Tag Archives: Sriya Saran

Sriya Saran: అప్పుడే అలాంటి వారికి అవకాశాలూ వస్తాయి…శ్రియ కామెంట్స్ వైరల్!

Sriya Saran: శ్రియ శరన్ పరిచయం అవసరం లేని పేరు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ఇప్పటికీ వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లి జరిగి ఓ బిడ్డకు తల్లిగా అయినటువంటి ఈమె పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ సందడి చేస్తున్నారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి శ్రియ కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నటువంటి నెపోటిజం గురించి అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలను మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్సైడర్-ఔట్సైడర్ డిబేట్ గురించి శ్రియ మాట్లాడుతూ..

ఒకప్పుడు అందరూ బయట వారే షారుక్ ఖాన్ ఇండస్ట్రీలోకి వచ్చేముందు ఆయన కూడా బయట వారే. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని ఈమె తెలిపారు. కొత్తవారిని ఎంకరేజ్ చేస్తే రాణించగలుగుతారని ప్రస్తుత పరిస్ధితులపై రియాక్ట్ అయ్యారు. ఏదేమైనా, నిజంగా మారాల్సిన విషయం ఏమిటంటే.. కథకు సరిపడే హీరో హీరోయిన్స్ ముందుగానే లుక్ టెస్ట్ చేసి సరిపోతారా లేదా అని ఆడిషన్స్ నిర్వహిస్తే బాగుంటుందని తెలిపారు.

లుక్ టెస్ట్..ఆడిషన్స్ చేయాలి..
ఈ విధంగా చేసినప్పుడే ఇండస్ట్రీలో కొత్తవారికి కూడా అవకాశాలు వస్తాయి అంటూ ఈ సందర్భంగా శ్రియ వెల్లడించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి ఈమె మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.