Tag Archives: vizag

Drugs: విశాఖ డ్రగ్స్ లో చంద్రబాబు హస్తం ఉంది.. నిజానిజాలు తేల్చాలి: సజ్జల

Drugs: విశాఖ సి పోర్టులో ఓ కంటైనర్ లో సుమారు 25 వేల కేజీల డ్రగ్స్ సిబిఐ అధికారులు సీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కసారిగా భారీ మొత్తంలో డ్రగ్స్ అది ఎన్నికల సమయం ముందు అధికారులు సీజ్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారనే విషయం గురించి సిబిఐ ఆరా తీస్తున్నారు.

ఇలా విశాఖ సీ పోర్టులో డ్రగ్స్ కలకలం సృష్టించడంతో చంద్రబాబు నాయుడు ఇదంతా వైకాపా పనే అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. దీంతో శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేశారు.

డ్రగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది అంటే దొంగనే దొంగ దొంగ అని అర్చినట్టూ ఉంది అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఇలా విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం వెనుక తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు బిజెపి హస్తము ఉందని ఈయన ఆరోపణలు చేశారు. తప్పు నుంచి బయటపడటం కోసం ఆ తప్పును మేము చేయలేదని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబునాయుడు మా పై బురద చల్లుతున్నానని సజ్జల వెల్లడించారు.

25 వేల కిలోల డ్రగ్స్..
విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. వ్యవస్థలపై చంద్రబాబు నాయుడుకి గౌరవం లేదని ఆయనది వీధి స్థాయిలో మనస్తత్వం చెలరేగిపోయారు. ఇక ఈ డ్రగ్స్ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని అందుకోసం తాము సిబిఐతో పాటు ఈసీ కి కూడా లేఖలు రాస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించడం కోసమే డ్రగ్ సరఫరా జరిగిందని అయితే పట్టుబడటంతో తప్పించుకోవడానికి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan -Ali: పవన్ వ్యాఖ్యలు సరైనవి కాదు.. అలీ కామెంట్స్ వైరల్?

Pawan Kalyan -Ali: ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీ మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే తప్పనిసరిగా ఆ సినిమాలో ఆలీ ఉండాల్సిందే. అలా వీరిద్దరి మధ్య రిలేషన్ ఉంది అయితే వీరిద్దరూ రాజకీయాలలోకి రావడం వల్ల రాజకీయాలు వీరిద్దరిని బద్ధ శత్రువులుగా మార్చాయి.

అలీ వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయక పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి వైసిపి పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే వైసిపి ప్రభుత్వం పై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అలీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వం ప్రజల కోసమే ఎంతో కృషి చేస్తుందని ఈయన వెల్లడించారు.

2019 ఎన్నికలలో ప్రజలు అప్పనంగా 151 సీట్లు జగన్ కి అందించలేదని, ప్రజలకు జగన్ పై నమ్మకంతోనే ఆయనకు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. ఇకపోతే ఏపీ రాజధాని ఎక్కడ పెట్టిన అభివృద్ధి మాత్రం రాష్ట్రమంతా జరుగుతుందని అలీ పేర్కొన్నారు. విశాఖషూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు బీచ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని విశాఖ ఎంతో అభివృద్ధి చెందినదని ఈయన తెలిపారు.

Pawan Kalyan -Ali: అలీ పవన్ మధ్య దూరం పెరగనుందా…

విశాఖలో ఎలాంటి అభివృద్ధి చెందని సమయంలో కూడా సినిమా షూటింగ్లో జరుపుకున్నాయని అయితే ప్రస్తుతం మరింత అభివృద్ధి చేయడంతో ఇతర భాష సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయని ఆలీ పేర్కొన్నారు.ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ ను తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం అర్థం లేదని అలీ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే కొందరు అలీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏపీ ఎలక్ట్రానిక్ సలహాదారుడుగా ఈయనకు పదవి రావడంతో జగన్ ప్రభుత్వం పై ప్రశంసల కురిపిస్తున్నారని ఈ ప్రశంసల కారణంగా అలీ పవన్ మధ్య మరింత దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

“ఈ రాళ్లలో ఏం కడతావు బ్రదర్..” ఎన్టీఆర్ అన్న చోటే స్టూడియో కట్టి చూపించిన రామానాయుడు.

