Tag Archives: super star krishna

Super Star Krishna: ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు.. వైరల్ అవుతున్న ప్రోమో వీడియో?

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ ప్రస్తుతం వయసు పై పడటంతో ఈయన సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికి విశ్రాంతి తీసుకుంటున్నారు.ఇకపోతే కృష్ణ కుమార్తె మంజుల యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదివరకే కృష్ణ గారిని ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి హోమ్ టూర్లను వారికి సంబంధించిన వారి హోమ్ టూర్ చేయడం అలవాటుగా మారిపోయింది.ఈ క్రమంలోనే కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని సైతం తన తండ్రి కృష్ణ గారి హోమ్ టూర్ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

కృష్ణ హోమ్ టూర్ వీడియోకి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఇంద్ర భవనం తలపించక మానదు.సకల సౌకర్యాలతో ఎంతో విలాసవంతమైన ఈ ఇంటిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి. ఈ ఇంటిలో విజయనిర్మల గారి విగ్రహంతో పాటు కృష్ణ సినిమాలలో అందుకున్న అవార్డులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఆకట్టుకున్న విజయనిర్మల విగ్రహం…

ఇక ఇంద్ర భవనం లాంటి ఈ ఇంటిలో అన్ని సదుపాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కృష్ణ గ్యారేజ్ లో ఉన్న కార్లను కూడా మంజుల ఈ ప్రోమో ద్వారా చూపించారు. ప్రస్తుతం కృష్ణ ఇంటికి సంబంధించిన ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియోని షేర్ చేయనున్నట్లు సమాచారం. మరింకెందుకు ఆలస్యం కృష్ణ గారి ఇంద్రభవనం పై మీరు ఓ లుక్ వేయండి.

Super Star Krishna: 12 ఫ్లాపులు రావడంతో హీరో పనికిరానని పక్కన పెట్టారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణ!

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 31వ తేదీ తన పుట్టినరోజు కావడంతో తాజాగా ఆయన తన కూతురు మంజుల యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణ తన సినీ కెరీర్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలియజేశారు. కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ హీరోగా కృష్ణ నిలదొక్కుకొని ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులకు అందించిన ఘనత కృష్ణ గారిదని చెప్పాలి.

Super Star Krishna: 12 ఫ్లాపులు రావడంతో హీరో పనికిరానని పక్కన పెట్టారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణ!

కృష్ణ అప్పట్లో కౌబాయ్, జేమ్స్ బ్యాండ్ తరహా కథలను ప్రేక్షకులకు అందించారు. ఇక ఈయన నటించిన సింహాసనం సినిమా బాహుబలి స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.ఈ విధంగా విభిన్న కథా చిత్రాలతో ముందుకు సాగిపోతున్న కృష్ణ కెరీర్లో కూడా కోలుకోలేని దెబ్బ పడింది.

Super Star Krishna: 12 ఫ్లాపులు రావడంతో హీరో పనికిరానని పక్కన పెట్టారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణ!

ఈయన నటించిన 12 చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈయన కెరియర్ అయోమయ స్థితిలో పడింది. ఆ సమయంలో ఎంతో మంది దర్శక నిర్మాతలు కృష్ణ హీరోగా పనికిరారు ఆయన సినీ కెరీర్ ముగిసింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎలాంటి అవకాశాలు కూడా రాలేదు.

ఇండస్ట్రీలో తిరిగి లైఫ్ ఇచ్చిన సినిమా అది…

ఆ సమయంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును నిర్మాతగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్‌లో పాడి పంటలు అనే సినిమా చేశారు.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు గురించి ఈ సందర్భంగా కృష్ణ వెల్లడించారు.

Flash Back : కెరీర్ తొలినాళ్ళలోనే సూపర్ స్టార్ కృష్ణ సాహసంతో… టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు..

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తేనెమనసులు సినిమాతో తొలిసారిగా హీరోగా పరిచయమై దాదాపు నాలుగు దశాబ్దాల పైన సాగిన సినీ ప్రస్థానంలో దాదాపు 340 సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా కృష్ణ నటించిన పలు సినిమాల ద్వారా కొత్త సాంకేతికతలను జోనర్లను పరిచయం చేశారు. తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్, తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి 70 ఎంఎం సినిమా లను కృష్ణ తన సినిమాల ద్వారా పరిచయం చేశారు.

