడిగారు.అయితే నేను ముందు వెనుక ఆలోచించకుండా చేస్తానని చెప్పి ఒక రోజు షూటింగ్ పూర్తి చేశాను.ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు దిగి అక్కడికి వచ్చి ఇది చూసి వెళ్ళిపోయారు. తరువాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ చెయ్యమని వాళ్లు నిన్ను పిలిచారా అని అడిగారు. అవునన్నా పిలిస్తేనే వెళ్లాను అని చెప్పాను.మరి ఆ విషయం నాకు వాళ్ళు ఎందుకు చెప్పలేదు కనీసం నువ్వైనా నేను చేస్తున్నాను అని ఒక మాట చెప్పాలి కదా,నాకు ఇవ్వాల్సినవి ఉంటాయి అంటూ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నాకు తెలియకుండానే జరిగింది…

ఇలా నాకు తెలియకుండానే శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఈ కార్యక్రమాన్ని నేను చేసి పెద్ద తప్పు చేశాను. అయితే ఆయన ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోక పోయినా నాకు మాత్రం అదొక గిల్టీ ఫీలింగ్ మాదిరిగానే ఉంది. ఇప్పటికీ ఆయన పేరు గుర్తు వస్తే నా మనసులో ఈ సంఘటన మెదులుతుంది అంటూ శ్రీనివాస్ రెడ్డి విషయంలో జరిగిన సంఘటనను రాకెట్ రాఘవ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago