దేశవ్యాప్తంగా గత ఏడాది నుంచి కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి దశలో కనిపించని విభిన్న లక్షణాలు అన్నీ రెండవ దశలో బయటపడుతున్నాయి.ఈ క్రమంలోనే రెండవ దశ కరోనా మహమ్మారి బారిన పడి కోరుకున్న వారిలో కొత్త కొత్త వ్యాధులు బయట పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా మహమ్మారిని జయించి బయటకు వచ్చిన వారిని మరొక బ్లాక్ ఫంగస్ వెంటాడి వేధిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ అనే మ్యుకర్‌మైకోసిస్‌ ఫంగస్ తొలుత ముక్కు ద్వారా ముక్కు, దవడలు, చెవులకు వ్యాపించి తరువాత దశలో మెదడుకు చేరుతుంది.ఈ క్రమంలోనే కొందరికి చెవులు వినిపించకపోవడం కళ్లు కనిపించకపోవడం జరగటం కొందరు బ్రెయిన్ డెడ్ కావడం జరుగుతుంది.

ఇప్పటివరకుమధ్యప్రదేశ్ మహారాష్ట్ర లో కనిపించిన అటువంటి బ్లాక్ ఫంగస్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కరోనా నుంచి కోలుకున్న వారిలోనే ఈ విధమైనటువంటి లక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయని పరిశోధన చేయగా కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువ భాగం స్టిరాయిడ్లు వాడటం వల్ల ఈ విధమైనటువంటి బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ ఏర్పడి నప్పుడు ముక్కు దిబ్బడ, ముక్కు ఎండిపోయినట్లు ఉండడం, చాతిలో నొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం, ముఖం పై దద్దుర్లు, వాపు ఏర్పడటం, కళ్ల నుంచి నీరు కారడం జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది అధిక మొత్తంలో స్టిరాయిడ్స్ వాడిన వారిలోనూ, దీర్ఘకాలిక చక్కెర వ్యాధి,మూత్రపిండ సమస్యలతో బాధపడే వారిలోనూ ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తుతున్నాయని డాక్టర్లు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here