ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ కు బాగా డిమాండ్ ఏర్పడింది.మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండవ డోసు లభించకపోవడంతో రెండు వేరువేరు కంపెనీలకు చెందిన డోస్ లు తీసుకోవడం వల్ల కరోనా నుంచి విముక్తి పొందవచ్చా? ఈ విధంగా రెండు వేరు వేరు డోసులు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.

రెండు వేరు వేరు రకాలకు చెందిన వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల స్వల్ప దుష్ప్రభావాలు ఏర్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మొదటి డోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా వేరే కంపెనీ చెందిన రెండో డోస్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ విధంగా రెండు వేరు వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను ఇవ్వగా కొందరిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి.

ఈ విధంగా రెండు రకాల డోస్ లు తీసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు ఓ అధ్యయనంలో భాగంగా తెలిపారు. అయితే ఈ లక్షణాలు ఎంతో ప్రమాదకరం కాదని, వీటివల్ల ఆస్పత్రికి చేరాల్సిన అవసరం కూడా లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రయోగ దశలోనే ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేరు వేరు టీకాలు తీసుకోకూడదని నిబంధన లేనప్పటికీ,ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. ఒక వ్యక్తి మొదటి డోసు ఏ కంపెనీ కి చెందినది తీసుకుంటారో రెండవ డోసు కూడా అదే కంపెనీకి చెందినది తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here