Tag Archives: this rice

మధుమేహంతో బాధపడేవారు ఈ అన్నం తింటే అదుపులో ఉంచుకోవచ్చు..!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కనుగుణంగా ఆరోగ్యపరంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఎక్కువగా అన్నం తినడం ద్వారా ఎంతో మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి మధుమేహంబారిన పడిన వారు అన్నం తినాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇలాంటి వారికి ఇది ఒక శుభవార్తే అని చెప్పవచ్చు.ఈ విధంగా అన్నం తయారుచేసుకుని తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే విధానం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం తినే అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కోసం ఒక పూట మాత్రమే అన్నం తీసుకోవడం, మిగిలిన సమయాలలో ఎక్కువగా చపాతి, రొట్టె వంటి వాటిని తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకున్నారు. శ్రీలంక దేశానికి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా అన్నంలో కేలరీలను సగానికి సగం తగ్గించే నూతన విధానాన్ని కనిపెట్టారు. ఇందులో భాగంగానే అన్నం తయారు చేసుకునేటప్పుడు అర కప్పు మరిగే నీటిలో మనం వంట కోసం ఉపయోగించే కొబ్బరి నూనెను వేయటం వల్ల అన్నంలో ఉన్న కేలరీలు సగానికి సగం తగ్గుతాయని కనుగొన్నారు. దీంతో మధుమేహంతో బాధపడేవారు అన్నం తిన్నప్పటికి కూడా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవు.

సాధారణంగా మనం అన్నం తిన్నప్పుడు వెంటనే జీర్ణమవుతుంది అని మనకు తెలిసిందే. ఈ విధంగా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల శరీరంలో ఆహారం పది రెట్లు ఆలస్యంగా జీర్ణమవుతుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ విధంగా అన్నం చేసుకోవటం ద్వారా మధుమేహంతో బాధపడే వారు సైతం నిరభ్యంతరంగా అన్నం తినొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.