ఇకపోతే జేమ్స్ బాండ్ సినిమాలకు సినీ అభిమానులు ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన నో టైం టు డై. ఇది ఇండియాలో కూడా మంచి ఆదరణ పొందింది. అయితే ఇలాంటి జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ను తొలిసారి టాలీవుడ్ కు పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. అయితే మొదటి సారి టాలీవుడ్ లో ఈ జేమ్స్ బాండ్ సినిమా తీయాలనే ఆలోచన 1964లో నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీ లది.

గూడచారిగా కృష్ణ సాహసం….

ఫ్రెంచ్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా ఆధారంగా నిర్మాతలు ఆరుద్ర గారిని ఈ సినిమాకు స్క్రిప్ట్ రాసే బాధ్యతను అప్పగించారట. ఇక దర్శకత్వ బాధ్యతలను ఎం మల్లికార్జునరావు గారికి అప్పగించారు. అయితే కృష్ణ గారు సినిమా ప్రస్థానంలో ఇంకా మొదటి దశలోనే ఉన్నారు ఆయనకు ఇంకా ఇమేజ్ రాలేదు. అలాంటి సమయంలో ఇలాంటి సినిమా తీయడం అంటే ఒక సవాలుగానే చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఈ సవాలును స్వీకరించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కెమెరామెన్ కూడా ఇది ఒక సవాలుగానే ఉంటుంది. ఈ బాధ్యతలను విఎస్ఆర్ స్వామి స్వీకరించారు. చలపతి రావు గారు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక కృష్ణ కు జోడీగా జయలలిత గారిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో శోభన్ బాబు గారు గా నటించడం విశేషం. రేలంగి-ముక్కామల-రావికొండలరావు- వెన్నిరాడై నిర్మల  తదితరులు నటించారు.

ఇన్ని సాహసాలతో 1966 ఆగస్టు 11న ఒక కొత్త ట్రెండ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ విజయం సాధించింది గూడచారి 116. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ చేసిన యాక్షన్ సీన్లకు, తెర మీద చూపించిన సరికొత్త అద్భుతాలకు అభిమానులు ఫిదా అయ్యారు. తర్వాత వచ్చిన హీరోలలో చిరంజీవి సుమన్ లాంటి హీరోలు జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను ట్రై చేసినా కృష్ణ చేసిన గూడచారి 116 సినిమా మాత్రం తెలుగు సినీ అభిమానుల గుండెల్లో నిలిచి పోయింది.

Super Star Krishna: ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్ “మీరు రాయక్కర్లేదు.. మేము తీయక్కర్లేదు పొండి” అన్నారు… ఎన్టీఆర్ గురించి కృష్ణ షాకింగ్ కామెంట్స్!

Super Star Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప కథానాయకులుగా పేరు సంపాదించుకున్న వారిలో నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నందమూరి తారకరామారావు హీరోగా చేస్తున్న సమయంలో కృష్ణ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.ఇకపోతే కృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే గతంలో ఒక సినిమా విషయంలో ఎన్టీఆర్,కృష్ణ మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు వచ్చాయని ఆ సినిమా కారణంగా వీరి ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని మనకు తెలిసిందే. ఆ సినిమానే అల్లూరి సీతారామరాజు. తాజాగా కృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సమయంలో కృష్ణ కాలేజీకి వెళ్తున్నానని ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాలు ఏవి వచ్చిన తప్పనిసరిగా ఆ సినిమా చూసే వాడినని తెలిపారు.ఈ క్రమంలోనే అగ్గి రాముడు సినిమాలో బుర్ర కథలో భాగంగా అల్లూరి సీతారామరాజు కథ చెప్పినప్పుడు ఎంతో ఇన్స్పైర్ అయ్యారని కృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమాని ఎన్టీఆర్ హీరోగా చేస్తే చూడాలని ఉంది అంటూ భావించారు. ఇక తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పదకొండవ చిత్రం అసాధ్యుడు సినిమాలో సీతారామరాజు అంతర్నాటకం పెట్టారు. ఈ నాటకంలో అల్లూరి పాత్రలో నటించానని ఈ పాత్రను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి 100% నచ్చిందని కృష్ణ వెల్లడించారు. ఇక అల్లూరి సీతారామరాజు సినిమా ఎప్పుడు చేస్తారంటూ ప్రతిసారి ఎన్టీఆర్ ను అడిగినప్పుడు ఉండవయ్య నువ్వు, తర్వాత చూస్తాను.. ఇప్పుడు కాదు అని సమాధానం చెప్పేవారు. కానీ ఈ సినిమాని మాత్రం చేయలేదు.

