Tag Archives: remuneration

Samantha: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత.. భారీగా పెంచిన రెమ్యూనరేషన్.. ఎంతంటే?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయాసైటిసిస్ కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఈమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు.

ఇక ఈ వ్యాధి కోసం ఎన్నో దేశాలకు తిరిగి చికిత్స తీసుకున్నటువంటి సమంత త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమా కథలను కూడా వినే పనులలో సమంత బిజీగా ఉన్నారని సమాచారం. ఇక ఈమె చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈమె సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఈ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతోంది.

ఇలా ఇండస్ట్రీలోకి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి సమంత భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ పెంచుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి సమంత కొత్తగా కమిట్ అయ్యే సినిమాలకు కూడా ఆరు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.

రెండు కోట్లు అదనం..
ఈమె ఇది వరకు ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు అయితే ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోయినా చేయబోయే సినిమాలకు ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారనే విషయం తెలిసే అందరూ షాక్ అవుతున్నారు. ఈమె ఇండస్ట్రీకి విరామం ఇచ్చి ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారని నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు.

Nayanatara: 50 సెకండ్ల యాడ్ కోసం నయనతార రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Nayanatara:  సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తున్న మరోవైపు ఈమె కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. నయనతార ఇలాంటి యాడ్స్ చేయడం చాలా తక్కువ అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం భారీ స్థాయిలో తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఇటీవల సాఫ్ట్ డ్రింక్స్ కి సంబంధించినటువంటి యాడ్స్ చేశారు. అంతేకాకుండా టాటా స్కై యాడ్ కూడా ఈమె చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలా టాటా స్కై యాడ్ చేసినందుకుగాను ఈమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ వీడియో కేవలం 50 సెకండ్లు మాత్రమే ఉంటుంది దీంతో ఈమె ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా 50 సెకండ్లకు కోట్లలో రెమ్యూనరేషన్ అంటేనే నయనతార క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.

కోట్లలో రెమ్యూనరేషన్..
ఇక నయనతార తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే జవాన్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

Ntr: బాలీవుడ్ కి షాక్ ఇస్తున్న తారక్.. వార్ 2 రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న దేవర సినిమా కాక మరొకటి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 అని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులను పూర్తి చేయబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వార్ 2 తో బిజీ కాబోతున్నారు.

ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. హృతిక్ రోషన్ హీరో నటిస్తున్నటువంటి సినిమాలు ఎన్టీఆర్ కేవలం గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని తెలిసి ఈయన పాత్ర గురించి ఆసక్తి నెలకొంది అయితే తాజాగా ఈ గెస్ట్ రోల్ చేయడం కోసం ఎన్టీఆర్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సంచలనగా మారింది.

వంద కోట్ల రూపాయలు..

ఈ సినిమాలో ఎన్టీఆర్ కేవలం గెస్ట్ పాత్రలో మాత్రమే కనిపించబోతున్నారు. ఇలా గెస్ట్ పాత్రలో కనిపించినందుకు గాను ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలిసే బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం షాక్ అవుతున్నారు. అక్కడ ఫుల్ సినిమా చేసిన స్టార్ హీరోలకు మాత్రమే వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అలాంటిది ఎన్టీఆర్ గెస్ట్ పాత్రకు 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Ramcharan: ఖాన్స్ తో కలిపి కాలు కదిపినందుకు చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Ramcharan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందింది. ఇక బాలీవుడ్ తారలందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ పెళ్లి వేడుకలలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేసినందుకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే వేదికపై వీరందరూ ఫర్ఫార్మెన్స్ చేసినందుకు మరికొంత మొత్తంలో చార్జ్ చేశారని వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు స్టెప్పులు వేశారు అనంతరం వీరితో పాటు రామ్ చరణ్ ని కూడా వేదికపైకి పిలిచి మరి అతనితో కలిసి డాన్సులు వేశారు. ఇలా వీరందరూ కలిసి వేదికపై డాన్స్ చేసినందుకు భారీగా తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నార్త్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేశారు. తాము ఈ పెళ్లి వేడుకలను ఎంతో ఎంజాయ్ చేశామని తెలిపారు.

