Tag Archives: surya

హీరో సూర్యకి బెదిరింపులు.. అతనిపై దాడి చేస్తే లక్ష రూపాయల బహుమానం..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో పలువురు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం మరికొందరు మాత్రం హీరో దర్శక నిర్మాతలపై విమర్శలు కురిపిస్తున్నారు. జై భీమ్ చిత్రంలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేశారంటూ జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడు పై చర్యలు తీసుకోవాలని పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసులకి వినతిపత్రం అందించారు.వన్నియార్‌ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి లక్ష రూపాయల బహుమానం ప్రకటించారు.

జై భీమ్ చిత్ర నిర్మాత 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని వన్నియార్ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై చిత్ర బృందం స్పందిస్తూ ఒక వర్గానికి కించపరిచే విధంగా ఈ సినిమాను తీయలేదని ఒక వర్గానికి చెందిన మహిళ ఏ విధంగా న్యాయపోరాటం చేసిన ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.

అయితే సూర్యకు బెదిరించడంతో మరికొందరు హీరో సూర్య కు మద్దతుగా నిలబడుతున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు సైతం సూర్యకు మద్దతుగా నిలబడుతున్నారు.

జై భీమ్ వల్ల సూర్యకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?

2020 సంవత్సరంలో ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటూ.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. దీనిలో నటించిన ప్రతీ ఒక్క నటీనటులకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. రియల్ అడ్వకేట్ అయిన చంద్రు క్యారెక్టర్ ను సూర్య పోషించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా చంద్రు బాధ్యతలు నిర్వహించారు. మానవ హక్కులకు సంబంధించిన 96,000 కేసులను చంద్రు పరిష్కరించారు.

అయితే ఈ సినిమాలో అమాయకులైన ఓ కుటుంబాన్ని అక్రమంగా పోలీసులు ఓ కేసులో ఇరికించి చిత్ర హింసలు పెడతారు. ఇదే ఈ సినిమాకు మెయిన్ పాయింట్.ఇక పోతే ఇటీవల రియల్ సినతల్లికి డ్యాన్స్ మాస్టార్ ఇల్లు కట్టిచ్చి ఇస్తాన్నన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వల్ల సూర్యకు ఎంత లాభం వచ్చిందో తెలుసా.. దానిపై సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను 10 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి చిత్రీకరించగా అమెజాన్లో రూ.45 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంతే సూర్యాకు దాదాపు రూ.35 కోట్లు లాభం వచ్చినట్లు. అంతే కాకుండా ఈ సినిమా గూగుల్ యూజర్లకు తెగ నచ్చేసింది. 97 శాతం మంది గూగుల్ యూజర్లు ఈ చిత్రం చాలా బాగుంది అంటూ కొనియాడారు. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా.. ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసింది.

మరో రికార్డు స్పష్టించిన జై భీమ్.. భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా..!

ఇటీవల అమెజాన్‌ ఓటీటీలో రిలీజ్ అయిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య అద్భుతంగా నటించాడు. దీనిలో సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించేసింది.

దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌. అయితే ఈ చిత్రం మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (IMDB- Internet Movie Data Base) సినిమాల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమాకు 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

97 శాతం మంది గూగుల్ యూజర్లు ఇష్టపడ్డారు. ఈ సినిమా కంటే ముందు ఈ స్థానంలో 1994లో విడుదలైన ది షాషాంక్ రిడంప్షన్‌ సినిమా 9.3తో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్తానంలో జై భీమ్ సినిమా 9.6 రేటింగ్ తో మొదటి స్థానం సంపాదించింది.

ఇక ప్రపంచ ప్రఖ్యాత సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ మూడో స్థానంలో నిలిచింది. ‘ది డార్క్ నైట్’ మూవీ 9.0/10తో నాల్గో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఓటీటీలో సూర్య నటించిన సినిమా ఆకాశమే హద్దురా సినిమా కూడా టాప్ టెన్ లో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాతో సూర్య తన రికార్డును తానే తిరగరాశాడు.

కావాలనే నన్ను వివాదంలోకి లాగుతున్నారు.. ఆ సన్నివేశంలో తప్పేంటి: ప్రకాష్ రాజ్

ఇటీవల సూర్య హీరోగా నటించిన జై భీమ్ విజయవంతంగా అమెజాన్ ఓటీటీలో రన్ అవుతోంది. టాప్ లో ఆ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దీనిలో రావు రమేష్, సూర్య మధ్య జరిగే సన్ని వేశాలు అమోఘం అని చెప్పాలి. వీరిద్దరు వకీల్ పాత్రలో నటించారు. ఇక చిన్నతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ అద్భుతంగా నటించింది.

ఆమె డీ గ్లామర్ గా మారి తన నటనతో అందరి మన్ననలు పొందింది. ఒక లాయర్ చంద్రు నిజ జీవిత కథ ఆధారంగా తీసినది ఈ సినిమా. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సమాజంలో వైరల్ గా మారింది. ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ స్పందన చూస్తుంటే మంచి కథలు తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.