ఈ క్రమంలోనే దేవుడు చేసిన మనుషులు తర్వాత తానే అల్లూరి సీతారామరాజు కథను అనౌన్స్ చేసి సినిమా చేశాను. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చేసిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఎన్టీఆర్ కు తనకు మాటలు లేవని కృష్ణ తెలిపారు. ఇక ఒక సందర్భంలో భాగంగా రచయితల అందరితో కలిసి మాట్లాడిన ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు కథ చేద్దాం కథ రాయమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు.

ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ తో మాట్లాడుతూ మీరు ఏమి అనుకోకపోతే మాది ఒక చిన్న విన్నపం ముందు మీరు కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూడండి ఆ సినిమా చూసిన తర్వాత మీరు సినిమా చేస్తాను అంటే మేము కథ ఇస్తాము అని చెప్పారు. అయితే ఒక సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ కృష్ణ పక్క పక్క రూములోనే మేకప్ వేసుకుని బయటకు రాగా ఎన్టీఆర్ బ్రదర్ అని పిలిచారు.

ఇంతకన్నా అద్భుతంగా ఎవరు నటించలేరు….

మీరు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ఇప్పటి వరకు నేను చూడలేదు అయితే నేను ఆ సినిమాని చూడాలనుకుంటున్నాను అది కూడా మీరు పక్కన ఉంటేనే నేను చూస్తాను అంటూ చెప్పారు. ఎన్టీఆర్ ఇలా చెప్పడంతో అప్పటికప్పుడు ఈ సినిమా రీల్ తెప్పించి చూసే ఏర్పాట్లు చేసాము. ఇలా పూర్తి సినిమా చూసిన ఎన్టీఆర్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది ఇంత కన్నా అద్భుతంగా ఎవరు చేయలేరు గుడ్ జాబ్ బ్రదర్ అంటూ తనని ప్రశంసించారని కృష్ణ వెల్లడించారు. ఇక ఈ సినిమా చూసిన తరువాత పరుచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ ను కలిసి అన్నగారు అల్లూరి సీతారామరాజు కథ రాయమంటారా? అని అడిగారు. దీంతో మీరు రాయనక్కర్లేదు మేము తీయాల్సిన పని లేదు… ఇంత కన్నా అద్భుతంగా ఇంకెవరూ చేయలేరు అంటూ అల్లూరి సీతారామరాజు సినిమా గురించి ఎన్టీఆర్ ప్రశంశలు అందించారని కృష్ణ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Krisha – Rajnikanth : ఈ ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి నటించిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెట్టింది.!!

ఒక హీరో తెలుగులో సూపర్ స్టార్ అయితే మరొక హీరో తమిళంలో సూపర్ స్టార్. వీరిద్దరూ కలిసి నటించే సమయానికి సూపర్ స్టార్ కృష్ణ “స్టార్” గా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. అలా తెలుగు, తమిళ సూపర్ స్టార్ లు కలిసి నటించిన చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఎలా పరుగులు పెట్టిందో చూద్దాం…”

అన్నదమ్ముల సవాల్ ” 1978 లో విడుదలైన తెలుగు నాటక చిత్రం. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, రజనీకాంత్, జయచిత్ర, చంద్రకళ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కన్నడంలో విష్ణువర్ధన్, రజనీకాంత్ లు కలసి నటించిన “సహోదర సవాల్” ను పునర్నిర్మించిన చిత్రం. కన్నడంలో చిత్రానికి కూడా కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు. రెండు చిత్రాలకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు. కన్నడ పాట “హే నానాగాగాయియే” యొక్క తెలుగు వెర్షన్ “నాకోసమే నీవున్నదీ” అలానే ఉంచబడింది. “నీ రూపమే” అనే పాటను” ఓ నల్లనే సవి మథోండా” స్థానంలో ఉంచబడింది. ఈ పాటను చెళ్లపిళ్ల సత్యం కన్నడ చిత్రం “సీతారాములు” లో “ఈ రూపావె నానీ బాలినా” గా ఉపయోగించారు.

