Tag Archives: viral videos

Republic Day : 73 వ గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన… వైరల్ గా మారిన ఫోటోలు !

Republic Day : భారతీయులు ఆగస్టు 15 ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలానే జనవరి 26 కుడా అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది భారత సమరయోధుల కృషి ఫలితమే జనవరి 26 అనగా గణతంత్ర వేడుక. ఈ వేడుకలలో వివిధ సంస్కృతులలో శకటాలు అద్భుతంగా ప్రదర్శించడం జరుగుతుంది. కాగా ఈ మేరకు 73వ భారత గణతంత్ర వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.

73rd republic day celebrations photos goes viral on media

దేశ రాజధాని అయినా ఢిల్లీలోని రాజ్ పథ్ లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కన్నుల పండువగా సాగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. పలు రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన భారత్ లో వైవిద్యానికి మన భారత సంస్కృతికి అద్దంపట్టేలా ఉన్నాయి.

73rd republic day celebrations photos goes viral on media

గణతంత్ర వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పోటీకి డుకలో 480 ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలలో సాంస్కృతిక ప్రదర్శనలు చేశాయి. అయితే ఈ ప్రదర్శనలను కెమెరాల్లో షూట్ చేసిన పరేడ్ దృశ్యాలను రాజ్‌పథ్‌ మార్గంలో ఉంచి ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ రాష్ట్ర శకటం…

అయితే ఈ ఏడాది జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు ప్రస్తుతం ఈ ప్రదర్శన నెటిజన్లు ఆకట్టుకుంటుంది. అలాగే వీటితో పాటు పలు ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి.

సౌందర్య మళ్లీ జన్మించిందా… సౌందర్య రూపురేఖలతో ఉన్న యువతి.. ఫోటోలు వైరల్!

సాధారణంగా మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అలా ఒకే పోలికలతో ఇద్దరూ ఉండడం చూసి ఉంటాం. అయితే ఇలానే సినిమాలో హీరో హీరోయిన్ల విషయంలో కూడా జరిగాయి. ఇప్పటికే హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా పలువురు హీరోల మాదిరిగానే అచ్చం పోలికలతో ఉండే మనుషులను ఇప్పటికే చూశాము. ఇక హీరోయిన్లలో కూడా కాజల్, సమంత పోలికలతో ఉన్న వారిని చూసాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో అలనాటి తార సౌందర్యలా ఉండే ఒక అమ్మాయి ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

సినీ నటి సౌందర్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రతేకంగా చెప్పాల్సిన పని లేదు.సౌందర్య మన నుంచి భౌతికంగా దూరమైనా కూడా ఇప్పటికి ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు మెదులుతున్నాయి. సౌందర్య చూడటానికి పదహారు నాళ్ళ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం,కన్నడ, హిందీ లాంటి బాషలలో కూడా నటించింది. అంతే కాకుండా తన అందం నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

ఈమె నటిగానే కాకుండా మానవతావాదిగా కీర్తి ప్రతిష్టలు పొందిన అందాల ధ్రువ తార సాందర్య. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రమాదవశాత్తు మరణించి అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఈమె చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందింది. అసలు విషయంలోకి వస్తే సోషల్ మీడియాలో అచ్చం సౌందర్య లాగా ఉండే ఒక అమ్మాయి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మలేషియాలో జన్మించిన చిత్ర అనే అమ్మాయి, ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూసి ఒక్కసారిగా సౌందర్య ఫాన్స్ షాక్ కు గురయ్యారు. అచ్చం సౌందర్యాల ఉన్న ఈమెను చూసి సౌందర్య మళ్ళీ పుట్టిందేమో అని అనుకున్నారు. అచ్చం సౌందర్యలా ఉన్న ఈ చిత్ర వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వీడియోలకు మీరు అచ్చం సౌందర్య లాగే ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.chitra-jii2 పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఎన్నో వీడియోలను షేర్ చేసింది. ఈమెకు ప్రస్తుతం 77 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ముసలి నుంచి క్షణాల్లో తప్పించుకున్న దున్న.. వీడియో వైరల్..!

మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. ముసలికి నీటిలో కొండంత బలం ఉటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే.. నీటిలో ఉన్నంత వరకు ముసలిని ఎంతటి అడవి రాజు అయినా ఏం చేయలేరు. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. పెద్ద పెద్ద జంతువులను పట్టి తనకు ఆహారంగా మార్చుకున్న సంఘటనలు మనం ఎన్నో చూశాం.

టీవీలోని డిస్కవరీ చానల్ లో ఇటువంటివి మనకు కనిపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. మొసలి నోటికి చిక్కినట్లే చిక్కి అడవి దున్న తప్పించుకుంది. ఓ ఆఫ్రికన్ అడవి దున్న నదిని దాటుతుంది. సరిగ్గా మధ్యకు వచ్చేసరికి దానిపై మొసలి మెరుపు దాడి చేస్తుంది.