రూపాయి కూడా తీసుకోలేదు…
ఇక తాము డబ్బు తీసుకొని మరి ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేసాము అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని నార్త్ సెలబ్రిటీలు కొట్టి పారేశారు. ఇక రామ్ చరణ్ అయితే కనీసం ఒక రూపాయి కూడా తీసుకోలేదని ఈయన అంబానీ పిలుపుమేరకు పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారని తెలుస్తోంది. ఇలా పెర్ఫార్మెన్స్ చేసినందుకు డబ్బు తీసుకున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈ వార్తలను ఖండిస్తున్నారు.

Thamannah: జైలర్ నా వల్లే హిట్ అయింది.. నిర్మాతలను భారీగా డిమాండ్ చేస్తున్న తమన్నా?

Thamannah: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న ఒకరు. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల తమన్నా రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ సినిమాలో ఒక పాటలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో తమన్నా నువ్వు కావాలయ్యా అనే పాటలో నటించారు.

ఇక ఈ సినిమాలో ఈమె చేసినటువంటి డాన్స్ కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాటకు రీల్స్ చేస్తూ భారీ స్థాయిలో వైరల్ చేశారు. ఇక ఈ పాట ఎంతో మంచి సక్సెస్ కావడంతోనే సినిమా కూడా మంచి సక్సెస్ అయింది అంటూ తమన్నా నిర్మాతల దగ్గర ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారట.

రెమ్యూనరేషన్ పెంచిన తమన్నా..
ఇలా నా వల్లే జైలర్ సినిమా హిట్ అయింది అంటూ ఈమె తన తదుపరి సినిమాలకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఇలా ఈ పాట హిట్ కావడంతో ఈమె తదుపరి సినిమాలకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారని తెలుస్తుంది. మరి తమన్నా రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈమె సౌత్ సినిమాలకు కాస్త దూరమై బాలీవుడ్ సినిమాలలోనే నటిస్తూ బిజీగా ఉన్నారు.

Teja Sajja: హనుమాన్ సక్సెస్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన హీరో తేజ.. ఎంతంటే?

Teja Sajja:  టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో నటుడు తేజ సజ్జ ఒకరు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తేజ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. జనవరి 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంతో హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

తేజ సజ్జ ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నిర్మాతలు తనని కలిసి అడ్వాన్సులు కూడా ఇచ్చారని సమాచారం. ఇక ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పకుండా సెలబ్రిటీలు రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు అలాంటిది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తేజ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచారని తెలుస్తుంది.

నాలుగు కోట్లు పెంచిన తేజ..
హనుమన్ సినిమా కోసం కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఈయన ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక హిట్ సినిమాతో ఈయన ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారు ఇలా రెమ్యునరేషన్ పెంచినప్పటికి నిర్మాతలు వెనకడుగు వేయకుండా ఆయన అడిగినది మొత్తం చెల్లిస్తున్నారని తెలుస్తోంది.

Deepika Padukone: కల్కి కోసం దీపికా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దీపిక పదుకొనే ఒకరు. ఈమె బాలీవుడ్ హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే దీపిక ఇటీవల బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు సినిమాలకు కూడా కమిట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాకు ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 9వ తేదీ విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో దీపిక పదుకొనే మాత్రమే కాకుండా దిశా పటాని కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో ఏడుగురు స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా ఈ హీరోల గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్తలు వైరల్ గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఇందులో దీపిక పదుకొనే నటిస్తున్నటువంటి తరుణంలో ఈమె ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ 20 కోట్లు…