ఇద్దరు సోదరులు (కృష్ణ , రజనీకాంత్) మధ్య ఘర్షణ జరగి విడిపోవడం, చివరికి వారు ఎలా ఏకం అవుతారు అనే అంశంపై కథ రాయబడింది. జయచిత్ర, చంద్రకళ వరుసగా తమ ప్రేమ అభిరుచులను పోషిస్తారు. అంజలీ దేవి సహాయక తారాగణంలో హలాం, జయమాలిని, చలం, అల్లు రామలింగయ్యలతో కలిసి తల్లిగా నటించింది. 1978 లో విడుదలైన పొట్టేలు పున్నమ్మ,కటకటాల రుద్రయ్య.. అలాగే ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ “రామకృష్ణులు” వంటి చిత్రాలతో పోటీపడి “అన్నదమ్ముల సవాల్” చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి ఆనాటి విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Krishna – Jayaprada: సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కాంబినేషన్ రికార్డును ఎవరైనా దాటగలరా.!!

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన కథానాయకుడు. 1964 కంటే ముందు కృష్ణ కొన్ని చిత్రాల్లో చిన్న వేషాలు వేసినప్పటికీ ఆ తర్వాత హీరోగా నటించడం మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగిన అతని సినీ జైత్రయాత్ర లో…ఆయనా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ.. యువ హీరోలకు సైతం పోటీనిచ్చిన హీరోగా చెప్పుకోవచ్చు. దాదాపు 350 పైచిలుకు చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ అనిపించుకున్నారు .హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక చిత్రాల్లో నటిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగడించారు.

1964 దర్శకుడు ఆదుర్తిసుబ్బారావు తను తీస్తున్న సినిమాకి నూతన నటీనటులు కావాలని పేపర్ యాడ్ ఇచ్చారు. అది చదివిన హీరో కృష్ణ తన ఫోటోలను మద్రాస్ పంపించారు. అనేక వడపోతల తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణని ఈ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంపికచేయడం జరిగింది. అలా ఆ సినిమాలో హీరోగా మొదలైన హీరో కృష్ణ సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ ఆకాశమే హద్దుగా అనేక చిత్రాల్లో నటించారు. అయితే కృష్ణ, జయప్రద ఇద్దరిదీ హిట్ కాంబినేషన్. వీరిద్దరు 43 చిత్రాల్లో కలిసి నటించారు. విజయా సంస్థ, బాపు దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంతో కృష్ణ, జయప్రదల కాంబినేషన్ మొదలయింది.

రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976). మన ఊరి కథ(1976), ఈనాటి బంధం ఏనాటిదో (1977), దొంగలకు దొంగ (1977), అల్లరి బుల్లోడు(1978), ఏజెంట్ గోపి (1978), దొంగల వేట (1978), కుమార్ రాజా (1978), అతనికంటే ఘనుడు (1978), వియ్యాలవారి కయ్యాలు (1979), దొంగలకు సవాల్ (1979), కొత్త అల్లుడు(1979), మండే గుండెలు (1979), శంఖుతీర్థం (1979), భలే కృష్ణుడు (1980), కొత్తపేటరౌడీ (1980), రగిలే హృదయాలు (1980), బండోడు గుండమ్మ(1980), అల్లరి బావ(1980), ఊరికి మొనగాడు (1981), రహస్య గూడచారి(1981), జతగాడు(1981), మాయదారి అల్లుడు(1981), నివురుగప్పిన నిప్పు(1982), జగన్నాధ రథచక్రాలు (1982), పగబట్టిన సింహం(1982), ఏకలవ్య(1982), ముందడుగు(1983), సిరిపురం మొనగాడు (1983), ప్రజారాజ్యం(1983), యుద్ధము(1984), నాయకులకు సవాల్ (1984), బంగారు కాపురం(1984), మహాసంగ్రామం(1985), సూర్య చంద్ర (1985), మహామనిషి(1985), కృష్ణ గారడి(1985), సింహాసనం (1986), తేనె మనసులు (1987), విశ్వనాథనాయకుడు (1987), కలియుగ కర్ణుడు(1988), అత్త మెచ్చిన అల్లుడు(1989)…

