Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వల్లే మహేష్ బాబు ఈ స్టేజ్ లో ఉన్నారా.. ప్లాన్ మాములుగా లేదుగా!
MaheshBabu: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో అతడు నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తన నట వారసత్వాన్ని మమేష్ బాబు పునికి పుచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు.
ఇక ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన సినీ కెరీర్ విషయంలో తన తండ్రి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడని.. చిన్న తనంలో ఐదారేళ్ల వయస్సులోనే తనతో ఐదు సినిమాల్లో నటించే విధంగా ప్లాన్ చేశాడన్నారు.
చిన్న తనంలో చదువుకునే సమయంలో ఏప్రిల్, మే నెలలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల షూటింగ్ ఎక్కువగా ఊటీలో ఉండే విధంగా చూసుకునే వారట. అలా చేయడంతో మహేష్ బాబు కూడా అతడితో వెళ్లి.. అక్కడే సమ్మర్ హాలిడేస్ లో సినిమాల్లో నటించేవిధంగా ప్లాన్ చేసేవాడట.
ఇలా చిన్నతనం నుంచే మహేష్ బాబు నటిస్తుండటంతో కెమెరా అంటే ఏ మాత్రం భయం లేకుండా నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. నటించడం అంటే మామూలు పనే కదా అనే ఫీల్ వచ్చిందట. అంత సింపుల్‌గా నా కెరీర్ మలిచేశారు నాన్న అంటూ మహేష్ గొప్పగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన తండ్రి సంవత్సరంలో ప్రతీ రోజు సినిమాలకే టైం కేటాయించేవాడని చెప్పాడు. అలా అని ఫ్యామిలీకి దూరంగా ఉండేవాడు కాదట. లంచ్ టైంలో.. ఉదయం టిఫిన్ టైంలో.. రాత్రి పడుకునే టైంలో ఫ్యామిలీతో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారని చెప్పాడు మహేష్ బాబు. అలా ప్లాన్ చేసుకునే విధంగా తాను కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. కెరీర్ పరంగా ఎంత బిజీ ఉన్నా.. ఫ్యామిలీతో టైం కేటాయించడం అనేది ముఖ్యమైనది అంటూ చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…