Tag Archives: tollywood heros

ఈ నలుగురు స్టార్ హీరోలలో బాల నటుడిగా వెండితెరపై కనిపించని హీరో ఎవరో తెలుసా..?!

1980, సినీగ్రూప్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరంతా స్టార్ హీరోలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ వీరు ఆరు పదుల వయసు దాటినా కూడా సినిమాల్లో నటిస్తూ యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తమ సత్తా చూపుతున్నారు.

పాండమిక్ తో థియేటర్లన్నీ కోలుకోలేని దెబ్బతీశాయి. తెలుగు సినిమా పరిస్థితి ఏంటి అనుకున్న సమయంలో “అఖండ” సినిమాతో బాలకృష్ణ విజయదుందుభి మోగించారు. బాలయ్య బాబు.. 14 సంవత్సరాల వయసులో “తాతమ్మకల” చిత్రంలో బాలనటుడిగా కనిపించారు.

1974 రామకృష్ణ ఆర్ట్స్, ఎన్టీరామారావు దర్శకత్వంలో “తాతమ్మకల” చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రల్లో కనిపించగా.. బాలకృష్ణ బాలనటుడిగా కనిపించారు.

“బంగార్రాజు” చిత్రంతో మంచి ఊపులో ఉన్న నాగార్జున 1986లో వచ్చిన “విక్రమ్” సినిమానే ఆయన మొదటి సినిమా అనుకుంటున్నారు. కానీ 1961 అన్నపూర్ణ పిక్చర్స్, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో “వెలుగునీడలు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగేశ్వరరావు, సావిత్రి హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో సావిత్రి నాగార్జునను ఎత్తుకొని “చల్లని వెన్నెల..అనే పాట పాడుతుంది. అలా నాగార్జున మొదటిసారి వెలుగు నీడలు చిత్రంలో బాలనటుడిగా కనిపించారు.

విక్టరీ వెంకటేష్ “కలియుగ పాండవులు” చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించి.. ప్రస్తుతం దృశ్యం, దృశ్యం-2 లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకెళుతున్నారు. 1971 సురేష్ ప్రొడక్షన్స్, డి.రామానాయుడు నిర్మాణం, కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో “ప్రేమనగర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో,హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో బాలనటుడి పాత్ర అవసరం ఉండటంతో ఆ సినిమాకు నిర్మాత అయిన డి.రామానాయుడు ఆయన చిన్న కుమారుడైన వెంకటేశ్ ని బాలనటుడిగా ప్రేమనగర్ సినిమాలో నటింపజేశారు.

ఇక ఆ నలుగురిలో మిగిలిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన చిన్నప్పటినుంచే సినిమాలపై అభిమానంతో ఉన్నత చదువులు పూర్తి చేసి మద్రాసులో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసి 1978లో “ప్రాణం ఖరీదు” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కాని బాలనటుడిగా ఏ చిత్రంలోనూ చిరంజీవి నటించలేదు. చిరంజీవి మినహా ముగ్గురు స్టార్ హీరోలు బాలనటులుగా వివిధ సినిమాలలో నటించడం గమనార్హం.

తమిళ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పునీత్ అభిమానులు.. కారణం అదేనా!

కోట్లాదిమంది అభిమానులను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు పునీత్ రాజ్ కుమార్. తమ అభిమాన హీరో చనిపోయాడన్న వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. శాండిల్ వుడ్ లో నెంబర్ వన్ హీరోగా పునీత్ రాజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. కేవలం అతని అభిమానులనే కాకుండా దక్షిణాది సినీ తారలను కూడా అతడి మరణవార్త కలచివేసింది.

పునీత్ రాజ్ కుమార్ తెలుగు సినిమాలలో నటించక పోయినప్పటికీ, తెలుగువాడు కాకపోయినప్పటికీ, మన వాడిలా భావించి టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు అతడి మరణవార్త విని కన్నీటిపర్యంతమయ్యారు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు అతడిని చూసేందుకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్ లాంటివారు ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

పునీత్‌ను టాలీవుడ్ సొంత మనిషిలా భావించి అతడి మరణం పట్ల గొప్పగా స్పందించిన తీరును కన్నడిగులు కొనియాడుతున్నారు.ఇక అదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇలాంటి స్పందన లేకపోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.తెలుగుతో సమానంగా తమిళ చిత్రాలు కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున విడులవుతుంటాయి. పునీత్ తమిళ స్టార్ల పట్ల కూడా తన అభిమానాన్ని చాటుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి.