తన పదునైన దవడలతో అడవి దున్నను నీటిలోకి లాగేందుకు మొసలి తీవ్రంగా ప్రయత్నించింది. ముసలికి ఏమనిపించిందో ఏమో గాని దానిని నోటిలో కరుచుకొని ఒడ్డు దగ్గరకు తీసుకొచ్చింది. అది గమనించిన దున్న ఒక్కసారిగా బయటపడేందుకు ప్రయత్నించింది. అడవి దున్న తన శక్తిని మొత్తం కూడగట్టుకుని.. ఆ మొసలి నుంచి తప్పించుకుంటుంది.

ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటుంది. ఇది సోషల్ మీడియలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. దున్న ధైర్యానికి ఎంతో మంది మెచ్చకొని.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నదులను తలపిస్తున్న చైనా రోడ్లు.. వరదల్లో చిక్కుకున్న నగరాలు!

చైనా దేశం గత కొన్ని సంవత్సరాలలో ఎప్పుడు చూడని వర్షాన్ని ఈ ఏడాది చూస్తోంది. ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాల కారణంగా చైనాలోని పలు నగరాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు, రైల్వే స్టేషన్లు నదులను తలపిస్తున్నాయి. అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల పెద్ద ఎత్తున రోడ్లపైకి నీరు చేరుకోవడంతో పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇప్పటివరకు ఈ వరద ఉధృతిలో సుమారు 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

చైనాలోని హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ఝౌలో సుమారు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాత్రికి రాత్రి భారీ వర్షాలు కురవడం చేత నైట్ షిఫ్ట్ ఉద్యోగాలకు వెళ్ళినవారు, ఆఫీసులోనే ఇరుక్కుపోయారు.ఈ క్రమంలోనే వరద ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రస్తుతం చైనా దేశంలో సుమారు 10 నగరాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం హెనాన్ ప్రావిన్స్ లో అధిక వర్షపాతం నమోదు కావడమే కాకుండా ఈ ప్రాంతం వారికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు. ఈ ప్రాంతానికి అతి దగ్గరలోనే డ్యామ్ ఉందని ప్రస్తుతం వర్షాల కారణంగా అది పూర్తిగా దెబ్బతింది. ఒకవేళ వర్షాలు తెరపి లేకుండా పడితే డ్యామ్ దెబ్బతిని కూలిపోతే నగరం మొత్తం జలప్రళయంలో కూరుకు పోతుంది.

ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ప్రజలు వర్షం ధాటికి ప్రజలు లు పడుతున్న ఇబ్బందులకు,వర్షం కారణంగా వరద నీటిలో కొట్టుకు పోతున్న కార్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ఝౌ ప్రాంతంలో ఏడాది మొత్తం వర్షం కురుస్తూనే ఉంటుంది. అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

వీడియో వైరల్: అదిరిపోయే స్టెప్పులపై ప్రశంశలు కురిపిస్తున్న నెటిజన్లు?

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలలో పాల్గొన్నప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి చిందులు వేస్తాము. లేదంటే ఇంట్లో ఎవరూ లేకపోతే అలా సరదాగా డాన్స్ వేయడం చేస్తుంటాము. అయితే ఈ విధమైనటువంటి చిందులు వేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ సాంప్రదాయ నృత్యాలు అయినా భరతనాట్యం కూచిపూడి వంటి డాన్సులు చేయాలంటే ఎంతో శిక్షణ అవసరమవుతుంది. ఈ విధమైనటువంటి డాన్స్లు చేయాలంటే మహిళలు ఎంతో కష్టపడుతుంటారు.

ముఖ్యంగా భరతనాట్యం డ్రెస్ ధరించి ఇలాంటి డాన్స్ లు చేయాలంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇలాంటి నృత్యం చేయాలంటే ఎక్కువ శిక్షణ కూడా అవసరం అవుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం భరతనాట్యాన్ని ఎంతో అవలీలగా అది కూడా భరతనాట్యం డ్రెస్ ధరించి ఎంతో చాకచక్యంగా వేశారు. ప్రస్తుతం ఈ వ్యక్తి చేసిన భరతనాట్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ డాన్స్ చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి డాన్సర్ అని… భరతనాట్యం స్టెప్పులను ఎంతో అద్భుతంగా వేస్తున్నారని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలోని వ్యక్తి పైన చొక్కా ధరించి కింద భరతనాట్యం డ్రెస్ ధరించి ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. సుశాంత్‌ నంద అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరెందుకు ఆలస్యం ఆ అద్భుతమైన ప్రదర్శన పై మీరు ఓ లుక్కేయండి.

