Super Star Krishna: 12 ఫ్లాపులు రావడంతో హీరో పనికిరానని పక్కన పెట్టారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణ!
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 31వ తేదీ తన పుట్టినరోజు కావడంతో తాజాగా ఆయన తన కూతురు మంజుల యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణ తన సినీ కెరీర్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలియజేశారు. కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ హీరోగా కృష్ణ నిలదొక్కుకొని ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులకు అందించిన ఘనత కృష్ణ గారిదని చెప్పాలి.
కృష్ణ అప్పట్లో కౌబాయ్, జేమ్స్ బ్యాండ్ తరహా కథలను ప్రేక్షకులకు అందించారు. ఇక ఈయన నటించిన సింహాసనం సినిమా బాహుబలి స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.ఈ విధంగా విభిన్న కథా చిత్రాలతో ముందుకు సాగిపోతున్న కృష్ణ కెరీర్లో కూడా కోలుకోలేని దెబ్బ పడింది.
ఈయన నటించిన 12 చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈయన కెరియర్ అయోమయ స్థితిలో పడింది. ఆ సమయంలో ఎంతో మంది దర్శక నిర్మాతలు కృష్ణ హీరోగా పనికిరారు ఆయన సినీ కెరీర్ ముగిసింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎలాంటి అవకాశాలు కూడా రాలేదు.
ఆ సమయంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును నిర్మాతగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్‌లో పాడి పంటలు అనే సినిమా చేశారు.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు గురించి ఈ సందర్భంగా కృష్ణ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…