టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సమంత హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధలకు తన వంతు సహాయం చేస్తూ తన మనస్సు ఏంటో నిరూపించుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఓ విషయం బయటపడింది. సమంత కేవలం చారిటీ ద్వారా మాత్రమే కాకుండా ఆపదలో ఉన్న ఎంతో మందికి తన వంతు సహాయం చేశారని అలా ఒక హీరోయిన్ కి కూడా సమంత ఎంతో సహాయం చేసి తన మంచి మనసు ఏంటో నిరూపించుకుని తాజాగా ఆ హీరోయిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,పలు సినిమాలలో హీరోయిన్ గా చేసిన తేజస్వి మడివాడ గురించి అందరికీ తెలిసిందే. ఈమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరిగి చదువులు పూర్తి చేసుకుని అనంతరం నటనపై ఉన్న ఆసక్తితో అవకాశాలు వెతుక్కుంటూ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో తేజస్వి టీబీ వ్యాధితో బాధ పడింది.
ఆ సమయంలో డాక్టర్ తనకు ఆపరేషన్ చేయాలని చెప్పారని అయితే ఆపరేషన్ కు సరిపడే డబ్బులు తన దగ్గర లేకపోవడంతో సమంత తన వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటిని తానే భరించిందని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తేజస్వి ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం బయటకు తెలియడంతో సమంత మంచితనం మరోసారి బయటపడటంతో పలువురు ఆమెపై ప్రశంసలు కురిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…