ఓ దశాబ్దం పాటు వీరి కలయికలో తిరిగి ఏ సినిమా రాలేదు. అలా చివరగా ఉమాకాంత్ దర్శకత్వంలో “చంద్రవంశం” (2002) చిత్రంలో వీరిద్దరూ నటించి నలభై మూడు చిత్రాలను నిర్విరామంగా పూర్తిచేశారు. ఈ సినిమాలలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “ఊరికి మొనగాడు” చిత్రం, బాపయ్య దర్శకత్వంలో వచ్చిన “ముందడుగు” చిత్రం అదేవిధంగా కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన “సింహాసనం” సినిమా బాక్సాఫీసు వద్ద విజయ దుందుభి మోగించాయి. ఇప్పుడు తెలుగులో వస్తున్న ఏ హీరో,హీరోయిన్ కూడా కృష్ణ జయప్రద కాంబినేషన్ రికార్డును అధిగమించడం సందేహమే.

సూపర్ స్టార్, మెగాస్టార్ నటించిన ఈ రెండు చిత్రాలలో ఏది హిట్టు.. ఏది ఫట్టు.?!

1980 ప్రథమార్థంలో చిరంజీవి కథానాయకునిగా నటిస్తూ కొన్ని సినిమాల్లో ప్రతి కథానాయకునిగా కనిపించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోల సినిమాలలో రెండో కథానాయకుడిగా నటించారు. ఆ క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుని తనను తాను నిరూపించుకున్నారు.

ముఖ్యంగా అప్పటి పోటీని తట్టుకోవడానికి చిరంజీవి డాన్స్, ఫైట్స్ మీద ఎక్కువగా శ్రద్ద చూపడంతో సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలిగారు. 1981లో ప్రియా, తోడుదొంగలు, ఆడవాళ్లు మీకు జోహార్లు, 47రోజులు, ఊరికిచ్చినమాట, శ్రీరస్తూ శుభమస్తూ, రాణి కాసులరంగమ్మ , ప్రేమనాటకం వంటి చిత్రాలలో ఆయన నటించారు.

1981 శ్రీకర్ ప్రొడక్షన్స్, సత్యనారాయణ నిర్మాణం, ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో “చట్టానికి కళ్లులేవు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. “సట్టం ఓరు ఇరుత్తరై” అనే తమిళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తూ “చట్టానికి కళ్ళులేవు” అనే చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో చిరంజీవికి సమవుజ్జీగా పోలీస్ పాత్రలో అలనాటి నటి లక్ష్మి నటించారు. కృష్ణచక్ర సంగీత సారధ్యంలో వచ్చిన.. ‘చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు..న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు’.. అనే పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది.

1983 వచ్చేసరికి సూపర్ స్టార్ కృష్ణ అనేక చిత్రాల్లో నటిస్తూ మంచి ఊపులో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన సిరిపురం మొనగాడు, అడవి సింహాలు, ఊరంతాసంక్రాంతి, కిరాయికోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, అమాయకుడు కాదు అసాధ్యుడు, ముందడుగు లాంటి చిత్రాల్లో నటించారు. నటి విజయనిర్మల 1971 “మీనా” చిత్రం ద్వారా దర్శకురాలిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ విధంగా కృష్ణ నటించిన దేవదాసు, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీం, కిలాడి కృష్ణుడు, భోగిమంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకెబిందెలు, సూర్యచంద్ర, సాహసమే నా ఊపిరి, అజాతశత్రువు లాంటి చిత్రాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు.