కొన్ని ఆలోచనలు ఆచరణలో పెట్టడం చాలా కష్టం. పట్టుదల ఉంటే అది ఎలాగైనా సాధించవచ్చు. కానీ దానికి కఠోర శ్రమ అవసరం. అలాంటి కఠోర శ్రమ, ఆశయంతో పనిచేసి రాళ్లల్లో స్టూడియోను నిర్మించారు దగ్గుపాటి రామానాయుడు. ఇంతకు విషయం ఏంటంటే.. అప్పల్లో మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రానికి సినిమా పరిశ్రమను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో బంజారాహిల్స్ లోని ఓ స్థలాన్ని అప్పటి సీఎం జలగం వెంగళరావు అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు కేటయించారు.

డి. రామానాయుడును కూడా ఆయ‌న “స్థ‌లం కావాలా?” అని అడిగారు. ఆయన వద్దు అన్నాడంట. ఎందుకంటే అతడికి హైదరాబాద్ వచ్చే ఆలోచన లేదు. అప్పటి వరకు రామానాయుడు విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ అధినేతల్లో ఒక‌రైన నాగిరెడ్డి గారి పిల్ల‌ల‌తో క‌లిసి ఉండ‌టం వ‌ల్ల వాహినీ స్టూడియోనే త‌న స్టూడియో అనుకొని ఆయ‌న సినిమాలు తీస్తూ వ‌చ్చారు. 1976 సంవత్సరంలో డి.రామానాయుడు నిర్మించిన తొలి చత్రం‘సెక్రటరీ’.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోలో తీశారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ తీసిన మొదటి సినిమా కూడా సెక్రటరీనే. దీని ప్రారంభానికి వచ్చిన నాగిరెడ్డి.. ఈ కొండల్లో స్టూడియో క‌డితే బాగుంటుందని రామానాయుడుతో అనడం వల్ల అతనికి అక్కడ స్టూడియో కట్టాలి అనే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత భవనం వెంకట్రామ్ సీఎం గా ఉన్న సమయంలో రామానాయుడుకు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స్థ‌లాలు కేటాయించారు. తర్వాత ఓ రోజు ఎన్టీఆర్ రామానాయుడుకి ఇచ్చిన స్థలం చూసి ‘ ఈ రాళ్లల్లో స్టూడియో ఎం కడతావ్’’ అన్ని అన్నారట. దానికి సమాధానంగా రామానాయుడు వ్యూ బాగుంది అని అన్నారు. “వ్యాపారం చేస్తావా, వ్యూ చూసుకుంటూ కూర్చుంటావా? మంచి స్థ‌లం చూసుకోరాదా..” అని న‌వ్వారు రామారావు. కానీ అతడు ఇవన్నీ పట్టించుకోలేదు.

అనుకున్నట్లుగానే పని మొదలు పెట్టాడు. ఒక రాయిని ప‌గ‌ల‌గొట్ట‌డానికి ఆరు నెలల సమయం ప‌ట్టేస‌రికి ఆయ‌న‌లో చాలా నిరాశ క‌లిగింది. అప్పటికే సురేశ్ ఆయనతో ఉండటం.. వెంకటేశ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడంతో రామానాయుడిలో స్టూడియో కట్టాలనే పట్టుదల ఇంకా పెరిగింది. ఉన్న డ‌బ్బంతా రాళ్ల‌లో పోశారు. వీటిని గమనిస్తున్న పత్రికల వాళ్లు .. మీ ఆశయం ఏంటీ అని అడగ్గా.. ” స్క్రిప్టు తీసుకొని నా స్టూడియోలోకి అడుగుపెట్టిన నిర్మాత‌.. ప్రింట్ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లాలి. అన్ని సౌక‌ర్యాలు ఈ స్టూడియోలోనే క‌లిగించాల‌న్న‌దే నా ఆశ‌యం.” అని ఆయన చెప్పుకొచ్చారు. అలా ఆయన ఆశయాన్ని కొన్నాళ్ల తర్వాత తీర్చుకున్నారు.

అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో గంజాయి కూడా దొరుకుతుంది..! వీళ్లు చేసేది తెలిసి షాక్..

ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కువగా పాపులర్ అయినవి అమెజాన్, ప్లిఫ్ కార్టు. వీటి ద్వారా నిత్యావసర సరుకులతో పాటు, గాడ్జెస్, విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ మరియు ఇంటి సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో కూర్చొని ఆ సంస్థల వెబ్ సైట్ కి వెళ్లి బుక్ చేసుకుంటే.. ఇంటికే డెలివరీ అయిపోతాయి. వీటికి ఒక ఆఫీస్ అంటూ ఏం ఉండదు.

అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది. అయితే ఇక్కడ అమెజాన్ లో ఇవన్నీ కాకుండా గంజాయి కూడా దొరుకుతుందట. కొంతమంది ఎవరికీ తెలియకుండా.. అనుమానం రాకుండా ఆన్‌లైన్‌లో సేవల ద్వారా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల పోలీసులు ఇలా అమెజాన్ ఆన్ లైన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అస్సలు ఎలా జరుగుతుంది.. ఎక్కడ నుంచి జరుగుతోంది అనే విషయాలను రాబట్టారు పోలీసులు.

