సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి హోదాకు అనుగుణంగానే వారు ఉపయోగించే ప్రతి వస్తువులు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఎంతో ఖరీదైన వస్తువుల ను ఉపయోగించడం సర్వసాధారణమే. ముఖ్యంగా ఎంతో మంది సార్ స్టార్ సెలబ్రిటీలకు కార్లు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.ఈ క్రమంలోనే మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వచ్చిందంటే తప్పనిసరిగా ఆ కారు తమ గ్యారేజ్ లో ఉండేలా చూసుకుంటారు. ఈ విధంగా కార్లంటే ఇష్టమున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.
తాజాగా ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ‘లంబోర్ఘిని’ కారు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంది. అయితే ఈ విధమైనటువంటి కారు మన దేశంలో కొన్న మొదటి వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డును సృష్టించారు. ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడిన ఈ కారు సుమారు మూడు కోట్ల పైగా ఖర్చు చేసి కొన్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మనసుపడ్డ ఈ కారు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..
ఈ కారు మొత్తం ఆటోమేటిక్ సెన్సార్లను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు.200 స్పీడులో ఈ కారులో ప్రయాణిస్తున్నప్పటికీ ఏ విధమైనటువంటి కుదుపులు లేకుండా ప్రయాణిస్తుంది. మన పక్కన లేదా ఎదురుగా ఏవైనా ఇతర వాహనాలు వస్తుంటే సెన్సార్ మనకు తెలియజేస్తుంది. ఆటోమేటిక్ తాళాలు ఈ కారుకు ఉన్న మరొక ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఎవరు ఎంత పగలగొట్టాలని చూసినా ఈ కారు అద్దాలు తెరచుకోవు.
మొత్తానికి ఎన్టీఆర్ కొన్న ‘లంబోర్ఘిని’ కారుకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ,”RRR”సినిమా షూటింగ్లో భాగంగా ఉక్రెయిన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఇక్కడ ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తుంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…