Tag Archives: Respiratory problems

Samyuktha Menon: ఓయమ్మ వ్యక్తి చెంప చెల్లుమనిపించిన సంయుక్త మీనన్… మరి ఇంత ధైర్యమా?

Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకొని వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించిన సంయుక్త మీనన్ ఆ తర్వాత బింబిసారా, సార్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమాలో కూడా సాయిధరమ్ తేజ్ కి జోడిగా నటించి హిట్ అందుకుంది.

ఇలా తెలుగులో సంయుక్తా నటించిన నాలుగు సినిమాలు మంచి హిట్ అందుకోవటంతో ఈ అమ్మడికి హిట్ సినిమాల హీరోయిన్, గోల్డెన్ లెగ్ అంటూ బిరుదులు కూడా ఇచ్చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్తా మీనన్ గతంలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ మాట్లాడుతూ..

నేను మా అమ్మ కలిసి ఓ సారి బయటకెళ్లాం. ఓ చోట మేము నిలబడి ఉన్నాం. అక్కడే ఉన్న ఓ వ్యక్తి సిగరెట్‌ తాగుతూ ఉన్నాడు. అతడు పొగను మాపై వదులుతూ ఉన్నాడు. మా అమ్మకు శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతో అతడ్ని పక్కకు వెళ్లి తాగమని రిక్వెస్ట్‌ చేశాను. అతడు వినలేదు. పైగా మాతో అసభ్యంగా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చి అతని చెంప చెళ్లుమనిపించా అంటూ సంయుక్త చెప్పుకొచ్చింది.

Samyuktha Menon: బూతులు మాట్లాడారు…

సంయుక్త హీరోయిన్ గా, డేరింగ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి గా కూడా నిరూపించుకుంది. ఇదిలా ఉండగా ఇలా సంయుక్త నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవ్వటంతో ఈమెకు తెలుగుతోపాటు ఇతర భాషలలో కూడా అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘ డెవిల్ ‘ అనే సినిమాలో సంయుక్త నటిస్తోంది. పాప్ కార్న్ అనే మలయాళీ సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.

చలికాలంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ వ్యాధి రావడం ఖాయం!

చలికాలం వచ్చిందంటే ఎన్నో అంటువ్యాధులు వస్తాయి.వాతావరణంలో ఒక్కసారిగా మార్పు లు సంభవించడం వల్ల అనేక వ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి.అందులో జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా వేధిస్తుంటాయి. ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జాగ్రత్తలను పాటించడం ద్వారా భయంకరమైన అంటు వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడంతో జలుబు విపరీతంగా వేధిస్తుంటుంది.

ప్రత్యేకించి చలికాలంలో గాలి తక్కువగా ఉండటం వల్ల చాలా వరకు దుమ్ము ,ధూళి కణాలు గాలిలోనే మిగిలిపోతుంటాయి. ఎక్కువగా మెట్రో నగరాలలో నివసించే ప్రజలు ఈ వాతావరణ కాలుష్యం బారిన పడుతుంటారు.అంతేకాకుండా మెట్రోనగరాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉండటంవల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి ఏర్పడే కాలుష్యం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఇక చలికాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. ఎక్కువకాలం జలుబుతో బాధపడుతుంటే ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా వాతావరణంలో పొల్యూషన్ వల్ల శ్వాసకోస సమస్యలు ఏర్పడి క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే చలికాలంలో వీలైనంతవరకు తగినంత జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. వీలైనంత వరకు మన శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు చల్లటి ద్రావణాలను దూరం పెట్టాలి. వీలైనంత వరకు వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాకుండా మన పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా దోమల బెడద తగ్గి ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

కరోనా కంటే భయంకరమైన వ్యాధి.. ఎంతమంది మరణించారంటే..?

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రజలందరినీ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణకు ముందే ఎన్నో భయంకరమైన వ్యాధులు ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజల్లో ఈ వైరస్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. దాదాపు 47 సంవత్సరాల క్రితం సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో ఒక కొత్త వ్యాధికి సంబంధించిన కేసులకు సంబంధించిన విషయాలను గుర్తించారు.

1965 సంవత్సరంలో లెజియోన్నైర్స్ అనే వ్యాధి శరవేగంగా ప్రబలింది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి అయిన లెజియోన్నైర్స్ బారిన పడితే శ్వాస అందకపోవడం ప్రజలు గంటల వ్యవధిలోనే చనిపోతారు. ఈ వ్యాధి బారిన పడ్డవారిలో శ్వాస సంబంధిత సమస్యలతో పాటు అనారోగ్యం, విపరీతమైన దగ్గు, నీరసం, జ్వరం, ఇతర లక్షణాలు కనిపించాయి.

అయితే వ్యాధికి సంబంధించిన కీలక విషయాలు దాదాపు పది సంవత్సరాల తర్వాత వెల్లడయ్యాయి. సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో 81 మంది ఈ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకోగా బాధిత రోగుల్లో ఏకంగా 14 శాతం మంది మృతి చెందారు. ఒక ప్రమాదకరమైన బ్యాక్టిరియా అప్పట్లో లెజియోన్నైర్స్ వ్యాధి బారిన పడటానికి కారణమైంది. కొందరు ఎవరో కావాలని బ్యాక్టీరియాను విడుదల చేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టారనే ఆరోపణలు సైతం ఆ కాలంలో వ్యక్తమయ్యాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వ్యాధి గురించి పరిశోధనలు చేయగా బ్యాక్టీరియా ఎయిర్ కండీషన్ రూమ్ లో వ్యాప్తి చెందిందని ఆ సమావేశానికి హాజరైన వారంతా వైరస్ బారిన పడ్డారని సమాచారం. ఆ బ్యాక్టీరియా విజృంభించే ఉంటే మాత్రం కరోనా కంటే ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదై ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత్ లోని కరోనా రోగులకు మరో షాకింగ్ న్యూస్..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య్ తగ్గినా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ డిసెంబర్ లేదా జనవరిలో అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో భారత్ లోని కరోనా రోగులకు ఊహించని ఉపద్రవం ముంచుకొస్తోంది.

దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులు ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వైరస్ సోకిన రోగుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ల ద్వారా సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించడం సాధ్యమవుతుంది. దేశంలో కరోనా రోగులకు చికిత్స అందించడం కోసం కొన్ని లక్షల వెంటిలేటర్ల అవసరం ఉంది.

అయితే మనుషులతో పాటు గ్యాస్, స్టీల్ పరిశ్రమలు కూడా ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సిలిండర్లను తగ్గించి వైద్య చికిత్స కోసం వినియోగిస్తున్నా దాదాపు 3,000 మెట్రిక్ టన్నుల కొరత సెప్టెంబర్ నాటికే ఏర్పడిందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య అవసరాలకు కావాల్సిన ఆక్సిజన్ కొరత ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 5 శాతం కేసులకు ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉంది.

గతంతో పోలిస్తే ఆక్సిజన్ సిలిండర్ల వినియోగం ఏడెనిమిది రెట్లు పెరిగిందని సమాచారం. ఆక్సిజన్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అదే స్థాయిలో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. ఉత్పత్తిని పెంచలేకపోతే మాత్రం భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా రోగుల ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేద్.