దేశవ్యాప్తంగా గత ఏడాది నుంచి కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి దశలో కనిపించని విభిన్న లక్షణాలు అన్నీ రెండవ దశలో బయటపడుతున్నాయి.ఈ క్రమంలోనే రెండవ దశ కరోనా మహమ్మారి బారిన పడి కోరుకున్న వారిలో కొత్త కొత్త వ్యాధులు బయట పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కరోనా మహమ్మారిని జయించి బయటకు వచ్చిన వారిని మరొక బ్లాక్ ఫంగస్ వెంటాడి వేధిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ అనే మ్యుకర్‌మైకోసిస్ ఫంగస్ తొలుత ముక్కు ద్వారా ముక్కు, దవడలు, చెవులకు వ్యాపించి తరువాత దశలో మెదడుకు చేరుతుంది.ఈ క్రమంలోనే కొందరికి చెవులు వినిపించకపోవడం కళ్లు కనిపించకపోవడం జరగటం కొందరు బ్రెయిన్ డెడ్ కావడం జరుగుతుంది.
ఇప్పటివరకుమధ్యప్రదేశ్ మహారాష్ట్ర లో కనిపించిన అటువంటి బ్లాక్ ఫంగస్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కరోనా నుంచి కోలుకున్న వారిలోనే ఈ విధమైనటువంటి లక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయని పరిశోధన చేయగా కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువ భాగం స్టిరాయిడ్లు వాడటం వల్ల ఈ విధమైనటువంటి బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ ఏర్పడి నప్పుడు ముక్కు దిబ్బడ, ముక్కు ఎండిపోయినట్లు ఉండడం, చాతిలో నొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం, ముఖం పై దద్దుర్లు, వాపు ఏర్పడటం, కళ్ల నుంచి నీరు కారడం జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది అధిక మొత్తంలో స్టిరాయిడ్స్ వాడిన వారిలోనూ, దీర్ఘకాలిక చక్కెర వ్యాధి,మూత్రపిండ సమస్యలతో బాధపడే వారిలోనూ ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తుతున్నాయని డాక్టర్లు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…