Kondaa Movie: సాయి పల్లవికి రెడ్ కార్పెట్.. రేవంత్ రెడ్డికి నో పర్మిషన్.. తెలంగాణ మంత్రి పై ఫైర్ అయిన సుస్మిత పటేల్?
Kondaa Movie: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్ చిత్రాలు చేస్తూ పలు వివాదాలకు కారణం అవుతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాలు రాగ తాజాగా కొండా మురళి సురేఖ దంపతులు బయోపిక్ చిత్రం ద్వారా కొండా అనే సినిమాతో ఈ నెల 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడటంతో కొండ సురేఖ దంపతులు సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హనుమకొండలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా కొందరు రాజకీయాలు చేస్తూ అతనిని రాకుండా అడ్డుకున్నారు అంటూ ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై కొండా సినిమా నిర్మాత,కొండా సురేఖ మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నీ బతుకు మారదా? నీ బతుకంతా భయంతోనే సాగిపోతోంది. విరాట పర్వం సినిమా వేడుకల్లో భాగంగా సాయిపల్లవికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు.
ఎన్నికలు రానివ్వు నీ సంగతి చూస్తా..
నా సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా వస్తున్న రేవంత్ రెడ్డిని రాకుండా ఆపారు. ఇలా ఎంత కాలం భయపడతావు ఎన్నికలు రానివ్వు నీ సంగతిచెబుతా అంటూ వేదికపై సుస్మిత పటేల్ తీవ్రస్థాయిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లితండ్రుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కొండా చిత్రానికి సుస్మితా పటేల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…