విశాఖపట్టణం కేంద్రంగా మధ్యప్రదేశ్‌కు గంజాయిని సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాలను మధ్యప్రదేశ్ పోలీసులకు చేరవేయగా అక్కడ బెండీలో కేసు నమోదు చేశారు. అక్కడ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నేడు విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని ఓ ఆన్ లైన్ స్టోర్ లో.. కాఫీ పొడి, కరివేపాకు పొడి పేరుతో డబ్బాల్లో గంజాయి పెట్టి.. గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

అందులో కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వాళ్లు పార్సల్ రూపంలో ఇస్తుంటే.. వాటిని శ్రీనివాస్‌ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.

డాక్టర్ సుధాకర్ కేసులో ఐదుగురు అధికారుల పాత్ర.. మరణించిన సంవత్సరానికి అసలు గుట్టు?

కరోనా మొదటిదశలో భాగంగా విశాఖపట్నంకి చెందిన డాక్టర్ సుధాకర్ అప్పట్లో ఎంత హంగామా క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆస్పత్రిలో ఒక మాస్క్, గ్లౌజులు ఇచ్చి వాటిని పదేపదే వాడుకో అని చెబుతున్నారు అంటూ పెద్ద ఎత్తున మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యారు.

ఇలా డాక్టర్ సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అప్పటి ప్రభుత్వం నిజానిజాలు గురించి ఎంక్వయిరీ చేసి ఆయనను విధుల నుంచి తొలగించడం జరిగింది.ఇలా విధుల నుంచి తొలగించిన తర్వాత ఆయనపై కేసు నమోదు చేయడంతో కొన్ని రోజుల పాటు మానసికంగా ఎంతో క్షోభ అనుభవించి డాక్టర్ సుధాకర్ ఆస్పత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా ఈ కేసు విచారణలో భాగంగా కేసును సీబీఐకు అప్పగించాలని తెలియజేసింది.

ఈ క్రమంలోనే సుధాకర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించి గుండెపోటుతో మరణించారు. సుధాకర్ కేసులో సిబిఐ విచారణ చేపట్టగా సుధాకర్ వ్యవహారంలో ఐదుగురు అధికారుల పాత్ర కీలకంగా ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు అధికారులు వారి దర్యాప్తులో పేర్కొన్నారు.

ఇలా ఐదుగురు అధికారులు పేర్లను నమోదు చేసిన సీబీఐ వారిని ప్రాసిక్యూషన్ జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని సి.బి.ఐ హైకోర్టుకు తెలియజేయడంతో ఆ అయిదుగురు అధికారులను ప్రాసిక్యూషన్ చేరడానికి హైకోర్టు అనుమతి తెలిపింది.

75 ఏళ్ల వయస్సులో కూడా ఎన్నో పతకాలు.. ఇంతకు అతడి రహస్యం ఏంటి..?

‘ముసలోడే కానీ మహానుభావుడు’ అనే డైలాగ్ ను సినిమాలో బ్రహ్మానందం చెబుతారు. నిజ జీవితంలో ఆ డైలాగ్ కు అచ్చం అచ్చగుద్దినట్లు సరిపోతాడు ఈ 75 ఏళ్ల వృద్ధుడు. ఇంతకు అతడి గొప్పతనం ఏంటంటే.. 20 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్లే ఒక కిలోమీటరు దూరం పరుగెత్తడానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది అతడు 75 ఏళ్ల వయస్సులో కూడా ఎన్ని కిలో మీటర్లు అయినా అవలీలగా పరుగెత్తి నేటి తరానికి తాను ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు ఈ విశాఖకి చెందిన ఈ పెద్దాయన.

ప్రహ్లాదపురం దరి విరాట్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తాళాబత్తుల వెంకటరమణ(75) పరుగులో తన మార్క్ ను చూపిస్తున్నారు. అతడు పరుగులో చూపించిన ప్రతిభకు యవకులు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
అతడు ఐదేళ్ల వయస్సులోనే పరుగు పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. ఉదయం వ్యాయామం, నడక, ధ్యానం చేస్తుంటాడు. దీంతో రోజంతా ఉల్లాసంగా ఉండటమే కాకుండా.. ఏ పని చేయాలన్నా అలసట రాదని అతడు చెబుతున్నాడు.

