Hero Venkat: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు వెంకట్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరో సోదరుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే వెంకట్ ఇండస్ట్రీలో హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు.ఇక ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పలు సినిమాలలో కీలకపాత్రలో సైడ్ క్యారెక్టర్ గా ఏఎన్ఆర్ నటించారు.
ఈ విధంగా హీరో వెంకట్ నటించిన శ్రీ సీతారాముల కల్యాణం చూద్దాము రారండి. వెంకట్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మంచి విజయం అందుకున్న తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఈయనకు ఏ సినిమా పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు అని చెప్పవచ్చు.
ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ సరైన బ్రేక్ రాకపోవడంతో ఆయన కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక తాజాగా ఈయన లూసర్ సీజన్ 2వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకట్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ… శ్రీ సీతారాముల కళ్యాణం సినిమాలో అనుకున్న విధంగా రియాక్షన్ రాకపోతే ఎన్నో టేకులు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో విసిగిపోయిన ఏఎన్ఆర్ లాగిపెట్టి ఒక్కటి చెంపపై కొట్టారు. ఇలా కొట్టడం వల్ల ఆ సన్నివేశానికి తగ్గ రియాక్షన్ బయటపడిందని అందుకోసమే ఆయన తనను కొట్టారని ఈ ఇంటర్వ్యూలో వెంకట్ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…