అతడికి చాలామంది తమిళ హీరోలతో అనుబంధం కూడా ఉంది. కానీ ఎవరు కూడా పునీత్ ని కడసారి చూడటానికి కూడా బెంగళూరుకు రాలేదు.దీంతో తెలుగు స్టార్లు పునీత్ కడసారి చూపుకి వచ్చిన దృశ్యాలను షేర్ చేస్తూ తమిళ హీరోలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ పునీత్ అభిమానులు వారిపై విరుచుకుపడుతున్నారు. తమిళ హీరోల సినిమాలను ఇకపై బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.

బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు..!!

సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల పేర్లకన్నా ఈ బిరుదులనే అభిమానులు అమితంగా ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. తమ అభిమాన హీరో పేరు ముందు ప్రత్యేకంగా ఉండటానికి అభిమానులు కొన్నిసార్లు దర్శకులు ఇలా బిరుదులు ఇస్తుంటారు. అయితే కొందరు హీరోలు గతంలో వచ్చిన పేర్లను మారిపోయి కొత్త టైటిల్‌ పేర్లతో పలకరించిన సందర్భాలున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

1.ఐకాన్‌స్టార్‌గా.. అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్‌తో ఆయన తీస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ టీజర్‌తో పాటే, అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో తన పేరుకు ముందు ఐకాన్‌ స్టార్‌ అని ఉండటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ స్టైలిష్‌ స్టార్‌గా పిలుచుకునే అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా మారిపోనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

2.సుప్రీమ్‌ హీరో నుంచి మెగాస్టార్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు ముద్దుగా మెగాస్టార్‌ అని పిలుచుకుంటారు. ఆ పేరు వెండితెరపై పడితే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తుంటాయి. అయితే మెగాస్టార్‌ కన్నా ముందు డైనమిక్‌ హీరో అని తెరపై పడేది. ఆ తర్వాత అంచెలంచెలుగా స్టార్‌ హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుప్రీమ్‌ హీరో అని పిలుచుకునే వారు అభిమానగణం. ‘మరణమృదంగం’ సినిమా నుంచి చిరు మెగాస్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత కాలంలోనూ మెగాస్టార్‌గానే అభిమానుల గుండెల్లో నిండిపోయారు. ఇప్పటికీ.. ఎప్పటికీ చిరు మెగాస్టార్‌గానే గుర్తుండిపోతారని చెబుతారు మెగా అభిమానులు.

3.నటసింహం.. బాలకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. క్లాస్‌, మాస్‌, జానపదం, పౌరాణికం ఇలా పాత్ర ఏదైనా ఆయన బరిలోకి దిగనంత వరకే.. ఒకసారి అడుగు పెట్టారా? చరిత్ర సృష్టిస్తారు. కథానాయకుడిగా కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనను యువరత్నగానే పిలుచుకునేవారు. అయితే బోయపాటితో తీసిన ‘సింహ’తో బాలకృష్ణ నటసింహంగా మారిపోయాడు.

4.మన్మథుడి పేరూ మారింది..

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకులను ప్రోత్సహిస్తూ, ప్రయోగాలకు ఆసక్తి చూపే అగ్ర కథానాయకుడు నాగార్జున. అక్కినేని నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయనను అభిమానులు ‘యువ సామ్రాట్‌’ అని పిలుచుకునేవారు. ‘కింగ్‌’ సినిమా తర్వాత ఆయన పేరు ముందు ‘కింగ్‌’ టైటిల్‌ వచ్చి చేరింది.

5.సూపర్‌స్టార్‌ అలా..

కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మహేశ్‌బాబు. బాలనటుడిగానే తనదైన ముద్రవేశారు. కృష్ణ స్టార్‌డమ్‌తో పాటు టైటిల్‌నూ కొనసాగిస్తున్నారాయన. మొదటి చిత్రం నుంచే ఆయన ప్రిన్స్‌గా పరిచయం అయ్యారు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ‘దూకుడు’ చిత్రం నుంచి ‘ప్రిన్స్‌’ కాస్తా సూపర్‌ స్టార్‌గా మారిపోయాడాయన. అది మహేశ్‌ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

6.ఎన్టీఆర్‌ ఏ1 స్టార్‌

 

నూనుగు మీసాల వయసులో టాలీవుడ్‌కి ఇండస్ట్రీ హిట్టు అందించారు ఎన్టీఆర్‌. తాత నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకని డైలాగ్‌లు, డ్యాన్స్‌లతో వెండితెరపై చిరుతపులిలా దూకుడుగా కనిపిస్తారు తారక్‌. అందుకే ఆయన్ను ‘యంగ్‌టైగర్‌’ అని అభిమానులు పిలుచుకుంటున్నారు. ‘శక్తి’ సినిమా సందర్భంగా ‘ఏ1 స్టార్‌’గా మారినా ఆ తర్వాత ‘యంగ్‌టైగర్‌’టైటిల్‌తోనే కంటిన్యూ అవుతున్నాడు…!!