1983 రంజిత్ ఆర్ట్స్,రంజిత్ కుమార్ నిర్మాణం, విజయనిర్మల దర్శకత్వంలో “చట్టానికి వేయి కళ్ళు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ, జయసుధ, మాధవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్, ఆనంద్ పాత్రలతో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో రావుగోపాలరావు, అల్లురామలింగయ్య, నూతన్ ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి హీరోగా నటించిన “చట్టానికి కళ్ళు లేవు” చిత్రం విజయాన్ని సాధించగా “చట్టానికి వేయి కళ్ళు” చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

సామ్యవాద ముసుగులో మసాలా సినిమా.. అని ఆ రోజుల్లో ఈ బ్లాక్ బస్టర్ గురించి ఓ పత్రిక ఎందుకు రాయాల్సివచ్చింది.?!

స్వయంకృషితో వచ్చిన అతి కొద్ది మంది దర్శకుల్లో కె.బాపయ్య ఒకరు “ప్రేమ్ నగర్” చిత్రానికి కె.ఎస్. ప్రకాశరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత 1970లో ఎస్.వి.రంగారావు ప్రధాన పాత్రలో “ద్రోహి” అనే చిత్రానికి మొదటి సారిగా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుతో రూపొందించిన “ఎదురులేని మనిషి” చిత్రం డిసెంబర్ 12, 1975 న విడుదలై 6 సెంటర్ లలో వందరోజులు ఆడి మంచి విజయం సాధించడంతో కె.బాపయ్యకు మంచి పేరు వచ్చింది.

అదే సంవత్సరం శోభన్ బాబు తో తీసిన “సోగ్గాడు” చిత్రం డిసెంబర్ 19, 1975న విడుదలై 19 సెంటర్లలో వందరోజులు ఆడి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కె.బాపయ్యను మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఆ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ లో మరో అవకాశం వచ్చింది. డి.రామానాయుడు, కె.బాపయ్య మంచి కథ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. అప్పటికే చలిచీమలు, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈ చరిత్ర ఏ సిరాతో లాంటి సామ్యవాద భావాలతో కూడిన చిత్రాలకు కథలు రాసి సాధారణ విజయాలతో ముందుకు వెళుతున్న పరుచూరి సోదరులను కలవడం జరిగింది.

1983 జనవరిలో సురేష్ ప్రొడక్షన్స్, కె.బాపయ్య దర్శకత్వంలో మల్టీస్టారర్ “ముందడుగు” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, జయప్రద, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలలో గుమ్మడి వెంకటేశ్వరరావు, శివకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. శివకృష్ణ ప్రజాస్వామ్య ఆలోచనలు, అభ్యుదయ భావాలు గల వ్యక్తి సమసమాజ స్థాపన ద్యేయంగా.. శివకృష్ణ తమ ఆస్తిని ప్రజలకు పంచుతాడు. పెట్టుబడిదారి విధానం ఆలోచనల గల రావుగోపాల్ రావు ఒక సంస్థను స్థాపిస్తారు. శోభన్ బాబు కోటీశ్వరుడుగా నటించగా.. హీరో కృష్ణ లారీడ్రైవర్ గా నటించారు.

ప్రజాస్వామ్య, సామ్యవాద కమ్యూనిజం సిద్ధాంతాల భావజాలం చుట్టూ కథ నడుస్తుంది. కమర్షియల్ హంగులు అద్దడంతో ఆ రోజుల్లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీలో కృష్ణ సినిమాల్లో ఓక కోటి రూపాయిల గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత డి.రామానాయుడు రజతోత్సవాన్ని చెన్నై “తాజ్ హోటల్” లో నిర్వహించారు. అయితే ఈ అద్భుత విజయాన్ని గురించి ఆ రోజుల్లో కొన్ని పత్రికలు కీర్తించాయి. ముఖ్యంగా సితార సినీ పత్రిక “ముందడుగు” చిత్రం గురించి సామ్యవాద భావాలు గల మసాలా చిత్రమని రాయడం సినీ పరిశ్రమలో అప్పట్లో చర్చనీయాంశమైంది.

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వల్లే మహేష్ బాబు ఈ స్టేజ్ లో ఉన్నారా.. ప్లాన్ మాములుగా లేదుగా!

MaheshBabu: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో అతడు నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తన నట వారసత్వాన్ని మమేష్ బాబు పునికి పుచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వల్లే మహేష్ బాబు ఈ స్టేజ్ లో ఉన్నారా.. ప్లాన్ మాములుగా లేదుగా!

