అన్నింటిలో ఆడపిల్లలు సమానం అని కొందరు అంటుంటే.. మరికొందరు ఆడపిల్లలను పాఠశాలకు పంపడానికి కూడా వెనకాడుతున్నారు. అలాంటి ఆడపిల్లలకు తోడుగా ఎంతోమంది మహిళలు పోరాటం చేశారు.. ఇంకా చేస్తున్నారు. ఇలా పోరాటం చేసిన వారిలో మలాలా ఒకరు. పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా.. బాలిక విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు.
దీంతో 2012లో తాలిబాన్లు మలాలా చదువుతున్న పాఠశాల బస్సులోకి చొరబడి ఆమె మీద కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను పెషావర్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడారు వైద్యలు. తర్వాత పలు ఆపరేషన్ల తర్వాత మలాలా కోలుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె బ్రిటన్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.
ఆడపిల్లల చదువు కోసం మలాలా చేసిన సేవల్ని గుర్తించి 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందజేశారు. నోబెల్ బహుమతి స్వీకరించిన అతి పిన్న వయస్సురాలిగా మాలాలా గుర్తింపు కూడా పొందారు. తాజాగా మాలాల సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. అసర్ మాలిక్ అనే యువకుడితో వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో మాలిక్‌ను ఆమె నిఖా చేసుకున్నారు.
ఈ వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ”ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం” అని మలాలా ట్వీట్ చేసి తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…