ఒకరిని ఒకరు తాకకుండా పెళ్లి చేసుకున్న వధూవరులు.. వీడియో వైరల్?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులలో పెళ్లి అంటే ఎంతో కష్టమైన పని.పెళ్లికి ఎంతో మంది జనాలు రావడంతో వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేవలం కొంతమంది సమక్షంలో మాత్రమే పెళ్ళిళ్ళు జరగడం మనం చూస్తున్నాము.ఈ కొంత మంది కూడా ఖచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారు మాత్రమే పెళ్లికి హాజరు కావాలనే రూల్స్ ఉన్నాయి. పెళ్లికి వచ్చిన బంధువులు సోషల్ డిస్టెన్స్ పాటించడం మనం చూస్తూ ఉంటాము. కానీ వధూవరులు సోషల్ డిస్టెన్స్ పాటించడం మీరు చూశారా..

సాధారణంగా పెళ్లి కార్యక్రమంలో వధూవరులిద్దరూ పక్కపక్కనే కూర్చుని ఎన్నో పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పూజలు చేస్తుంటారు. కానీ బీహార్లోని ఓ జంట మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, ఒకరినొకరు తాకకుండా పెళ్లి చేసుకున్నారు. చివరికి వీరు దండలు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కర్ర సహాయంతో మార్చుకోవడం వైరల్ గా మారింది.

ముందుగా అనుకున్న ప్రకారం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బీహార్ లో బెగూసరాయ్‌లో ఓ జంట పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.పెళ్లికి వచ్చిన అతిథులకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కుర్చీలు వేశారు. పెళ్లి మండపంలో శానిటైజర్ మాస్కులు ఎన్నో అందుబాటులో ఉంచారు. చివరికి వధూవరులు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కర్రల సహాయంతో దండలు మార్చుకోవడం చూసిన అతిథులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దేశవ్యాప్తంగా పలు శుభకార్యాలలో ప్రతి ఒక్కరు ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని, దేశం నుంచి కరోనాను తరిమేయాల వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది అంటూ ఈ పెళ్లి ఎంతో మందికి ఆదర్శం కావాలని అధికారులు ఈ వధూవరుల ఆలోచనలపై ప్రశంసలు కురిపించారు.

ఏటీఎం సెంటర్‌లో అలాంటి పని చేసిన వ్యక్తి.. వైరల్ వీడియో

సాధారణంగా కొందరు మనుషుల ఆలోచనా ధోరణి, వారి ప్రవర్తన ఎప్పటికీ ఎవరికీ అర్థం కావు. కొన్నిసార్లు కొందరు వారికి ఎటువంటి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనను ఆచరణలో పెడుతుంటారు. ఈ విధంగా కొందరు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ప్రస్తుతం మన దేశం ఎలాంటి విపత్కర పరిస్థితులలో ఉందో మనకు తెలిసిందే. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మాస్కు ధరించి, శానిటైజర్ వాడటం ఎంతో ఉత్తమం.

మొదటి దశ కరోనా వ్యాపించినప్పుడు శానిటైజర్ లో కొరత అధికంగా ఉండేది. దీంతో ఎంత ధర అయినా కూడా చెల్లించి కొనేవారు. కానీ ప్రస్తుతం శానిటైజర్ లో కొరత లేకుండా ఎక్కడైనా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన పని నిమిత్తం బ్యాంకు వెళ్లిన, ఏటీఎం వెళ్లిన, షాపింగ్ మాల్ వెళ్లిన, హోటల్ వెళ్లినా అక్కడి సిబ్బంది మనకు శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇలాంటి సమయాలలో కూడా కొందరు వాటిపై వారికి ఉన్న కక్కుర్తి బయట పెడుతూ ఏదోవిధంగా శానిటైజర్ లను దొంగతనం చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఒక ఏటీఎం లోకి వ్యక్తి డబ్బులు డ్రా చేసుకోవడం కోసం వెళ్లారు. అయితే అక్కడ శానిటైజర్ ఉండడంతో చేతులు శానిటైజ్ చేసుకొని డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలోనే అతని చూపు అక్కడ ఉన్న శానిటైజర్ బాటిల్ పై పడింది. ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో పాటు మొహానికి ఉండటంవల్ల తనని ఎవరు గుర్తుపట్టరనే ధీమాతో అక్కడ ఉన్నటువంటి శానిటైజర్ బాటిల్ తీసి తన బ్యాగ్లో వేసుకుని ఏం తెలియనట్టు హుందాగా బయటికి వెళ్లిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోని IPS ఆఫీసర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లు ఉంటే… శానిటైజర్లను కూడా సెక్యూర్ చేయడం కోసం ఒక బోన్ ఏర్పాటు చేయాలి. దానికి 200 -300 వరకు ఖర్చు అవుతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియో పై పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.