బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ రోజు ఉత్కంఠగా సాగుతోంది. ఏ రోజు ఏం జరరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రోజులు గడుస్తున్నా కొద్ది హౌస్ లో సభ్యులు తగ్గిపోతున్నారు. నామినేషన్ విషయంలో ట్విస్ట్ లు సాగుతూనే ఉన్నాయి.
ఈ వారం బయటకు వెళ్లే వారిలో సిరి, సన్ని, రవి, కాజల్, మానస్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎక్కువగా కాజల్ ఎలిమినేట్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే.. జెస్సీ తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా హౌస్ వదిలిపెట్టి సీక్రెట్ రూంకి వెళ్లాడు. దీనికి షణ్ముఖ్, సిరి వెక్కి వెక్కి ఏడ్చారు. గత సీజన్లో గంగవ్వ, నోయల్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.
అతడిని కూడా బయటకు వెళ్తాడని అనుకన్న వారికి.. అనూహ్యంగా అతడిని సీక్రెట్ రూంకు పంపించారు బిగ్ బాస్. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా.. ఉండదా అనేది కొంచెం సందేహంలో ఉన్నారు ప్రేక్షకులు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో జెస్సీ సీక్రెట్ రూంలో ఉండి.. హౌస్ లో జరిగే సన్నివేశాలను వీక్షించాడు.
ముందుగా తనను ఈ గేమ్ లో కంటిన్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పాడు జెస్సీ. వైద్య పరీక్షల నిమిత్తం మిమ్మల్సి బయటకు తీసుకెళ్లాం.. డాక్టర్లు మీకు ఏం కాదని చెప్పడంతో హౌస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇప్పించామని.. నిబంధనల నేపథ్యంలో మీరు క్వారంటైన్ కావాల్సి ఉందంటూ సీక్రెట్ రూంలో ఉంచామన్నారు బిగ్ బాస్. బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాల్సి ఉందని చెప్పారు.ప్రేక్షకులు కూడా నిజంగానే చేసి బయటికి వెళ్తాను అని భావించారు కానీ తనని సీక్రెట్ రూమ్ కి పంపించి అందరిని బిగ్ బాస్ ఆశ్చర్యానికి గురిచేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…