Featured

Hero Raja : 14యేళ్ల లోపే.. తల్లిదండ్రులు మరణించారు.. ఆర్థిక బాధలతో ఆత్మహత్య ప్రయత్నం.. చివరికి హోటల్ లో పనిచేశాడు.!!

ప్రేమ, ఆత్మాభిమానం, తృప్తి వంటి అంశాలతో కూడిన “ఆనంద్” సినిమా అనగానే టక్కున గుర్తుకు వచ్చే హీరో పేరు రాజా. ఈయన ఒక తెలుగు సినీ నటుడు. రాజా స్వస్థలం విశాఖపట్నం. తల్లి క్రిష్టియన్, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. ఇరువైపులా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళింటికి బంధువులు ఎవరూ వచ్చే వాళ్ళు కాదు. ఆయనకు ఇద్దరు అక్కలు. రాజాకు ఎనిమిదేళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో అమ్మ చనిపోయింది. ఆ సంఘటన వారి జీవితంలో పెద్ద విషాధాన్ని నింపింది. తరువాత వాళ్ళు హైదరాబాదుకి వచ్చేశారు. వ్యాపార రీత్యా వాళ్ళ నాన్న విదేశానికి వెళ్ళాడు. కొద్ది కాలం అక్కడ గడిపిన తర్వాత ఆయన స్వదేశానికి వచ్చేశారు. అయితే వారికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు.

స్వదేశానికి వచ్చిన ఏడాదికే ఆయన గుండెపోటుతో చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికి రాజాకు పద్నాలుగేళ్ళు. రాజాతో పాటు వారి అక్క వాళ్ళు కూడా పెద్ద దిక్కులేకుండా ఉండడాన్ని భరించలేక పోయారు. ఒకానొక దశలో బాగా డిప్రెషన్ కు లోనై ఆత్మ హత్య చేసుకుందామని నిర్ణయించుకుని పురుగుల మందు తాగేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాళ్ళ స్నేహితులు కొంతమంది వచ్చి ఆసుపత్రిలో చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక వాళ్ళు శ్రేయోభిలాషులు కొంతమంది కౌన్సెలింగ్ చేశారు. అన్నింటికీ చావే పరిష్కారం కాదని ధైర్యం చెప్పారు. రాజా హైదరాబాద్ లో పదవ తరగతి పూర్తి చేసి విశాఖపట్నం కుటుంబంతో వెళ్ళిపోయారు. అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయాక తిరిగి హైదరాబాద్ చేరుకొని గ్రీన్ పార్క్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేశారు. అలా ఒక ఏడాది పని చేశాక.. వైజాగ్ వెళ్లి డిగ్రీ పూర్తిచేసిన అనంతరం “లుఫ్థాన్సా ఎయిర్ లైన్స్”లో ఉద్యోగం వచ్చింది.

ఆ ఉద్యోగానికి 3500 మంది పోటీ పడగా ఎంపికైన నలుగురిలో రాజా ఒకరు. ఉద్యోగం రావడంతో వారి కుటుంబ కష్టాలు దాదాపు తీరిపోయాయి. శిక్షణలో ఉండగానే దాదాపు 40,000 జీతం వచ్చేది. తరువాత అది 60,000 కి పెరిగింది. అక్కకి పెళ్ళి చేశాడు. చదువైపోయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. డబ్బు కూడా వెనుకేసుకున్నాడు. అప్పుడు రాజా మనసులో ఏ మూలనో ఉన్న నటుడు కావాలనే కోరిక బయటపడింది. రెండున్నరేళ్ళుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్ళి థియేటర్ యాక్టింగ్ కోర్సులో చేరాడు. అది పూర్తి చేసుకుని స్వదేశానికి చాలా ఆత్మవిశ్వాసంతో తిరిగివచ్చాడు. ఫోటోలను, సర్టిఫికేట్లను చేతపట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాడు. రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నాడు. అవకాశాలు మాత్రం రాలేదు. కొద్ది కాలం తర్వాత విసిగిపోయి ముంబై వెళ్ళి మోడలింగ్ అవకాశాల కోసం అన్వేషించాడు. వీడియో ఆల్బమ్స్ లోనూ, నాటకాల్లోనూ నటించాడు.

అలా ఒకసారి సికింద్రాబాద్ క్లబ్‌లో నాటకం వేయడానికి వచ్చి పాత్రికేయుల కళ్ళలో పడ్డాడు. వారు తమ సమీక్షల్లో రాజా గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ రివ్యూలు చూసిన దగ్గుబాటి రామానాయుడు నుంచి అందుకున్న ఫోన్‌కాల్ సినీ పరిశ్రమలో రాజా తొలివిజయం అని చెప్పవచ్చు. నటుడిగా రాజా మొదటి సినిమా “ఓ చినదానా”. ముంబైలో ఉన్నప్పుడు ఇతడికి ఇ.వి.వి. సత్యనారాయణ కొడుకులతో సంబంధాలుండేవి. వారి ద్వారా ఈ సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. తర్వాత వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ లో అవకాశం వచ్చింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన “విజయం” చిత్రంలో రాజా, గజాల హీరో, హీరోయిన్లుగా నటించారు.

ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ (సినిమా) రాజాకు పేరు తెచ్చిపెట్టింది. అప్పుడప్పుడు, మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు, వెన్నెల, జగన్మోహిని, ఆ నలుగురు లాంటి చిత్రాల్లో రాజా నటించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అతను 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో YSRCP కి మద్దతుగా ప్రచారం చేసాడు. రాజా సినిమా రంగాన్ని విడిచిపెట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. అతను 2014 లో అమృతను వివాహం చేసుకున్నాడు మరియు వారికి లియోరా అనే కుమార్తె ఉంది. రాజా క్రైస్తవుడు మరియు భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్‌లో అతిథి వక్తగా అనేక క్రైస్తవ సమావేశాలకు ఆహ్వానించబడ్డారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago