Tag Archives: side effects

Butter Milk Side Effects: ఆరోగ్యానికి మంచిదని మజ్జిగ ఎక్కువ తాగుతున్నారా… ప్రమాదంలో పడినట్లే?

Butter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.

1

ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్‌ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.

చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…

ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు..?

ఉదయం లేవగానే చాలామంది తమ రోజును ఒక కప్పు టీ తో మొదలు పెడుతూ ఉంటారు. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కొంతమందికి అయితే ఆర్ టీ తాగకపోతే ఆరోజు అంతా పిచ్చి గా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అంతలా టి కి ఎడిక్ట్ అయిపోయారు. వీటిని చాలా మంది పెద్ద అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు.

అయితే ఇలా ఉదయాన్నే టీ తాగడం వల్ల అది మలబద్ధకానికి దారి తీయడమే కాకుండా, నిధుల పై కూడా ప్రభావం చూపిస్తుందని ఒక నివేదిక హెచ్చరిస్తున్నారు.క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి అని అంటున్నారు. ఉదయం లేవగానే బెడ్ టీ తాగడం చాలా మందికి అలవాటు. ఒక కప్పు టీ లో 20 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఈ కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఇలా క్రమం తప్పకుండా టీ తీసుకోవడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి,రక్త పోటు పెరుగుతుంది. అసిడోసిస్ పెరుగుతుంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఉదయాన్నే కాఫీ తాగే ముందు గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీరు తాగండి.

ఇలా గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీటిని తాగిన తర్వాత టీ తాగండి. లేదంటే అల్పాహారంగా కొన్ని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుని ఆ తర్వాత టీ తాగడం మంచిది. నిరంతరం టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. అంతేకాకుండా టి ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

మీకు ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే జామకాయ తినకపోవడం మంచిది.. !

జామకాయలో ముఖ్యంగా విటమిన్ – సి అనేది పుష్కలంగా ఉంటుంది. సామాన్యుడికి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కనుక దీనిని ‘సామాన్యుడి యాపిల్’ గా పిలుస్తారు. దీని ధర కూడా అతి తక్కువగా ఉంటుంది. సామాన్యుడు కూడా కొనే స్థితిలో ఉంటుంది కనుకనే దానిని సామాన్యుడి యాపిల్ గా పిలుస్తారు.

అందులో ఉండే పోషకాలకు మాత్రం విలువ కట్టలేమని అంటారు వైద్యులు. జామ పండుతో పాటు జామ ఆకులు, బెరడులో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి సమయంలో దీనిని తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో జామపండు తినటం వల్ల కడుపు ఉబ్బరంతో నిద్ర సరిగా పట్టని పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ కాయను ఎంత మితంగా తింటే అంత మంచిది. గ్యాస్ సమస్యలతో బాధపడే వారు జామ పండును తినకపోవటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే జామ పండులో ఉండే విటమిన్ సి ప్రక్టోస్ లు ఎక్కవగా ఉండటం వల్ల కడుపులో ఉబ్బరంగా ఉండే భావన కలుగుతుంది. దంత సమస్యలతో బాధపడే వారు ఈ జామకాయను తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
జామపండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్, కెరోటిన్, పొటాషియం ఉంటాయి. అరటిలో ఎంత పొటాషియం ఉంటుందో… జామలోనూ అంతే ఉంటుంది. అందువల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పై సమస్యలు లేని వారు ఎంచక్కా జామకాయను తినొచ్చు.

చక్కెర ను వైట్ పాయిజన్ అని ఎందుకంటారో తెలిస్తే.. ఇకపై ఎప్పుడు కూడా చక్కెర ముట్టరు!

సాధారణంగా మన రోజువారి జీవితంలో ఉపయోగించే వాటిలో చక్కెర ఒకటి. ప్రతిరోజు కాఫీ, టీలలో చక్కెరను విరివిగా ఉపయోగిస్తారు.అదేవిధంగా వివిధ రకాల తీపి పదార్థాలను తయారు చేసుకోవాలన్న చక్కెరతోనే ఎక్కువగా తయారు చేసుకుంటాము.ఈ విధంగా రోజుకు అధిక మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అయితే చక్కెర తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి రోజు అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల శరీర బరువు అమాంతం పెరిగిపోతారు. అదే విధంగా ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడటానికి కూడా చక్కెర ప్రధాన కారణం.మనం ఏదైనా తీపి పదార్థాలు తిన్నప్పుడు అందులో ఉన్నటువంటి చక్కెర మన శరీరంలో ఉన్నటువంటి కొల్లాజెన్ కి అతుక్కుంటుంది. ఇది నెమ్మదిగా ప్రోటీన్లను తొలగించడంతో మన చర్మం పై ముడతలు మచ్చలు ఏర్పడతాయి.

