ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న కార్తీ..!!

0
45

తమిళ ఇండ్రస్టీ లో అగ్ర హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య..అయితే తన తమ్ముడు కార్తీ సైతం హీరోగా ఇండ్రస్టీలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.. యుగానికొక్కడు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీ. విభిన్న మైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత వచ్చిన ఆవారా సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ హీరో.

రెగ్యులర్ కథలు కాకుండా కంటెంట్ లో కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తూ కార్తి మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక కార్తీ నటించిన ఖాకి , ఖైదీ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి..ఈ రెండు సినిమాలు కార్తీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ లుగా నిలిచాయి.. ఇప్పుడు ఈ సినిమాలకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు కార్తి..ఇక తాజాగా ఇటీవలే సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తి..

రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ్ లో మంచి టాక్ తెచ్చుకోగా తెలుగులో పర్వాలేదు అనిపించుకుంది.ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక తమిళ్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ఖాకీ’ సీక్వెల్ గానీ .. ‘ఖైదీ’ సీక్వెల్ గాని చేయాలని కార్తి నిర్ణయించుకున్నాడట. ఖాకీ’ సినిమా చేసిన హెచ్.వినోత్ ప్రస్తుతం అజిత్ హీరోగా ‘వలిమై’ చేస్తున్నాడు.

ఆ తరువాత ప్రాజెక్టుకు అవసరమైన కథను కూడా రెడీ చేసుకోమని ఆయనకి అజిత్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ‘ఖైదీ’ సినిమాను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ కమల్ కథనాయకుడిగా ‘విక్రమ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయనకి దళపతి విజయ్ .. రజనికాంత్ ల సినిమాలు ఉన్నాయి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్రీ అయితే ఖాకీ, ఖైదీ సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ రూపొందే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here