Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తున్న మరోవైపు ఈమె కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. నయనతార ఇలాంటి యాడ్స్ చేయడం చాలా తక్కువ అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం భారీ స్థాయిలో తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఇటీవల సాఫ్ట్ డ్రింక్స్ కి సంబంధించినటువంటి యాడ్స్ చేశారు. అంతేకాకుండా టాటా స్కై యాడ్ కూడా ఈమె చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇలా టాటా స్కై యాడ్ చేసినందుకుగాను ఈమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ వీడియో కేవలం 50 సెకండ్లు మాత్రమే ఉంటుంది దీంతో ఈమె ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా 50 సెకండ్లకు కోట్లలో రెమ్యూనరేషన్ అంటేనే నయనతార క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.
కోట్లలో రెమ్యూనరేషన్..
ఇక నయనతార తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే జవాన్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…