తమిళ ఇండ్రస్టీ లో అగ్ర హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య..అయితే తన తమ్ముడు కార్తీ సైతం హీరోగా ఇండ్రస్టీలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.. యుగానికొక్కడు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీ. విభిన్న మైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత వచ్చిన ఆవారా సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ హీరో.
రెగ్యులర్ కథలు కాకుండా కంటెంట్ లో కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తూ కార్తి మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక కార్తీ నటించిన ఖాకి , ఖైదీ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి..ఈ రెండు సినిమాలు కార్తీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ లుగా నిలిచాయి.. ఇప్పుడు ఈ సినిమాలకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు కార్తి..ఇక తాజాగా ఇటీవలే సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తి..
రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ్ లో మంచి టాక్ తెచ్చుకోగా తెలుగులో పర్వాలేదు అనిపించుకుంది.ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక తమిళ్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ఖాకీ’ సీక్వెల్ గానీ .. ‘ఖైదీ’ సీక్వెల్ గాని చేయాలని కార్తి నిర్ణయించుకున్నాడట. ఖాకీ’ సినిమా చేసిన హెచ్.వినోత్ ప్రస్తుతం అజిత్ హీరోగా ‘వలిమై’ చేస్తున్నాడు.
ఆ తరువాత ప్రాజెక్టుకు అవసరమైన కథను కూడా రెడీ చేసుకోమని ఆయనకి అజిత్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ‘ఖైదీ’ సినిమాను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ కమల్ కథనాయకుడిగా ‘విక్రమ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయనకి దళపతి విజయ్ .. రజనికాంత్ ల సినిమాలు ఉన్నాయి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్రీ అయితే ఖాకీ, ఖైదీ సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ రూపొందే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…