Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకొని వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించిన సంయుక్త మీనన్ ఆ తర్వాత బింబిసారా, సార్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమాలో కూడా సాయిధరమ్ తేజ్ కి జోడిగా నటించి హిట్ అందుకుంది.
ఇలా తెలుగులో సంయుక్తా నటించిన నాలుగు సినిమాలు మంచి హిట్ అందుకోవటంతో ఈ అమ్మడికి హిట్ సినిమాల హీరోయిన్, గోల్డెన్ లెగ్ అంటూ బిరుదులు కూడా ఇచ్చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్తా మీనన్ గతంలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ మాట్లాడుతూ..
నేను మా అమ్మ కలిసి ఓ సారి బయటకెళ్లాం. ఓ చోట మేము నిలబడి ఉన్నాం. అక్కడే ఉన్న ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అతడు పొగను మాపై వదులుతూ ఉన్నాడు. మా అమ్మకు శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతో అతడ్ని పక్కకు వెళ్లి తాగమని రిక్వెస్ట్ చేశాను. అతడు వినలేదు. పైగా మాతో అసభ్యంగా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చి అతని చెంప చెళ్లుమనిపించా అంటూ సంయుక్త చెప్పుకొచ్చింది.
సంయుక్త హీరోయిన్ గా, డేరింగ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి గా కూడా నిరూపించుకుంది. ఇదిలా ఉండగా ఇలా సంయుక్త నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవ్వటంతో ఈమెకు తెలుగుతోపాటు ఇతర భాషలలో కూడా అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘ డెవిల్ ‘ అనే సినిమాలో సంయుక్త నటిస్తోంది. పాప్ కార్న్ అనే మలయాళీ సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…