Tolly wood Top Most Profitable Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో సినిమాలు విడుదలవుతూ పెద్ద ఎత్తున బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు విడుదలవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే బాహుబలి సినిమా నుంచి తాజాగా విడుదలైన కార్తికేయ 2 సినిమా వరకు ఏ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఇక్కడ తెలుసుకుందాం…
బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల బిజినెస్ చేయగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 860 కోట్ల షేర్స్ రాబట్టింది. ఇక బాహుబలి ది బిగినింగ్ తెలుగులో 191 కోట్ల రూపాయల షేర్స్ రాబట్టింది. అన్ని భాషలలో కలిపి 311 కోట్ల షేర్స్ రాబట్టింది. రెండు భాగాలు కలిపి నిర్మాతలకు 694 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా అన్ని ఏరియాలలో కలిపి 451 కోట్లకు అమ్మారు. ఇక అన్ని ఏరియాలలో కలిపి ఈ సినిమా 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 613.06 కోట్ల షేర్స్ రాబట్టింది.
అలా వైకుంఠపురం: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా 85 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా ఈ సినిమా మొత్తంగా 160.37 కోట్ల రాబట్టింది. నిర్మాతలకు 75.88 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
ఎఫ్2: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34.5 కోట్ల జరుపుకోగా ఓవరాల్ గా ఈ సినిమా 80 కోట్ల రూపాయల వరకు షేర్స్ రాబట్టింది.
పుష్ప: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకువచ్చింది.
మహేష్ బాబు రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా . 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను అందుకుంది
కార్తికేయ2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఇటు సౌత్ ఇండస్ట్రీలోను అటు నార్త్ ఇండస్ట్రీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా 36 కోట్ల షేర్ రాబట్టింది.ఇక ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో టాప్ టెన్ స్థానంలో కొనసాగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…