Tag Archives: revanth reddy

Kondaa Movie: సాయి పల్లవికి రెడ్ కార్పెట్.. రేవంత్ రెడ్డికి నో పర్మిషన్.. తెలంగాణ మంత్రి పై ఫైర్ అయిన సుస్మిత పటేల్?

Kondaa Movie: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్ చిత్రాలు చేస్తూ పలు వివాదాలకు కారణం అవుతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాలు రాగ తాజాగా కొండా మురళి సురేఖ దంపతులు బయోపిక్ చిత్రం ద్వారా కొండా అనే సినిమాతో ఈ నెల 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Kondaa Movie: సాయి పల్లవికి రెడ్ కార్పెట్.. రేవంత్ రెడ్డికి నో పర్మిషన్.. తెలంగాణ మంత్రి పై ఫైర్ అయిన సుస్మిత పటేల్?

విడుదల తేదీ దగ్గర పడటంతో కొండ సురేఖ దంపతులు సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హనుమకొండలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా కొందరు రాజకీయాలు చేస్తూ అతనిని రాకుండా అడ్డుకున్నారు అంటూ ఆరోపించారు.

Kondaa Movie: సాయి పల్లవికి రెడ్ కార్పెట్.. రేవంత్ రెడ్డికి నో పర్మిషన్.. తెలంగాణ మంత్రి పై ఫైర్ అయిన సుస్మిత పటేల్?

ఈ క్రమంలోనే ఈ విషయంపై కొండా సినిమా నిర్మాత,కొండా సురేఖ మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నీ బతుకు మారదా? నీ బతుకంతా భయంతోనే సాగిపోతోంది. విరాట పర్వం సినిమా వేడుకల్లో భాగంగా సాయిపల్లవికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు.

ఎన్నికలు రానివ్వు నీ సంగతి చూస్తా..
నా సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా వస్తున్న రేవంత్ రెడ్డిని రాకుండా ఆపారు. ఇలా ఎంత కాలం భయపడతావు ఎన్నికలు రానివ్వు నీ సంగతిచెబుతా అంటూ వేదికపై సుస్మిత పటేల్ తీవ్రస్థాయిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లితండ్రుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కొండా చిత్రానికి సుస్మితా పటేల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Revanth Reddy: ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఎలా ఉన్నారో తెలుసా….వైరల్ అవుతున్న పెళ్లినాటి ఫోటో..!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొనే రేవంత్ రెడ్డి శనివారం పెళ్లిరోజు జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఆయన పెళ్లి రోజు సందర్భంగా పెళ్లినాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శనివారం నాటికి వీరి పెళ్లి జరిగి 30 సంవత్సరాలు కావడంతో ఈయన పెళ్లయిన కొత్తలో తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు బక్కపలచగా ఉన్న రేవంత్ రెడ్డిని చూస్తే టక్కున గుర్తుపట్టలేము. అయితే పెళ్లి రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతుల ఫోటోలను కాంగ్రెస్ పార్టీకి చెందినగ్రేటర్ హైదరాబాద్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దినేశ్ కుమార్‌ ఈ ఫోటోని షేర్ చేశారు.

Revanth Reddy: ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఎలా ఉన్నారో తెలుసా….వైరల్ అవుతున్న పెళ్లినాటి ఫోటో..!

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు రాజకీయ నాయకులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఫోటో తీసుకున్న సమయానికి ఈయనకు రాష్ట్ర రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన జీవితం కొనసాగుతోంది.

ఎమ్మెల్సీగా మొదలైన ప్రస్థానం…

పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు ఈయన రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్సీగా తన ప్రస్థానం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనంతరం ఎమ్మెల్యే, ఎంపీగా కూడా కొనసాగారు. ప్రస్తుతం ఈయన ఎంపీగా కొనసాగుతూనే టీపీసీసీ చీఫ్ పదవిలో కొనసాగిస్తున్నారు.

కేసిఆర్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి!

సీఎం కేసిఆర్ కి ప్రశ్నలు సంధించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు సీఎం పదవి ఏమైందన్నారు రేవంత్ రెడ్డి. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ కొంగ జపం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

కాగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసిఆర్ దళిత బంధు అంటున్నారని రేవంత్ విమర్శించారు. ఇవాళ జరిగిన సభలో కేసిఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని మండిపడ్డారు. మరియమ్మను పోలీస్ కస్టడీలో చంపేశారని.. దళితులకు కేసిఆర్ క్షమాపణలు చెప్పారని రేవంత్ డిమాండ్ చేశారు.

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?

హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

కాగా కొండా సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలంచింది. అయితే అంతిమంగా సురేఖ పేరును పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన బీసి నేతలు బరిలో ఉండడంతో అధిష్టానం సురేఖ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

మైనారిటీ హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుంది_ మధుయాష్కి

హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ మాట్లాడారు.మైనారిటీ హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు మధుయాష్కి. దళిత బంధు పేరుతో పేలాలు వేసి బిర్యాని తింటున్నారని ఆయన విమర్శించారు.. దళితుల ఉద్యోగాల కావాలి ఉపాధి కావాలని మధుయాష్కి డిమాండ్ చేశారు.

కాగా దళిత బందు మైనార్టీలకు ఇవ్వాలన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. దళితుల కంటే ముస్లింలు వెనుకబడ్డారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకోవడంలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

హుజరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని .. తొందరగా అభ్యర్థిని తేల్చాలని సీనియర్ నేత కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో మహిళ పోడు రైతులను హింసించడం నిరసిస్తూ టిపిసిసి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు దీటుగా ఎదుర్కొనే నేత కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న వినియోగం. ఈ రెండు పార్టీల నాయకులు బీసీ నేతను బరిలోకి దించడంతో .. పార్టీ అధిష్టానవర్గం దళిత అభ్యర్థిత్వం వైపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది

సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ!

సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు టీపీసిసి రేవంత్ రెడ్డి. ఖమ్మం జైలులో మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


కాగా సెప్టెంబర్‌ 17లోపు గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఎస్సీ, గిరిజనులకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో దీక్షకు సిద్దమా? కేటిఅర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి..!

మంత్రి కేటిఅర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. అందులో టిఆర్ఎస్, బిజెపి శారీరాలే వేరని, ఆ రెండు పార్టీల ఆత్మ ఒక్కటేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు కుస్తీ పడతారు. ఆ తరువాత దోస్తీ చేస్తారు ఆని ఆరోపించారు.

మరోవైపు విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్షకు సిద్దమా అంటూ మంత్రి కేటిఅర్ కు సవాల్ విసిరారు. ఈ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడి పై ఒత్తిడి పెంచుదామని అన్నారు. తన సవాల్ కు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.