Featured

Karthika Deepam : కొత్త ట్విస్ట్లుల్తో విసుగు పుట్టిస్తున్న కార్తీక దీపం.. ఈసారి ట్విస్టుకి మాత్రం జనాలు డైరెక్టర్ ను తిట్టడం ఖాయం..!

Karthika Deepam : సీరియల్స్ అంటేనే సోది కానీ సోదిలో కూడా మళ్ళీ ట్విస్టులు, ఫ్లాష్ బ్యాక్ లు బాబోయ్ ఎన్ని ఉంటాయో. డైరెక్టర్ కి ఉన్న క్రియేటివిటీ అంతా మనపై రుద్దేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక సీరియల్స్ లోనే టాప్ లో ఉన్న ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియల్ మొత్తం వంటలక్క డాక్టర్ బాబు కాపురం చక్కబడటమే సరిపోయింది. మోనిత వేసిన నిందలు నిజమని నమ్మి డాక్టర్ బాబు, వంటలక్క ను దూరం పెట్టాడు. ఇక నిజం తెలుసుకుని డాక్టర్ బాబు వంటలక్కను కలపడంలోనే సీరియల్ ఏళ్ళు గడిచిపోయింది. ఇక ఇపుడు హమ్మయ్య డాక్టర్ బాబు, వంటలక్క కలిసి పోయారని అనుకునేలోపే వాళ్ళ క్యారెక్టర్స్ ని చంపేశాడు డైరెక్టర్.

మళ్ళీ సీరియల్ లోకి వచ్చిన దీప, మోనిత, కార్తీక్…

ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ లో కొత్త తరం వచ్చారు. కార్తీక్, దీపల పిల్లలు శౌర్య, హిమలు పెద్ద వాళ్ళు అయిపోయారు. ఇక వారి జీవితంలో సాగే విషయాలను డైరెక్టర్ చూపిస్నితాడని అనుకుంటే మళ్ళీ కార్తీక్ దీప క్యారెక్టర్లను బతికించాడు. ఇక కోమాలో నుండి బయటికి వచ్చిన దీప వెంటనే డాక్టర్ బాబు, మోనిత అందరిని చూపించేసాడు డైరెక్టర్. ఇక మళ్ళీ దీపక్క కష్టాలు మొదలు మోనిత నుండి డాక్టర్ బాబు ని కాపాడుకోవడం మళ్ళీ ఒక నాలుగేళ్లు సాగుతుందనిపిస్తోంది. అయితే ఇపుడు ఈ సీరియల్ విషయంలో కొత్త ట్విస్టు ఉండబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది.

అదేంటి అంటే అన్ని సీరియల్స్ లోనూ కామన్ గానే నాలుగైదు ఎపిసోడ్లు సీరియల్ లో వాళ్ళు కలలో బతికేస్తారు చివరికి మెలకువ వస్తే సీరియల్ అక్కడే ఉంటుంది. అలానే ఇపుడు కార్తీక దీపం సీరియల్ లో కూడా డాక్టర్ బాబు, వంటలక్క చనిపోవడం మళ్ళీ రావడం అన్నీ కలగా చూపిస్తారు అంటూ చెప్తున్నారు. అదే నిజమైతే సీరియల్ మీద సీరియల్ అభిమానులు ఖచ్చితంగా సీరియస్ అవుతారేమో. అయినా ఏమో చెప్పలేము ఇప్పటికీ మళ్ళీ దీప కార్తీక్ లు సీరియల్ లో కనిపిస్తున్నారని హ్యాపీ గా ఉన్న ఫ్యాన్స్ దీన్ని కూడా ఒప్పుకుంటారేమో. రేటింగ్స్ వస్తున్నాయి కదా అని సీరియల్ సాగతీసి ఏమి చెప్పినా జనాలు ఊకోడతారా…

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago