ఇటీవల అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య అద్భుతంగా నటించాడు. దీనిలో సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించేసింది.
దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్. అయితే ఈ చిత్రం మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (IMDB- Internet Movie Data Base) సినిమాల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమాకు 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.
97 శాతం మంది గూగుల్ యూజర్లు ఇష్టపడ్డారు. ఈ సినిమా కంటే ముందు ఈ స్థానంలో 1994లో విడుదలైన ది షాషాంక్ రిడంప్షన్ సినిమా 9.3తో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్తానంలో జై భీమ్ సినిమా 9.6 రేటింగ్ తో మొదటి స్థానం సంపాదించింది.
ఇక ప్రపంచ ప్రఖ్యాత సినిమా ‘గాడ్ ఫాదర్’ మూడో స్థానంలో నిలిచింది. ‘ది డార్క్ నైట్’ మూవీ 9.0/10తో నాల్గో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఓటీటీలో సూర్య నటించిన సినిమా ఆకాశమే హద్దురా సినిమా కూడా టాప్ టెన్ లో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాతో సూర్య తన రికార్డును తానే తిరగరాశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…