నటి దీపిక పదుకొనే ఈ సినిమాలో నటించడం కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఈ క్రమంలోనే నిర్మాతలు కూడా తనకు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Jeeva: యాత్ర 2 కోసం జీవా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Jeeva: డైరెక్టర్ మహీవి రాఘవ్ దర్శకత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందు యాత్ర సినిమా ద్వారా వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులను అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వంటి విషయాలను కూడా ఈ సీక్వెల్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇకపోతే ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో ముమ్ముట్టి నటించారు. అదేవిధంగా వైయస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించారు. ఇక ఈ సినిమాలో జీవా వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించడం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

ఇలా జగన్ పాత్రలో నటించినందుకు జీవా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఈ సినిమాలో ఈయన జగన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. కొన్ని చోట్ల ఈయనకు బదులు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాము అనే భావన కూడా ప్రేక్షకులలో కలుగుతుందని చెప్పాలి.

వైయస్ జగన్మోహన్ రెడ్డి..

ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించినటువంటి నటుడు ముమ్ముటికి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందించారు. ఈ సినిమాలో ఈయన పాత్ర చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్రకు వెళ్లడం సిబిఐ విచారణ అరెస్ట్ కావడం బయటకు వచ్చి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం తిరిగి పాదయాత్ర జగన్ ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలను చూపించారు.

Rashmika: తప్పుడు వార్తలను నిజం చేస్తే పోలే… రెమ్యూనరేషన్ పై రియాక్ట్ అయిన రష్మిక!

Rashmika: నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం భాషతో సంబందం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది.

ఇకపోతే రష్మిక ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే రష్మిక ఒక్కో సినిమాకు సుమారు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఇలా తన రెమ్యూనరేషన్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె స్పందించారు. నేను ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారు మీరు ఇంతలా చెప్తున్నారు అంటే నేను కూడా ఈ విషయం గురించి ఓసారి ఆలోచించాల్సిందే.

ఆలోచించాల్సిన విషయమే..

ఇకపై నిర్మాతల దగ్గర కూడా నేను రెమ్యూనరేషన్ గురించి డిమాండ్ చేస్తానని, మీడియా వాళ్ళు నా రెమ్యూనరేషన్ పెంచారని చెప్పి మీ మాటకు నేను కట్టబడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా తన రెమ్యూనరేషన్ పెరిగిందంటూ వస్తున్నటువంటి వార్తలపై రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Fighter: ఫైటర్ కోసం ఏకంగా భారీగా రెమ్యూనరేషన్ అందుకున్న దీపికా.. ఎన్ని కొట్లో తెలుసా?

Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా నటించిన చిత్రం ఫైటర్. ఈ సినిమా తాజాగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కథ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చుట్టూ తిరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇది ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటి ఫైటర్ జెట్ మూవీ. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ని అందుకోవడంతో పాటు తొలిరోజే భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. హృతిక్ రోషన్ నటన, యాక్షన్ అద్భుతం. దీపికా పదుకొణె సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అనిల్ కపూర్ నటన కూడా అద్భుతంగా ఉందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేశభక్తి ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయట. అంతే కాదు హృతిక్, దీపిక మధ్య కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అందులో భాగంగానే ఈ సినిమా కోసం హృతిక్, దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫైటర్ సినిమాలో స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమా బడ్జెట్ కూడా భారీగా అయ్యింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన పఠాన్ సినిమా ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసింది. ఇప్పుడు ఫైటర్ కూడా 1000 కోట్లవరకు వసూల్ చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్లతో నిర్మించినట్లు టాక్. ఫైటర్ మూవీ కోసం హృతిక్ ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేశారట.

దీపికా పారితోషికం అన్ని కోట్లు..

హీరోయిన్ దీపికా పదుకునే రూ.15 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. హృతిక్ బాలీవుడ్ లో స్టార్ హీరో కాబట్టి 50 కోట్ల తీసుకోవడం పెద్ద షాకింగ్ విషయం కాదు కానీ దీపికా పదుకొనె 15 కోట్లు తీసుకోవడం షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వామ్మో ఏకంగా దీపికా 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకు ఉందా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించడంతో చిత్ర బృందం సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.