Prakash Raj:bకన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ప్రకాష్ రాజ్ అతి తక్కువ సమయంలోనే తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రకాష్ రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈయన టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం కోసం పార్టీకి బిఆర్ఎస్ గా నామకరణం చేసిన విషయం మనకు తెలిసిందే. తెలంగాణ భవన్ లో డిసెంబర్ 9న మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది.
ఇకపోతే కెసిఆర్ బిఆర్ఎస్ గా ప్రకటిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ ఆకర్షణగా నిలిచారు.గత కొద్దిరోజులుగా ప్రకాష్ బిజెపి ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తూ బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి నాయకులు తన పార్టీకి ఎంతో కీలకమని భావించిన కేసీఆర్ నటుడు ప్రకాష్ రాజ్ కి తన
బిఆర్ఎస్ పార్టీలో కీలక పదవి అందించబోతున్నారని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
Prakash Raj: బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాష్ రాజ్..
నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక లేదా తమిళనాడు రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాష్ రాజ్ ని నియమించనున్నట్లు సమాచారం. ఇకపోతే గత ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కూడా ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…