Tag Archives: Uppena

Chamanti Movie: ఉప్పెన సినిమాకు 20 ఏళ్ల క్రితం వచ్చిన చామంతి సినిమాకు ఉన్న పోలిక ఏంటో తెలుసా?

Chamanti Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ఉప్పెన సినిమా ద్వారా దర్శకుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే బుచ్చిబాబు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా గత 20 సంవత్సరాల క్రితం వచ్చిన చామంతి సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయి.

అసలు ఈ రెండు సినిమాలకు మధ్య ఉన్న ఆ పోలికలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. 1992 వ సంవత్సరంలో ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో రోజా హీరోయిన్ గా, ప్రశాంత్ హీరోగా తమిళంలో చెంబురుతి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాని తెలుగులో చామంతి పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.

ఈ సినిమాలో చామంతి (రోజా) అన్నయ్య పాండి (రాధా రవి) భానుమతి రామకృష్ణ పనికి చేర్పిస్తారు. అయితే ఈయన వృత్తి చేపలు పట్టడం. భానుమతి మనవడు రాజా (ప్రశాంత్) తన చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని తెలిసి. రాజా ఇంటికి వెళ్లి తనకు వార్నింగ్ ఇస్తాడు. రాజా మామ (నాజర్ క్యారెక్టర్) తన కూతురు మాలతి (వాసవి) ని రాజాకిచ్చి చేయాలనుకుని.. రాజా, చామంతిల ప్రేమకు అడ్డుగా ఉంటారు.మరి వీరిద్దరి ప్రేమకు అడ్డుపడినప్పటికీ రాజా చామంతి ఎలా కలిశారో వారి ప్రేమ ఎలా ఫలించింది అనేదే కథాంశం.

Chamanti Movie: ఉప్పెన… చామంతి మధ్య పోలికలు ఇవే..

ఇక ఉప్పెన సినిమాలో కూడా హీరో చేపలు పడుతూ జాలరిగానే కనిపిస్తారు. ఈ సినిమాలో కూడా హీరో ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉన్నట్టు చూపించారు.హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకున్నప్పటికీ వీరి ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డుపడగా చివరికి వీరిద్దరు ఎలా తమ ప్రేమను గెలిపించుకున్నారనేది ఉప్పెన సినిమా స్టోరీ ఇలా ఈ రెండు సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని చెప్పాలి.

Puspha Movie: సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమా అవార్డుల మోత.. ఎన్ని అవార్డ్స్ దక్కించుకుందంటే…?

Puspha Movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గతేడాది విడుదలైన సూపర్ హిట్ సినిమా పుష్ప. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ఇండస్ట్రీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్ ఇప్పటికి ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల 2022 సైమా అవార్డ్స్ ఫంక్షన్ ని బెంగుళూరులో చాలా ఘనంగా నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగిన ఈ వేడుకకు టాలివుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలందరూ పాల్గొన్నారు.
ఈ ఏడాది సైమా అవార్డు వేడుకలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో హిట్ సినిమాలు నామినేషన్ లో ఉన్నాయి.ఈ క్రమంలో జాతి రత్నాలు, అఖండ, ఉప్పెన, పుష్ప వంటి సినిమాలు సైమా అవార్డ్స్ కి నామినేట్ అయ్యాయి.

ఈ సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమా అన్ని కేటగిరీలలో అవార్డ్స్ దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డు సొంతం చేసుకోగా .. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహనటుడు, ఉత్తమ సాహిత్య రచయిత, ఉత్తమ చిత్రం ఇలా మొత్తం ఆరు కేటగిరీలలో పుష్ప సినిమా 6 అవార్డులు సొంతం చేసుకుంది.

Puspha Movie: రెండు సార్లు సైమా అవార్డ్ అందుకున్న బన్నీ..

సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నవన్నీ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్..” పుష్ప సినిమాలో నా నటనను ఆదరించిన ప్రేక్షకులకు నాకు నా కృతజ్ఞతలు. సైమా అవార్డ్స్ లో రెండవసారి ఇలా అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉంది” అంటూ అల్లు అర్జున్ పోస్ట్ షేర్ చేశాడు. పుష్ప సినిమా ఇలా ఆరు కేటగిరీలలో అవార్డ్స్ సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పెన బ్యూటీ రెమ్యూనరేషన్ ఎంత పెరిగిందో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

మొదటి సినమాతోనే ‘ఉప్పెన’ లా దూసుకువచ్చి.. కుర్రాకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది.. కృతిశెట్టి. మాతృభాష కన్నడం అయినా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మొదట ఆమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది. తర్వాత హీరోయిన్ అయిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది.

యాడ్స్ లో ఎంతోకొంత సంపాదించే ఈమె ఒక్కసారిగా లక్షల్లో సంపాదించడం మొదలు పెట్టింది. ఇదంతా ఇలా ఉండగా.. ఎవరికైనా తన అభినమాన హీరోయిన్, హీరోలకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారనే ఆలోచన.. తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ప్రస్తుతం కృతిశెట్టి రెమ్యూనరేషన్ గురించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తరువాత కృతి డేట్లు దొరకడం కష్టమేనని చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్లో అన్నారు.

అక్షరాలా ఇప్పుడు ఆయన అన్నట్టుగానే జరుగుతోంది. ఉప్పెన సినిమాకి రూ. 25 లక్షల లోపు పారితోషికం తీసుకున్న కృతి శెట్టి, ఆ తరువాత నాని .. సుధీర్ బాబు సినిమాలకి కూడా కాస్త అటు ఇటు గానే పారితోషికం తీసుకుందట. ఆ తరువాత చైతూతో చేస్తున్న బంగార్రాజు .. నితిన్ జోడీగా చేస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా కోసం ఆమె తన పారితోషికాన్నిరూ. 50 లక్షలకు తీసుకెళ్లిందట.

ఉప్పెన సినిమాను బాలీవుడ్ లో రిమేక్ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే దీనికి మాత్రం ఆమెకు కోటి రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఇలా లక్షలతో మొదలైన ఆమె పారితోషికం.. కోటి వరకు వెళ్లింది.

సహనం కోల్పోయి ఉప్పెన బ్యూటీ పై ఫైర్ అయిన డైరెక్టర్..?

“ఉప్పెన” చిత్రం ద్వారా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు కృతి శెట్టి.మొదటి చిత్రం ఉప్పెన అనుకున్న దానికన్నా విజయవంతం కావడంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమా విజయవంతం కావడంతో ఆ తర్వాత ఈమె తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ లొకేషన్ లో హీరోయిన్ లు సరిగ్గా చేయకపోతే దర్శకులు హీరోయిన్లను మందలిస్తారనే వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉప్పెన బ్యూటీ కూడా డైరెక్టర్ లింగుస్వామి సహనానికి పరీక్ష పెట్టి అతని ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

ఉప్పెన సినిమా ద్వారా తన హావభావాలను ఎంతో అద్భుతంగా వ్యక్తపరిచిన కృతిశెట్టి లింగుస్వామిని మెప్పించలేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లింగుస్వామి నాజర్, కృతి శెట్టి మధ్య చిన్నపాటి ఎమోషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి సన్నివేశానికి అనుగుణంగా హావభావాలను సరిగా వ్యక్త పరచలేదని డైరెక్టర్ సెట్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గంట గడచినా కూడా షాట్ ఓకే కాకుండా అధిక టేకులు తీసుకోవటంవల్ల సహనం కోల్పోయిన డైరెక్టర్ షూటింగ్ ముందే సీన్స్ ప్రాక్టీస్ చేయాలనీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పెన ద్వారా అందరినీ మెప్పించిన ఈ బ్యూటీ లింగస్వామిని మాత్రం మెప్పించలేకపోయిందని భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? అబద్దం అనే విషయం తెలియాల్సి ఉంది.