1980 ప్రథమార్థంలో చిరంజీవి కథానాయకునిగా నటిస్తూ కొన్ని సినిమాల్లో ప్రతి కథానాయకునిగా కనిపించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోల సినిమాలలో రెండో కథానాయకుడిగా నటించారు. ఆ క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుని తనను తాను నిరూపించుకున్నారు.
ముఖ్యంగా అప్పటి పోటీని తట్టుకోవడానికి చిరంజీవి డాన్స్, ఫైట్స్ మీద ఎక్కువగా శ్రద్ద చూపడంతో సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలిగారు. 1981లో ప్రియా, తోడుదొంగలు, ఆడవాళ్లు మీకు జోహార్లు, 47రోజులు, ఊరికిచ్చినమాట, శ్రీరస్తూ శుభమస్తూ, రాణి కాసులరంగమ్మ , ప్రేమనాటకం వంటి చిత్రాలలో ఆయన నటించారు.
1981 శ్రీకర్ ప్రొడక్షన్స్, సత్యనారాయణ నిర్మాణం, ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో “చట్టానికి కళ్లులేవు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. “సట్టం ఓరు ఇరుత్తరై” అనే తమిళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తూ “చట్టానికి కళ్ళులేవు” అనే చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో చిరంజీవికి సమవుజ్జీగా పోలీస్ పాత్రలో అలనాటి నటి లక్ష్మి నటించారు. కృష్ణచక్ర సంగీత సారధ్యంలో వచ్చిన.. ‘చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు..న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు’.. అనే పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
1983 వచ్చేసరికి సూపర్ స్టార్ కృష్ణ అనేక చిత్రాల్లో నటిస్తూ మంచి ఊపులో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన సిరిపురం మొనగాడు, అడవి సింహాలు, ఊరంతాసంక్రాంతి, కిరాయికోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, అమాయకుడు కాదు అసాధ్యుడు, ముందడుగు లాంటి చిత్రాల్లో నటించారు. నటి విజయనిర్మల 1971 “మీనా” చిత్రం ద్వారా దర్శకురాలిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ విధంగా కృష్ణ నటించిన దేవదాసు, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీం, కిలాడి కృష్ణుడు, భోగిమంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకెబిందెలు, సూర్యచంద్ర, సాహసమే నా ఊపిరి, అజాతశత్రువు లాంటి చిత్రాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు.
1983 రంజిత్ ఆర్ట్స్,రంజిత్ కుమార్ నిర్మాణం, విజయనిర్మల దర్శకత్వంలో “చట్టానికి వేయి కళ్ళు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ, జయసుధ, మాధవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్, ఆనంద్ పాత్రలతో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో రావుగోపాలరావు, అల్లురామలింగయ్య, నూతన్ ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి హీరోగా నటించిన “చట్టానికి కళ్ళు లేవు” చిత్రం విజయాన్ని సాధించగా “చట్టానికి వేయి కళ్ళు” చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…