ఇక ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన సినీ కెరీర్ విషయంలో తన తండ్రి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడని.. చిన్న తనంలో ఐదారేళ్ల వయస్సులోనే తనతో ఐదు సినిమాల్లో నటించే విధంగా ప్లాన్ చేశాడన్నారు.

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వల్లే మహేష్ బాబు ఈ స్టేజ్ లో ఉన్నారా.. ప్లాన్ మాములుగా లేదుగా!

చిన్న తనంలో చదువుకునే సమయంలో ఏప్రిల్, మే నెలలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల షూటింగ్ ఎక్కువగా ఊటీలో ఉండే విధంగా చూసుకునే వారట. అలా చేయడంతో మహేష్ బాబు కూడా అతడితో వెళ్లి.. అక్కడే సమ్మర్ హాలిడేస్ లో సినిమాల్లో నటించేవిధంగా ప్లాన్ చేసేవాడట.

రాత్రి పడుకునే టైంలో ఫ్యామిలీతో..


ఇలా చిన్నతనం నుంచే మహేష్ బాబు నటిస్తుండటంతో కెమెరా అంటే ఏ మాత్రం భయం లేకుండా నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. నటించడం అంటే మామూలు పనే కదా అనే ఫీల్‌ వచ్చిందట. అంత సింపుల్‌గా నా కెరీర్‌ మలిచేశారు నాన్న అంటూ మహేష్‌ గొప్పగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన తండ్రి సంవత్సరంలో ప్రతీ రోజు సినిమాలకే టైం కేటాయించేవాడని చెప్పాడు. అలా అని ఫ్యామిలీకి దూరంగా ఉండేవాడు కాదట. లంచ్ టైంలో.. ఉదయం టిఫిన్ టైంలో.. రాత్రి పడుకునే టైంలో ఫ్యామిలీతో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారని చెప్పాడు మహేష్ బాబు. అలా ప్లాన్ చేసుకునే విధంగా తాను కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. కెరీర్ పరంగా ఎంత బిజీ ఉన్నా.. ఫ్యామిలీతో టైం కేటాయించడం అనేది ముఖ్యమైనది అంటూ చెప్పాడు.

Mahesh Babu: ఎన్టీఆర్‌-కృష్ణల మధ్య వైరం నిజమేనా..? మహేష్ బాబు ఏమన్నారో తెలుసా?

Mahesh Babu: నందమూరి బాలకృష్ణ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన ‘ అఖండ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ లు క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే వందకోట్ల సినిమాగా నిలిచింది. ఇటు సినిమాతోనే కాకుండా.. ఓటీటీలో ప్రారంభమైన ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో అదరగొడుతున్నారు.

Mahesh Babu: ఎన్టీఆర్‌-కృష్ణల మధ్య వైరం నిజమేనా..? దీనిపై మహేష్ బాబు ఎమన్నారంటే..!


ఇప్పటికే ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ఇప్పటికే బాలయ్య… రాజమౌళి, బన్నీ, బోయపాటి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి వారితో టాక్ షో నిర్వహించారు. తాజాగా అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఇప్పుడు ఇది అందరిలోనూ ఆసక్తి క్రియేట్ చేస్తోంది.

Mahesh Babu: ఎన్టీఆర్‌-కృష్ణల మధ్య వైరం నిజమేనా..? దీనిపై మహేష్ బాబు ఎమన్నారంటే..!

అయితే గతంలో నందమూరి తారకరామారావు- సూపర్‌స్టార్‌ కృష్ణ మధ్య వైరం ఉండేదని అందరూ అనుకుంటారు. ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలను కూడా కృష్ణ తీశారని అభిమానులు అనుకుంటారు. సినిమాలతో పాటు పొలిటికల్ గా కూడా వీరిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయంటూ అందరూ అనుకుంటారు. 

సినిమా తర్వాత సినిమాను చూసి..


అయితే ఈ వివాదంపై మహేష్ బాబు అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్-కృష్ణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న గారితో ఎన్టీఆర్  గారికి గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని అని అన్నారు. ఈ సినిమా తర్వాత సినిమాను చూసి ఎన్టీఆర్ గారు ఎంతో అభినందించారని నాన్న ఎప్పుడూ అంటూ ఉండే వారిని మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్ లో వైరల్ అయ్యాయి.