అయితే దీనిలో ఓ సన్నివేశం కొంతమంది వివాదం స్పష్టిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ సీబీఐ ఎంక్వైరీ చేసే ఆఫీసర్ పాత్రలో నటించాడు. దీనిలో ఓ వ్యక్తిని విచారించే క్రమంలో అతడు హిందీలో మాట్లాడుతుంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అతడిని తెలుగులో మాట్లాడు అంటూ చెంప దెబ్బ కొట్టి హెచ్చరిస్తాడు. ఇది హిందీ భాషను అవమానించడమే అంటూ కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించాడు.

దీనిలో అణగారిన వర్గాల బాధని పూర్తిగా చూపించామని.. వాళ్లు పడే ఇబ్బందులు, కష్టాలను చూపించామన్నారు. ఇవన్ని పక్కన పెట్టేసి కేవలం చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తాను ఈ సినిమాలో నటించాన్న కారణంతోనే ఎక్కువగా సినిమాను వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి వివాదాలకు స్పందించడం .. ఎలాంటి అర్థం లేదంటూ చెప్పుకొచ్చాడు.

తమిళ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు నుంచి ఎదురైన చేదు అనుభవం!

తమిళ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను పన్ను వడ్డీలో మినహాయింపును కోరుతూ హీరో సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సూర్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నోటీసులను జారీ చేసింది.

2010వ సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖ సూర్య ఇంటిపై దాడులు చేసి సూర్య ఆస్తిపాస్తులను అంచనా వేశారు. ఈ దాడుల అనంతరం రూ.3.11 కోట్లు చెల్లించాలని అతనికి నోటీసులను జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను మదింపు కోసం వడ్డీని తగ్గించాలంటూ సూర్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సూర్యకు ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

తాజాగా మంగళవారం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఐటి శాఖ వాదన విన్న తర్వాత ఆదాయపు పన్ను మదింపుకు సహకరించలేదని సూర్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ అతడు ఆదాయపు పన్ను శాఖ తెలిపిన డబ్బులు చెల్లించాలని ఉత్తర్వులలో పేర్కొంటూ.. ఆ ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ విధంగా హై కోర్ట్ డబ్బులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సూర్య ప్రస్తుతం ఆ డబ్బులు చెల్లిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2010వ సంవత్సరంలో ఐటి శాఖ అధికారులు సూర్య ఇంటితో పాటు బోట్ క్లబ్ ప్రాంతంలోని బంగ్లా, అతని సన్నిహితుల కార్యాలయాలలో కూడా సోదాలు జరిపిన తర్వాత ఈ ఉత్తర్వులను జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే.

‘టాలీవుడ్’లోకి అడుగుపెట్టనున్న విజయ్, సూర్య.. డైరెక్ట్ గా?

తమిళంలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్, సూర్యలకు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇదివరకు వీరు తమిళంలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలను తెలుగులో డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఈ క్రమంలోనే సూర్య నటించిన సింగం,గజిని, ఆకాశమే నీ హద్దురా చిత్రాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

ఇక విజయ్ కూడా పలు సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఈసారి ఏకంగా తెలుగు సినిమాలతోనే ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. సూర్య గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్త చరిత్ర2 సినిమా ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక తాజాగా సూర్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే బోయపాటి శీను సూర్య కథను నేరేట్ చేసాడట. ఈ సినిమాను పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.అదే విధంగా తమిళ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ కూడా ఈసారి డైరెక్ట్ తెలుగు చిత్రంలోనే నటించనున్నాడనే సమాచారం జోరుగా వినబడుతోంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా పాన్ ఇండియా తరహాలో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా విజయ్ కు వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే సూర్య,విజయ్ మాత్రమే కాకుండా మరి కొందరు హీరోలు కూడా తమిళ డబ్బింగ్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.

ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న కార్తీ..!!

తమిళ ఇండ్రస్టీ లో అగ్ర హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య..అయితే తన తమ్ముడు కార్తీ సైతం హీరోగా ఇండ్రస్టీలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.. యుగానికొక్కడు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీ. విభిన్న మైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత వచ్చిన ఆవారా సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ హీరో.

రెగ్యులర్ కథలు కాకుండా కంటెంట్ లో కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తూ కార్తి మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక కార్తీ నటించిన ఖాకి , ఖైదీ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి..ఈ రెండు సినిమాలు కార్తీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ లుగా నిలిచాయి.. ఇప్పుడు ఈ సినిమాలకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు కార్తి..ఇక తాజాగా ఇటీవలే సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తి..

రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ్ లో మంచి టాక్ తెచ్చుకోగా తెలుగులో పర్వాలేదు అనిపించుకుంది.ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక తమిళ్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ఖాకీ’ సీక్వెల్ గానీ .. ‘ఖైదీ’ సీక్వెల్ గాని చేయాలని కార్తి నిర్ణయించుకున్నాడట. ఖాకీ’ సినిమా చేసిన హెచ్.వినోత్ ప్రస్తుతం అజిత్ హీరోగా ‘వలిమై’ చేస్తున్నాడు.

ఆ తరువాత ప్రాజెక్టుకు అవసరమైన కథను కూడా రెడీ చేసుకోమని ఆయనకి అజిత్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ‘ఖైదీ’ సినిమాను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ కమల్ కథనాయకుడిగా ‘విక్రమ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయనకి దళపతి విజయ్ .. రజనికాంత్ ల సినిమాలు ఉన్నాయి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్రీ అయితే ఖాకీ, ఖైదీ సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ రూపొందే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..!!