Tag Archives: tolly wood

Tolly wood Top Most Profitable Movies: బాహుబలి నుంచి కార్తికేయ 2 వరుకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాలీవుడ్ సినిమాలివే?

Tolly wood Top Most Profitable Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో సినిమాలు విడుదలవుతూ పెద్ద ఎత్తున బాక్సాఫీస్ వద్ద భారీ   కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు విడుదలవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే బాహుబలి సినిమా నుంచి తాజాగా విడుదలైన కార్తికేయ 2 సినిమా వరకు ఏ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఇక్కడ తెలుసుకుందాం…

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల బిజినెస్ చేయగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 860 కోట్ల షేర్స్ రాబట్టింది. ఇక బాహుబలి ది బిగినింగ్ తెలుగులో 191 కోట్ల రూపాయల షేర్స్ రాబట్టింది. అన్ని భాషలలో కలిపి 311 కోట్ల షేర్స్ రాబట్టింది. రెండు భాగాలు కలిపి నిర్మాతలకు 694 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా అన్ని ఏరియాలలో కలిపి 451 కోట్లకు అమ్మారు. ఇక అన్ని ఏరియాలలో కలిపి ఈ సినిమా 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 613.06 కోట్ల షేర్స్ రాబట్టింది.

అలా వైకుంఠపురం: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా 85 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా ఈ సినిమా మొత్తంగా 160.37 కోట్ల రాబట్టింది. నిర్మాతలకు 75.88 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

ఎఫ్2: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34.5 కోట్ల జరుపుకోగా ఓవరాల్ గా ఈ సినిమా 80 కోట్ల రూపాయల వరకు షేర్స్ రాబట్టింది.

పుష్ప: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకువచ్చింది.

Tolly wood Top Most Profitable Movies: మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు:

మహేష్ బాబు రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా . 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను అందుకుంది

కార్తికేయ2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఇటు సౌత్ ఇండస్ట్రీలోను అటు నార్త్ ఇండస్ట్రీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా 36 కోట్ల షేర్ రాబట్టింది.ఇక ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో టాప్ టెన్ స్థానంలో కొనసాగింది.

అల్లు అర్జున్ నా వైపు అలా చూసేవాడు : వనితా విజయ్ కుమార్

వనితా విజయ్ కుమార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నిత్యం ఏదో ఒక విషయం గురించి ఈమె వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఐదోసారి ప్రేమలో పడ్డానని తెలపడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం మరొకసారి అల్లు అర్జున్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నా వైపు అలా చూస్తే వాడంటూ వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

ప్రముఖ సినీ సెలబ్రిటీ విజయ్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె అయిన వనితా విజయ్ కుమార్ 1995లో ‘చంద్రలేఖ’ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఏ చిన్న కార్యాలకే నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్ళేవారు అని పేర్కొన్నారు. చిరంజీవి గారు నటించిన ఇంగ్లీష్ సినిమా ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అల్లు అర్జున్ తన వైపు అలా చూస్తూ లైన్ వేసేవాడిని, అప్పుడు నేను మామిడి పండు కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కు 14 సంవత్సరాలు ఉంటాయని ఆమె తన కన్నా ఎంతో పెద్దది అని తెలిపింది.

వనితా విజయ్ కుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. సినిమాలలో నటించి పాపులర్ అవడం కన్నా నిజ జీవితంలో ఏదో ఒక వివాదంతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో ఇద్దరితో ప్రేమలో ఉన్నట్టు ఈమె తెలిపారు. అదే ఇంటర్వ్యూలో వనితా బన్నీ గురించి మాట్లాడుతూ, బన్నీ ఒక మంచి డాన్సర్ అని, అవకాశం వస్తే బన్నీకి అత్త క్యారెక్టర్ లో నటించాలని ఉందని తెలిపారు. రమ్యకృష్ణ తరహాలో చాలా శక్తివంతమైన పాత్రలో నటించడానికి వనితా ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అయితే అవన్నీ ఎలా ఉన్నా ప్రస్తుతం బన్నీ తనకు లైన్ వేసాడనే సంచలన వ్యాఖ్యలు చేయడంతో వనితా విజయ్ కుమార్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘శ్రీకాంత్’ను రోజా అలా పిలిచేదట.. కోపం వచ్చి?

