Tag Archives: womens

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. కర్రలు, ఇనుప రాడ్‌లతో ఇద్దరు మహిళలపై దాడి..!

ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు 38 ఏళ్ల మహిళపై కర్రలు, ఇనుప రాడ్‌లతో దారుణంగా దాడి చేశారు. అంతే కాదు ఆమె వెంట ఉన్న తన కూతురుపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో గత నెల నవంబర్ 19న ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు.

దాడి చేసిన వాళ్లు.. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ కి సంబంధించిన వాళ్లు కాబట్టి వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ వాపోయింది. ఆ రోజు గాయపడిన ఆ ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల వాళ్లు డిశ్చార్జి కాగా దాడికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశంలో ఉన్న సీసీటీవీని పరిశీలించారు.

ఇద్దరు మహిళల కారు నుంచి దిగగానే కొంతమంది వచ్చి కర్రలతో తన్నడం, కొట్టడం చేశారు. దాడి చేసిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. దాడి సమయంలో అందులో ఓ మహిళ కారు పక్కకు వెళ్లి.. కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేయడంతో వాళ్లు అక్కడ నుంచి పారిపోయారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ప్రకటనలో పేర్కొంది.

దాడికి పాల్పడిన మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటంటే.. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది. నేను చేసిన తప్పులను బయటపెట్టాను. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి” అని ఆ మహిళ తెలిపింది. అయితే అవన్నీ నిరాధారణమైనవి అంటూ తన ఆరోపణలను తిప్పి కోట్టారని చెప్పింది. అప్పటి నుంచి నాపై పగ పెంచుకున్నట్లు ఆరోపించింది. ఈ కారణంగానే తనపై దాడి జరిగిందన్నారు.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎలా ఉండాలి.. ఏం తీసుకోవాలంటే?

మహిళా గర్భం దాల్చడం అనేది ఒక వరం లాంటిది. అటువంటి సమయంలో ఏ ఫుడ్ తీసుకోవాలో చాలామందికి తెలవదు. ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే పుట్టే బేబి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆరోగ్య కరమైన గర్భాధారణ కోసం ప్రతీ మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని చిట్కాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.

గర్భం వచ్చిందా.. రాలేదా అనేది శరీరంలో వచ్చే మార్పుల ఆధారంగా తెలుసుకోవచ్చు. శరీరంలో మార్పులను గమినిస్తే వెంటనే ప్రెగ్నేన్సీ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ గా రిపోర్ట్ వస్తే.. అటు వంటి సమయంలో ఏం తినాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే వాటిని ఇంటి పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఇక్కడ చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

సాధారణంగా గర్భం దాల్చిన మహిళతో పొల్చితే సాధారణ మహిళలు బరువు తక్కువగా ఉంటారు. ప్రతీ నెల ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళ బరువు పెరుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు ఉండటం కూడా ప్రమాదకరమే. దాదాపు 10 నుంచి 12 కిలోల వరకు బరువు పెరిగితే పర్వాలేదు కానీ.. అంత కంటే ఎక్కువగా బరువు పెరిగితే ప్రమాదం అని నిపుణులు తెలుపుతున్నారు. ఇక తినే పండ్ల విషయంలో అధికంగా పోలిక్ యాసిడ్ ఉన్న పండ్లను తీసుకోవాలి.

నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు తెలుపుతున్నారు. రెండో నెలలో 350 అదనపు కేలరీలు.. మూడో నెలలో 450 అదనపు కేలరీలను తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు వ్యాయామం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేస్తుండాలి. పడుకునే సమయం దాదాపు 6 నుంచి 8 గంటల మధ్య ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగుతున్న శిశువు ఆరోగ్యకరంగా జన్మిస్తాడు.

మహిళలకు ఢిల్లీలో రక్షణ లేదు.. దానికి ఉదాహరణ నాదే: బాలీవుడ్ నటి నిఖిత రావల్

ఢిల్లీలోని శాస్త్రి నగర్‌లో తుపాకీతో తనను కొందరు దుండగులు బెదిరించి దాదాపు రూ.7 లక్షల వరకు దోచుకున్నట్లు బాలీవుడ్ నటి నిఖిత రావల్ చెప్పుకొచ్చారు. ఆ భయంకరమైన ఘటన గురించి ఆమె మాట్లాడారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఏ పని చేయాలన్నా భయంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ నిఖిత ఏం మాట్లాడారంటే.. ఎంగేజ్‌మెంట్ పార్టీలో అతిథి పాత్ర కోసం ఢిల్లీకి వచ్చానని చెప్పారు.

ఆమెతో పాటు ఆమె చెల్లెలు కూడా ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో వారు ఈవెంట్ నుండి శాస్త్రి నగర్‌లోని తన అత్త ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆమెకు ఎదురుగా ఓ కారు వచ్చి ఆగిందని.. అందులో నుంచి కొందరు ముఖాలకు మాస్కులు ధరించి.. కోతి టోపీలు పెట్టుకొని కొందరు కారు నుంచి దిగారన్నారు. తర్వాత వెంటనే తన వద్దకు వచ్చి ఒకడు తుపాకీ తీసి.. మరొకరు కత్తి తీసి.. తన వద్ద డబ్బులను ఇవ్వమని బెదిరించారన్నారు. అంతే కాకుండా తనను దుర్భాషలాడుతూ.. బెదిరించి పర్సు, డబ్బులు, డైమండ్ రింగు మరియు చెవి కమ్మలను దోచుకెళ్లినట్లు చెప్పారు.

