Tag Archives: tea benefits

హెర్బల్ టీలు తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలా..? తెలిస్తే మీరు అస్సలు వదలరు..!

హెర్బల్ టీని తాగితే ఆరోగ్యకరంగా ఉంటారు. దీనికి ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ తాగడానికి మాత్రం సంశయిస్తుంటారు. ఇది తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే.. ప్రతీ రోజు ఒక కప్పు అయినా తాగుతారు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడేస్తుంది. అంతే కాకుండా.. దీనిలో యంటీఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి.

దీని ద్వారా మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి కాపాడటంలో సహాయపడతాయి. శరీరంలో ఎక్కడైనా వాపు, రక్తం గడ్డకట్టడం.. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టీ రుచిగా ఉండాలి, కానీ.. హెల్దీ గా ఉండాలి అనుకునే వారికి హెర్బల్ టీలు మంచి ఆప్షన్. కాఫీ, ట్రూ టీ లో లాగా హెర్బల్ టీలో కెఫీన్ ఉండదు.

నిద్ర లేమితో బాధపడే వారు దీనిని దర్జాగా తీసుకోవచ్చు. మనసునీ, శరీరాన్నీ ప్రశాంతంగా చేసి హాయిగా నిద్ర పట్టేటట్లు చేస్తాయి. వ్యాయామం లేదా మరేదైనా శారీరకశ్రమ చేసినప్పుడు అలసట అనిపిస్తుంటుంది. ఆ సమయంలో హెర్బల్ టీ తాగడం వల్ల హాయిగా అనిపిస్తుంది. శరీరంలో ఎక్కడైనా పెయిన్ అనిపించినప్పుడు.. ఇది పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.

అయితే ఇది తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అవేంటంటే.. హెర్బల్ టీలు తీసుకునే సమయంలో కొంచెం కొంచెమే తీసుకోవాలి. అవి కొద్దిగా తీసుకున్నప్పుడు ఎంత ఆరోగ్యమో ఎక్కువగా తీసుకుంటే అంత అనారోగ్యం కూడా. హెర్బల్ టీని రోజుకి ఒకటి రెండు చిన్న కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. హెర్బల్ టీలో రకాలు చామోమిల్ టీ, పెప్పర్మింట్ టీ, జింజర్ టీ, సినమన్ టీ, మింట్ టీ, డాండిలయన్ టీ లు ఉన్నాయి.

‘టీ’ లలోఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. వాటి ప్రయోజనాలు తెలుసుకోండి..

సాధారణంగా చాలా మంది టీ తాగుతారు. కానీ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే.. భోజనం చేయపోయినా పర్వాలేదు కానీ.. ఓ కప్పు టీ తాగందే వాళ్లకు పూట గడవదు. ప్రతీ రోజు మద్యం సేవించే వాడు.. ఒకరోజు మద్యం లేకపోతే ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తాడో.. ఒక్క పూట టీ లేకుండా వాళ్లు కూడా అలానే చేస్తారు. అయితే టీ అనేది నిత్యవజీవితంగా భాగంగా మారింది.

టీ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవేంటంటే.. టీ పొడిలో కొన్ని పలుకుల్లా, కొన్ని మెత్తటి పొడిలా, మరికొన్ని ఆకుల్లా ఉండడం గమనించే ఉంటారు. టీ పొడి అనేది తేయాకు కెమల్లియా అనే మొక్క నుంచి వస్తుంది. ఈ మొక్కను ప్రాసెస్ చేసి.. తుది ఉత్పన్నంగా టీ పొడి తయారు చేస్తారు. ఏడు రకాల ప్రాసెస్ లు చేయబడతాయి. కొన్ని రకాల తేయాకును చైనాలో ఏళ్ల తరబడి నిల్వ ఉంచుతారు. పాత వైన్ కు డిమాండ్ ఉన్నట్టే పాత తేయాకుకు కూడా ఇక్కడ ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.

అయితే టీలో కూడా అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ రేటును పెంచి.. శరీర బరువును తగ్గించడంలో ఉపకరిస్తాయని చెబుతున్నారు. శరీరంలోని మంటను తగ్గించడానికి ‘బ్లాక్ టీ’ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ అన్నది ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దీన్ని ఆరోగ్యప్రదాయినిగా భావిస్తుంటారు.

తేయాకులకు కొన్ని పరిమళాలు జోడించి తయారు చేస్తారు. ఒరిజినల్ గ్రీన్ టీ అనేది పరిశుభ్రంగా, రుచికరంగా ఉంటుంది. ఊలాంగ్ టీ అనేది కూడా టీ రకాల్లో ఒకటి. ఈ టీ తామర వంటి చర్మ సమస్యలను నయం చేస్తుంది. వైట్ టీలో.. ధర అధికం. కాకపోతే చైనా తయారీకి, ఇతర దేశాల తయారీకి మధ్య వైవిధ్యం ఉంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా మనం ఇంటి రెమిడీస్ లో పుదీనా, అల్లం టీ వంటివి కూడా తయారు చేస్తారు.

గొంతులో గరగర సమస్యా.. అయితే ఈ చిట్కాలను అనుసరించండి.. ?

ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏ లక్షణాల ద్వారా కరోనా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంత మందికి తీవ్ర జ్వరం తో పాటు దగ్గు, గొంతు నొప్పి వస్తుంది. ఇలా లక్షణాలు కనిపించిన వెంటనే వారు కోవిడ్ టెస్టు చేయించుకుంటున్నారు.కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే దాని తగ్గట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే నెగెటివ్ రిపోర్టు వచ్చిన వాళ్లకు జ్వరం, దగ్గు తగ్గినా గొంతు నొప్పి అనేది బాధ కలిగిస్తుంటుంది. ఎన్ని చిట్కాలు ఫాలో అయినా దానికి మాత్రం ఉపశమనం కలగదు. అయితే ఇలా గొంతులో గరగర సమస్య ఉటే 5 సింపుల్ టిప్స్ అనుసరించడంతో పూర్తిగా తగ్గుతుంది. అవేంటంటే..

గోరు వెచ్చని నీళ్లు తాగడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇలా ఉదయాన్నే ఆ నీటిని తీసుకునే సమయంలో అందులో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో గొంతు నొప్పి మాయమవుతుంది.

మరో చిట్కాలో.. అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేస్తే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా అల్లాన్ని మెత్తగా నూరి టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే గొంతు నొప్పి పత్తా లేకుండా పోతుంది.

పుదీనా ఆకుల ద్వారా కూడా దీనిని నయం చేయవచ్చు. వాటిని మనం తాగే నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి.. ఆకులు తీసేసి వాటర్ తాగితే మంచిది. చివరి చిట్కా ఏంటంటే.. వేడి నీటిలో కొన్ని చామంతి ఆకుల్ని వేసి మరిగించి.. తర్వాత ఆకులను తీసేసి ఆ నీటిని తాగితే ఇక గొంతులో గరగర అనేది ఉండదు.