Featured

వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యేది ఆరోజే?

“ఉప్పెన” సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరొక మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండస్ట్రీలో వైష్ణవ్ తేజ్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వైష్ణవ్ తన రెండవ సినిమాను క్రిష్ దర్శకత్వంలో నటించారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ మెగా హీరో సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ లేకపోయినప్పటికీ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని తెలుస్తుంది. షూటింగ్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారాన్ని దర్శకుడు క్రిష్ ఈ రోజు ఉదయం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసే తేదీ సమయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం క్రిష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సూర్యాస్తమయ సమయంలో హీరో వైష్ణవ తేజ్ తో పాటు ఇతర గ్రామీణలు, పశువులు గొర్రెలు, అడవిలో నడుస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఈ నెల 20వ తేదీన ఉదయం 10:15 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ తెలియజేశారు. ఇక పోతే ఈ సినిమాకు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ చేయగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన “కొండల పొలం” అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు డైరెక్టర్ క్రిష్ ఇదివరకే తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago