Tag Archives: trs

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్న కేసీఆర్!

Prakash Raj:bకన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ప్రకాష్ రాజ్ అతి తక్కువ సమయంలోనే తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రకాష్ రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈయన టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం కోసం పార్టీకి బిఆర్ఎస్ గా నామకరణం చేసిన విషయం మనకు తెలిసిందే. తెలంగాణ భవన్ లో డిసెంబర్ 9న మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది.

ఇకపోతే కెసిఆర్ బిఆర్ఎస్ గా ప్రకటిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ ఆకర్షణగా నిలిచారు.గత కొద్దిరోజులుగా ప్రకాష్ బిజెపి ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తూ బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి నాయకులు తన పార్టీకి ఎంతో కీలకమని భావించిన కేసీఆర్ నటుడు ప్రకాష్ రాజ్ కి తన
బిఆర్ఎస్ పార్టీలో కీలక పదవి అందించబోతున్నారని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

Prakash Raj: బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాష్ రాజ్..

నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక లేదా తమిళనాడు రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాష్ రాజ్ ని నియమించనున్నట్లు సమాచారం. ఇకపోతే గత ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కూడా ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

YS Sharmila: మా నాన్నను కుట్ర చేసి చంపారు.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

YS Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ స్థాపించిన ఆమె వచ్చే ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు.ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆమె పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తున్నారు.

ఈ విధంగా తన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్తూ ఈమె ప్రచారం నిర్వహిస్తుండగా తన ప్రచారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఈమె ఆరోపించారు. ఇకపోతే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈమె కొందరు తనని హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

YS Sharmila: తనని చంపడానికి కుట్ర చేస్తున్నారు…

తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసే చంపారని అలాగే తనని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాపై ఎన్ని కుట్రలు చేసినా తను భయపడనని తను పులిబిడ్డను, తనకు భయం లేదు ఈ సంకెళ్లు నన్ను ఆపలేవు అంటూ ఈమె సంకెళ్లు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే టిఆర్ఎస్ నేతలకు వణుకు ఎందుకు అని ఈమె ప్రశ్నించారు. షర్మిల తన తండ్రి మరణం గురించి తనని కుట్ర చేసే హత్య చేశారంటూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం_ మంత్రి హరీష్ రావు

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి హరీష్ రావ్. కుక్కర్లో కుట్టు మిషను గడియారాలు పంచినా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయని మంత్రి వెల్లడించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్ అని హరీశ్ రావు తెలిపారు.

బీజేపీ కార్పొరేటర్ పై దాడిని ఖండించిన బండి సంజయ్..

మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడిని ఖండించారు బీజేపీ అధ్యక్షుడు సంజయ్. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రవణ్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన టిఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్రమాలను వెలికి తీసి రౌడీయిజాన్ని తొక్కి పడేస్తామని సంజయ్ హెచ్చరించారు.

కాగా పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొందరు టిఆర్ఎస్ నేతలు బిజెపి నేతలపై దాడులు చేశారు. ఈ దాడిలో కార్పొరేటర్ శ్రవణ్ తో పాటు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వీరిని ఆస్పత్రికి తరలించారు.

కేసీఆర్ హుజూరాబాద్ పర్యటన.. ఏర్పాట్లు పూర్తి!

తెలంగాణలో రాజకీయలు హిట్ ఎక్కాయి. టీఆర్‌ఎస్ అధిష్టానం హుజూరాబాద్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికి నియోజకవర్గాన్ని మంత్రులు చూట్టేస్తుండగా.. ఈనెల 16న నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అన్నదానిపై అందరీలో ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఆ తర్వాత నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటన వెళ్ళనున్నారు. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల విసృత్తంగా జిల్లాలా పర్యటన కొనసాగించనున్నారు.

సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌‌తో కలిసి నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ కు గెల్లు శ్రీనివాస్ కృతజ్ఞతలు!

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నమ్మి అవకాశం ఇచ్చినందుకు సీఎంకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి కోసం ముమ్మర కసరత్తు చేసిన అధికార పార్టీ.. రాష్ట్ర టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం పై షర్మిల ఫైర్!

టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు వైఎస్సార్టిపీ అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వం కొత్తగా రేషనలైజేషన్ ప్రక్రియకు తెరతీసిందని ఆరోపించారు. దీని కారణంగా వేల మంది టీచర్లు రోడ్డున పడే అవకాశం ఉన్నట్లు షర్మిల పేర్కొన్నారు.

కాగా రేషనలైజేషన్ విధానంపై ట్వీట్ చేస్తూ..‘టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పేనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో..  సర్కార్ విద్యను మరియు సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పడు..  ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు..  పరిపాలన చేయడం చేతకానప్పుడు..  మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్’ అని షర్మిల ట్వీట్ చేశారు.

ఈటెల రాజేందర్ పై ఫైర్ అయిన తలసాని!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగార్జున సాగర్ లో జానారెడ్డికి పట్టిన గతే రాజేందర్ కి పడుతుందన్నారు. గెల్లు శ్రీనివాస్ ని బానిసగా పేర్కొనడం ఈటెల అహంకారానికి నిదర్శమన్నారు.

హుజురాబద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఈటెలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తలసాని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే శ్రీనివాస్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు.

బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు కోసం పోరాడే వ్యక్తి కావాలా?_ఈటెల

ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో విజయం తనదే అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్ కి బానిసేనని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ప్రశ్నిస్తారోనని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని ఈటెల పేర్కొన్నారు.

కాగా ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఈటెల ఆరోపించారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా? అనేది హుజూరాబాద్‌ ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

టిఆర్ఎస్ నేతలపై మల్లు రవి ఆగ్రహం!

ఇంద్రవెల్లి సభతో టీఆరెఎస్ పార్టీలో కలవరం మొదలైంది అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న భాషను .. ఆ పార్టీ నాయకులు ఒకసారి గమనించాలని సూచించారు.

కాగా టిఆర్ఎస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును తీసుకొచ్చిందని రవి తెలిపారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపాతో రహస్య ఒప్పందం చేసుకుని టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు