ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ కు బాగా డిమాండ్ ఏర్పడింది.మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండవ డోసు లభించకపోవడంతో రెండు వేరువేరు కంపెనీలకు చెందిన డోస్ లు తీసుకోవడం వల్ల కరోనా నుంచి విముక్తి పొందవచ్చా? ఈ విధంగా రెండు వేరు వేరు డోసులు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.
రెండు వేరు వేరు రకాలకు చెందిన వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల స్వల్ప దుష్ప్రభావాలు ఏర్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మొదటి డోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా వేరే కంపెనీ చెందిన రెండో డోస్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ విధంగా రెండు వేరు వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను ఇవ్వగా కొందరిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి.
ఈ విధంగా రెండు రకాల డోస్ లు తీసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు ఓ అధ్యయనంలో భాగంగా తెలిపారు. అయితే ఈ లక్షణాలు ఎంతో ప్రమాదకరం కాదని, వీటివల్ల ఆస్పత్రికి చేరాల్సిన అవసరం కూడా లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రయోగ దశలోనే ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేరు వేరు టీకాలు తీసుకోకూడదని నిబంధన లేనప్పటికీ,ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. ఒక వ్యక్తి మొదటి డోసు ఏ కంపెనీ కి చెందినది తీసుకుంటారో రెండవ డోసు కూడా అదే కంపెనీకి చెందినది తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…