గత రెండు దశాబ్దాల క్రితం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు ఉండేవారు. కుటుంబ కథా చిత్రాలను, ప్రేమ కథా చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించే శ్రీకాంత్ కు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేది.అంతేకాకుండా శ్రీకాంత్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ఎన్నో అవకాశాలను అంది పుచ్చుకున్నారు. సౌందర్య, రాశి, రోజా, రమ్య కృష్ణ వంటి స్టార్ హీరోయిన్లతో నటించారు. వీరందరి కన్నా శ్రీకాంత్, సౌందర్య నటించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

స్టార్ హీరోయిన్ల సరసన నటించిన శ్రీకాంత్ వారితో ఎంతో స్నేహంగా మెలిగే వాడు. ఇప్పటికీ ఏదైనా ఫంక్షన్ లకు వీరందరూ కలిస్తే ఎంతో ఆనందంగా, మంచి స్నేహితులు లాగా కలిసిపోతారు. శ్రీకాంత్, రాశి నటించిన”ప్రేయసి రావే చిత్రం”1999 లో విడుదల అయ్యి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి ఆ చిత్ర విశేషాలను శ్రీకాంత్ గుర్తు తెచ్చుకున్నారు.

శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ సినిమాని రామానాయుడు నిర్మించగా, దర్శకుడు చంద్ర మహేష్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలు విడుదలైన అది కొద్ది రోజులలోనే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ అప్పుడు హీరోయిన్లను గుర్తుచేసుకుంటూ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

శ్రీకాంత్, రోజా జంటగా దాదాపు మూడు సినిమాలలో నటించారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఒకరోజు వీరి మధ్య జరిగిన ఓ సరదా సంఘటనను శ్రీకాంత్ తెలిపారు. షూటింగ్లో భాగంగా ఇద్దరిపై ఒక రొమాంటిక్ సీన్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో రోజా శ్రీకాంత్ ను అన్నయ్య ఈ సీన్ అలా చేద్దాం, అన్నయ్య ఇలా చేద్దాం అంటూ శ్రీకాంత్ ను అనేదంట. దీంతో చిరాకు పడ్డ శ్రీకాంత్ కొంచెంసేపు అన్నయ్య అనడం ఆపుతావా … అలా పిలుస్తుంటే నాకు రొమాంటిక్ ఫీలింగ్ రావడంలేదని, అప్పుడు జరిగిన ఈ సరదా సన్నివేశాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు.

కలర్ ఫోటో హీరో లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా..?

సినిమాలంటే ఇష్టంతో సినిమాల్లో నటించాలని హైదరాబాద్ కి వచ్చి అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటి అవకాశాలు కేవలం కొందరు మాత్రమే పలకరిస్తాయి. అలా సినిమాలు అంటే ఇష్టం తో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చిన అవకాశాలు అన్నింటిని ఉపయోగించుకుని”మజిలీ” సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుహాస్ ప్రస్తుతం హీరోగా నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.

సుహాస్, చాందిని చౌదరి ఇద్దరూ జంటగా కలిసి నటించిన “కలర్ ఫోటో”ఇటీవలే “ఆహా”ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. సందీప్ రాజ్ దర్శకత్వంలో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ ఎంతో సహజంగా నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో సుహాస్ ఫర్ఫార్మెన్స్ చూసిన సెలబ్రిటీలు సుహాస్ చాలా నాచురల్ గా నటించాడని, ప్రశంసిస్తున్నారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సుహాస్ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సినిమాలంటే ఇంట్లో వారికి పెద్దగా ఇష్టం లేకపోవడంతో, జాబ్ చేస్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి నంద్యాల పెళ్లి అక్కడి నుంచి వారంలో రెండు మూడు సార్లు హైదరాబాద్ కి వెళ్లిఅవకాశాలకోసం వెతికి వాడట. అప్పటికే ఒక అమ్మాయిని ప్రేమించిన సుహాస్,ఇటు ప్రేమలోనూ అటు సినిమా అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు… దాదాపు ఏడు సంవత్సరాలుగా ఆ అమ్మాయిని ప్రేమించి వారి ఇంట్లో వాళ్లకు వారి ప్రేమ గురించి తెలియజేశారు. లైఫ్ లో సెటిల్ అయ్యాక 2017 సంవత్సరంలో తాను ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకుని అటు నిజజీవితంలోనూ, ఇటు సినీ జీవితంలోనూ విజయాలను అందుకున్నాడు. ఇండస్ట్రీలో సుహాస్కి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.