అతడు పరుగుల వీరుడే కాదు.. నాటకాల్లో కూడా నటించే ధీరుడు కూడా. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే పలు నాటకాల్లో అతడు ప్రదర్శించి మెప్పించాడు. ప్రస్తుతం కరోనా కారణంగా అవి జరగడం లేదని.. మళ్లీ మొదలైతే అందులో కూడా పాల్గొంటానని చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అథ్లెటిక్స్‌లో పాల్గొని ఎన్నో పతకాలను కైవసం చేసుకున్నాడు.

75 ఏళ్ల వయస్సు వచ్చినా అతడిలో ఉత్సాహం తగ్గలేదు. అంతేకాకుండా అతడిని చూసి చాలా మంది స్పూర్తిగా తీసుకుంటున్నారు. ఎన్ని పనులు ఉన్నా వ్యాయామం చేయడం అనేది మనిషికి ఎంతో అవసరం అని అతడు చెబుతున్నారు. రోగాలు దరిచేరకుండా ఉండటమే కాదు.. చేసే పనిలో కూడా ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నాడు. మంచి అలవాట్లతో జీవిస్తే నిత్యం ఉల్లాసంగా ఉండవచ్చని చెప్పారు. అతడు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటానన్నాడు.

రానున్న రోజుల్లో విశాఖపట్నం మునిగిపోనుందా.. ఇందులో నిజమెంత..?

వైజాగ్ సముద్రంలో మునిగిపోతుందన్న వార్త గత రెండు రోజుల నుంచి వినపడుతోంది. రానున్న 80 సంవత్సరాల్లో వైజాగ్ మూడు అడుగుల నీటిలో ఉంటుందని.. ఆ తర్వాత కనుమరుగయ్యే ప్రమాదముందని ఓ నివేదిక తేల్చింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) ఇచ్చిన ఈ నివేదిక భయాందోళనకు గురిచేస్తోంది. విశాఖపట్నంతో పాటు దేశంలోని 12 నగరాలు దాదాపు మూడు అడుగుల మేర సముద్రపు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది.

అయితే నిపుణులు మాత్రం తూర్పు కనుమల కొండ ప్రాంతాలు సముద్రానికి అడ్డుగా ఉండటం వల్ల.. నగరం మునిగిపోయే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. సుమద్రం మట్టం అనేది పెరుగుతంది.. కానీ ఒకే స్థాయిలో పెరగదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ హెడ్ జీపీఎస్ మూర్తి తెలిపారు.

ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ నివేదిక కేవలం అంచనా మాత్రమే అని.. అది వాతావరణ మార్పులపై మాత్రమే ఆధారపడి ఉంటాయని మూర్తి చెప్పారు. రాబోయే కాలంలో వాతావరణ మార్పులు అనేవి చోటుచేకుంటాయని.. లోతట్టు ప్రాంతాలైన నెల్లూరు, చెన్నైలలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతుందని.. కానీ విశాఖపట్నంలోని సముద్ర జలాలు బీచ్ రోడ్డును కూడా చేరుకోలేవని మూర్తి విశ్లేషించారు.

భౌగోళిక స్థానాలు అనుకూలంగా ఉండటమే దీనికి కారణం అని మూర్తి వివరించారు. సుమద్రపు తీర ప్రాంతాలైన చెన్నై, మంగళూరు, ముంబై, విశాఖపట్నం 2100 నాటికి సముద్రంలో మునిగిపోతాయని ఐపీసీసీ నివేదిక అంచనా వేయడంతో వీటిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.

విశాఖలో కరోనాకు ఏడాది చిన్నారి మృతి..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు ఛాస్తున్న నేపథ్యంలో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోంది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఏడాది బిడ్డను కరోనా బలితీసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కన్నబిడ్డను కోల్పోవడంతో ఆ తల్లి ఎంతో విలపించింది.

అచ్యుతాపురం మండలం చౌడుపల్లికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్‌లో పని చేస్తున్నారు. ఏడాది వయసున్న కూతురు జ్ఞానితకు గత నాలుగు రోజుల క్రితం అధికంగా దగ్గు, జలుబు, జ్వరం రావడంతో సన్ రైస్ ఆసుపత్రిలో చేర్పించారు.దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసిన పాపకు నయం కాకపోవడంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం పాపని మరొక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు పాపను కేజీహెచ్‌కు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ప్రత్యేక అంబులెన్స్ లో జ్ఞానితను కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి చేరుకొని అడ్మిషన్ చేసే లోపు పాప మృత్యువాత పడింది.మూడు రోజుల పాటు చికిత్స అందిస్తూ చివరిక్షణంలో పాప ప్రాణాలను కోల్పోవడంతో ఆస్పత్రి ఆవరణంలో ఆతల్లి రోదన చూసిన కేజీహెచ్‌లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.విశాఖలో కరోనాకు ఏడాది చిన్నారి మృతి..!