తమిళ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను పన్ను వడ్డీలో మినహాయింపును కోరుతూ హీరో సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సూర్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నోటీసులను జారీ చేసింది.
2010వ సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖ సూర్య ఇంటిపై దాడులు చేసి సూర్య ఆస్తిపాస్తులను అంచనా వేశారు. ఈ దాడుల అనంతరం రూ.3.11 కోట్లు చెల్లించాలని అతనికి నోటీసులను జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను మదింపు కోసం వడ్డీని తగ్గించాలంటూ సూర్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సూర్యకు ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.
తాజాగా మంగళవారం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఐటి శాఖ వాదన విన్న తర్వాత ఆదాయపు పన్ను మదింపుకు సహకరించలేదని సూర్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ అతడు ఆదాయపు పన్ను శాఖ తెలిపిన డబ్బులు చెల్లించాలని ఉత్తర్వులలో పేర్కొంటూ.. ఆ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ విధంగా హై కోర్ట్ డబ్బులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సూర్య ప్రస్తుతం ఆ డబ్బులు చెల్లిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2010వ సంవత్సరంలో ఐటి శాఖ అధికారులు సూర్య ఇంటితో పాటు బోట్ క్లబ్ ప్రాంతంలోని బంగ్లా, అతని సన్నిహితుల కార్యాలయాలలో కూడా సోదాలు జరిపిన తర్వాత ఈ ఉత్తర్వులను జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…