ఆమెతో పాటు తన చెల్లి కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు తనను బెదిరిస్తున్న సమయంలో నిర్భయ ఘటన ఆమె మనస్సులోకి వచ్చినట్లు చెప్పింది. వాళ్లు వెళ్లిపోగానే వెంటనే హుటాహుటిన తన అత్త ఇంటికి చేరుకోగా.. 10 నిమిషాల వరకు అదే ఘటనను గుర్తు చేసుకుంటూ ఎంతో భయటపడి పోయానని చెప్పారు. తర్వాత ఆమె ఆ షాక్ నుంచి తేరుకోగానే వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారట.

తర్వాత వెంటనే ఒక్క క్షణం కూడా ఢిల్లీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలో తనను తుపాకీతో కాల్చినా.. రేప్ చేసినా తన పరిస్థితి ఏంటని తలచుకొని.. ఆ చేదు అనుభవాన్ని ఇంకా మర్చిపోలేక పోతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ముమ్మటికీ ఆడవాళ్లకు భద్రత లేదని.. కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మైదానంలోకి శునకం ఎంట్రీ.. అందరూ చూస్తుండగానే పరుగులు పెట్టింది.. వీడియో వైరల్

సాధారణంగా మనం క్రికెట్ చూస్తున్న సమయంలో మ్యాచ్ మధ్యలో శనకాలు, పావురాలు వచ్చి కొద్దిసేపు అంతరాయాన్ని కలిగిస్తాయి. ఇలా చాలా సందర్భాల్లో జరిగాయి కూడా. అయితే వాటిని సిబ్బంది అక్కడ నుంచి పంపించే దాకా మ్యాచ్ ఆగిపోతుంటుంది.

ఇలాంటిదే ఒక ఘటన మహిళా టీ20 లో చోటు చేసుకుంది. అది ఎక్కడంటే.. మహిళల దేశీయ టి 20 టోర్నమెంట్ ‘ఆల్ ఐర్లాండ్ టి 20 కప్’ జరుగుతోంది. దీని సెమీ-ఫైనల్ మ్యాచ్ శనివారం 11 సెప్టెంబర్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో బైర్డీ క్రికెట్ క్లబ్ వర్సెస్‌ సివిల్ సర్వీస్ నార్త్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు టీమ్ లలో ఎవరు గెలిచిన ఫైనల్లో అడుగు పెడతారు.

బైర్డీ క్లబ్ మొదట బ్యాటింగ్ పూర్తి చేసి 105 పరుగుల లక్ష్యాన్ని సివిల్ సర్వీస్ నార్త్ జట్టుకు ఇచ్చింది. వాళ్లు ఆ పరుగులను చేజించే క్రమంలో మ్యాచ్ మధ్యలోకి ఓ శునకం బయట నుంచి వచ్చేసింది. ఇన్నింగ్స్ 9 వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్నక్రమంలో ఆ బాల్ థర్డ్ ఎంపైర్ మీదుగా వెళ్లింది. దానిని చేతిలోకి తీసుకున్న ఫీల్డర్ నేరుగా కీపర్ కు ఇచ్చింది.

అక్కడ రన్ అవుట్ అయ్యే క్రమంలో వికేట్లకు కొట్టిన బంతి మిస్ అయి మైదానంలోనే కొద్ది దూరం వెళ్లింది. దానిని ఆ శునకం నోటిలో పెట్టుకొని కొద్దిసేపు అక్కడే తిరిగింది. ఇలా ఆ శునకానికి సంబంధించిన యజమాని వచ్చి దాని దగ్గర ఉన్న బాల్ ను వాళ్లకు ఇచ్చేసి దానిని తీసుకొని వెళ్తాడు. ఇతంతా చూస్తున్న ప్రేక్షకులకు కొద్దిసేపు ఫన్నీగా అనిపించింది.

మహిళలు రోజు ఒక గ్లాస్ పచ్చి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఈ సమస్యలకు దూరం కావచ్చు..?

అత్యధిక పోషక విలువలు ఉన్న క్యారెట్ ను చాలామంది పచ్చిగా తినటానికి ఇష్టపడతారు.
దుంపజాతి కాయకూర అయిన క్యారెట్ ను రోజువారీ ఆహారంలో ఏ రూపంలో తీసుకున్నా మన శరీరానికి అవసరమైనన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు క్యారెట్ ను రోజు వారి ఆహారంలో తీసుకోవడం తప్పనిసరి.క్యారెట్ ను ఆహారంలో తీసుకోవడంతో పాటు ప్రతిరోజు ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

క్యారెట్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కావున ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలోని క్యాన్సర్ కణాలు నశించి భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే ప్రమాదకర బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

క్యారెట్స్‌లో పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్స్
సమృద్ధిగా లభిస్తాయి. దాంతో చర్మ సమస్యలు తొలగి సహజ కాంతి వంతమైన చర్మం ఈ సొంతం.క్యారెట్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండడంతో కంటి చూపును మెరుగు పరిచి ప్రమాదకర రేచీకటి వంటి వ్యాధులను దూరం చేస్తుంది.క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఎసిడిటీ వంటి జీర్ణవ్యవస్థ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ బి6 ,కె, పొటాషియం,పాస్ఫ‌ర‌స్ వంటివి మన శరీరానికి సమృద్దిగా లభిస్తాయి. దాంతో ఎముకలు దృఢంగా మారి భవిష్యత్తులో వచ్చే కీళ్ల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందుకోసమే ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.