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలో ఊబకాయం ఒకటి. ఊబకాయం అనేది మనం చక్కెర తినకపోయినా ఇతర రకాల పానీయాలు చాక్లెట్ వంటి వాటిని తిన్నప్పుడు వాటిలో ఉన్న చక్కెర మన శరీరంలోకి ప్రవేశించి ఊబకాయానికి దారితీస్తుంది. అదేవిధంగా అధిక మొత్తంలో చక్కెర తీసుకున్నప్పుడు కాలేయ సమస్యలకు దారితీస్తుంది.

ప్రతి రోజు అధిక మొత్తంలో చక్కెర తీసుకోవటంవల్ల గ్లూకోస్ పూర్తిగా మెదడుకు చేరకపోవడం వల్ల మెదడు తన పనితీరును కోల్పోతుంది. ఇది క్రమంగా జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమే రోజువారి ఆహారంలో భాగంగా చక్కెరను మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల ఈ విధమైన దుష్ప్రభావాల కారణంగానే చక్కెరను వైట్ పాయిజన్ అని పిలుస్తారు.

రెండు వేరు వేరు డోసులు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ కు బాగా డిమాండ్ ఏర్పడింది.మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండవ డోసు లభించకపోవడంతో రెండు వేరువేరు కంపెనీలకు చెందిన డోస్ లు తీసుకోవడం వల్ల కరోనా నుంచి విముక్తి పొందవచ్చా? ఈ విధంగా రెండు వేరు వేరు డోసులు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.

రెండు వేరు వేరు రకాలకు చెందిన వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల స్వల్ప దుష్ప్రభావాలు ఏర్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మొదటి డోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా వేరే కంపెనీ చెందిన రెండో డోస్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ విధంగా రెండు వేరు వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను ఇవ్వగా కొందరిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి.

ఈ విధంగా రెండు రకాల డోస్ లు తీసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు ఓ అధ్యయనంలో భాగంగా తెలిపారు. అయితే ఈ లక్షణాలు ఎంతో ప్రమాదకరం కాదని, వీటివల్ల ఆస్పత్రికి చేరాల్సిన అవసరం కూడా లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రయోగ దశలోనే ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేరు వేరు టీకాలు తీసుకోకూడదని నిబంధన లేనప్పటికీ,ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. ఒక వ్యక్తి మొదటి డోసు ఏ కంపెనీ కి చెందినది తీసుకుంటారో రెండవ డోసు కూడా అదే కంపెనీకి చెందినది తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

కరోనా వ్యాక్సినేషన్ తర్వాత కలిగే దుష్ప్రభావాలివే..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ రెండవ దశ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మన దేశంలో భారత్​ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరం ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్​ ఇస్తున్నారు.

ఈ రెండు వ్యాక్సిన్లు అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ప్రవేశపెట్టినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే దేశ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ కోట్ల మంది ప్రజలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కొందరిలో రియాక్షన్స్ వస్తున్నాయి. దీంతో కొందరు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు లేనని, వాక్సిన్ తీసుకోవడం ఎంతో సురక్షితం అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని అధికారులు తెలియజేస్తున్నారు.

కరోనా టీకా వేయించుకోవడం వల్ల కలిగే తేలికపాటి దుష్ప్రభావాలు:
సాధారణంగా ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా కొద్దిపాటి లక్షణాలు బయటపడతాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల టీకా వేసిన ప్రాంతంలో కొద్దిగా నొప్పిగా ఉండి వాపు వస్తుంది. అదే విధంగా కొందరిలో తలనొప్పి, అలసట, నీరసం, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇవన్నీ కూడా సర్వసాధారణమైన లక్షణాలేనని అధికారులు చెబుతున్నారు.

ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ల సలహాలు తీసుకొని ఆ సూచనలను పాటించాలి. ఈ విధమైనటువంటి నొప్పులు ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా ఉంటే డాక్టర్ ని సంప్రదించి వారి సూచనలను పాటించాలి.వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు లేదా తర్వాత ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది మృతి.. ఎక్కడంటే..?


భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 500 లోపే కొత్త కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా నేటి నుంచి వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా జరగనుందని తెలుస్తోంది.

అయితే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వార్త వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. నార్వేలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. మరీ బలహీనంగా ఉన్న వృద్ధులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదమని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతి చెందిన 23 మంది ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారని సమాచారం.

ఆరోగ్యంగా లేని వృద్ధులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే ప్రమాదం పొంచి ఉందని ఈ ఘటన ద్వారా నిరుపితమవుతోంది. నార్వే ఆరోగ్య శాఖ జీవితకాలం తక్కువగా ఉన్నవారు వ్యాక్సిన్ కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఫైజ‌ర్‌, బ‌యోఎన్‌టెక్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

నార్వేలో మొత్తం 33,000 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోగా వారిలో 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా కనిపించినట్లు తెలుస్తోంది. అయితే నార్వే ప్రభుత్వం యువకులు, ఆరోగ్యవంతులు ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ ను తీసుకోవచ్చని చెబుతున్నారు.