Tag Archives: tsrtc md

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలోకి ఆ బస్సులు..?

హైదరాబాద్ వాసులకు మళ్లీ పాత రోజులు రాబోతున్నాయి . దాదాపు రెండు దశాబ్దాల క్రితం నగరంలో తిరిగిన డబ్బులు మళ్లీ నగరంలో చక్కర్లు కొట్టనున్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఆ మజానే వేరు. జాయింట్ వెల్ లో తిరిగితే ఎలా ఉంటుందో ఈ బస్సుల్లో తిరిగితే అలాంటి అనుభవమే కలుగుతుంది. అయితే గత కొన్నేళ్ల నుంచి నగరంలో ఇలాంటి బస్సులు తిరగడం లేదు.

రెండు దశాబ్దాల క్రితం తిరిగిన బస్సులు క్రమంగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే ఒక నెటిజన్ మంత్రి కేటీఆర్ కు డబుల్ డెక్కర్ బస్సుల గురించి ట్వీట్ చేస్తూ తన బాల్యంలో డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే వాడిననని చెప్పారు. షాకీర్ హుస్సేన్ అనే నెటిజన్ మంత్రితో డబుల్ డెక్కర్ బస్సులతో ఉండే అనుబంధం గురించి పంచుకున్నారు. 7z అనే నంబర్ తో అప్పట్లో బస్సులు నడిచేవని తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి జూపార్క్ వరకు ఈ బస్సులు నడిచేవని.. ఆ బస్సులు మళ్లీ అందుబాటులోకి వస్తే బాగుంటుందని కేటీఆర్ ను కోరారు. ఆ ట్వీట్ ను చూసిన వెంటనే స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నతనంలో అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూలులో చదువుకునేవాడినని ఆ సమయంలో తనకు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని.. ఆ బస్సులను తాను కూడా చూశానని మంత్రి తెలిపారు.

అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆ బస్సులను మళ్లీ రోడ్లపైకి తెచ్చే అవకాశం ఉందా అని ట్విట్టర్ లో కేటీఆర్ ప్రశ్నించారు. టీఎస్ఆర్టీసీ ఎండీతో మాట్లాడి సాధ్యమైతే ఆ బస్సులను ప్రవేశపెడతానని తెలిపారు. దీంతో ఆ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.