Amitabh Bachchan : మన దేశంలో సినిమాలు అంటే విపరీతమైన అభిమానం. సినిమాలలో నటించే హీరో హీరోయిన్లకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఎవరికీ ఉండదేమో. ఇక పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని, సౌత్ వాళ్ళు నార్త్ లో, నార్త్ హీరోలు సౌతలో అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇక మన కొన్ని సినిమాల వలన ఇండియన్ స్టార్స్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. ఇక వారికి ఇష్టమైన నటీ నటుల మీద మన వారి అభిమానం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. కొంతమంది వారి అభిమాన నటుల పుట్టిన రోజుకు రక్త దానం, అన్న దానం వంటివి చేస్తుంటే, ఇంకొంత మంది గుడులు కట్టి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ కోవలోనే ఒక అభిమాని వారి కుటుంబం చేసిన పని ఇపుడు వైరల్ అవుతోంది.
కుటుంబానికి ఆ స్టార్ హీరోనే దేవుడు…
అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో నివసిస్తున్న మన భారతీయుడు అయిన గోపిసేథ్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే అమితమైన అభిమానం. ఆయన కుటుంబంలో పెద్దవారితో మొదలు చిన్న చిన్న పిల్లల వరకు అందరికీ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంటే అమితమైన ఇష్టం. కుటుంబం లోని అందరూ అమితాబ్ అభిమానులు అవ్వడంతో ఆయనను దైవంగా భావించి ఇంట్లో విగ్రహం ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో అమితాబ్ బచ్చన్ లుక్ తో రాజస్థాన్ లో ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. దీనికోసం 75 వేల డాలర్లు అంటే సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు సమాచారం. ఈ విగ్రహాన్ని ఒక గాజు పెట్టె లో ఇంటి ముందు పెట్టారు. ఈ విగ్రహ ప్రతిష్ట కూడా ఘనంగా 600 మంది అభిమానుల మధ్య జరిగింది. ఇండియన్ సూపర్స్టార్ ఫ్యాన్స్ అసోసియేషనస్ ఫ్యాన్స్ క్లబ్ అధ్వర్యంలో అందరూ టపాకులు కాలుస్తూ పాటలకు డ్యాన్స్లు చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. అభిమాని గోపిసేథ్ మాట్లాడుతూ.. 1991 లో మోడటి సారి అమితాబ్ ను నవరాత్రి ఉత్సవాలకు హాజరు అయినపుడు కలిసాను, అయన పలకరించే విధానం చాలా అద్భుతం, అయన చాలా స్ఫూర్తి నింపారు అప్పటి నుండి నేను ఆయనకు అభిమాని గా మారిపోయాను అని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…