Rashmika: నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం భాషతో సంబందం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది.
ఇకపోతే రష్మిక ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే రష్మిక ఒక్కో సినిమాకు సుమారు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
ఇలా తన రెమ్యూనరేషన్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె స్పందించారు. నేను ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారు మీరు ఇంతలా చెప్తున్నారు అంటే నేను కూడా ఈ విషయం గురించి ఓసారి ఆలోచించాల్సిందే.
ఆలోచించాల్సిన విషయమే..
ఇకపై నిర్మాతల దగ్గర కూడా నేను రెమ్యూనరేషన్ గురించి డిమాండ్ చేస్తానని, మీడియా వాళ్ళు నా రెమ్యూనరేషన్ పెంచారని చెప్పి మీ మాటకు నేను కట్టబడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా తన రెమ్యూనరేషన్ పెరిగిందంటూ వస్తున్నటువంటి వార్తలపై రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…