Alekhya Reddy: ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా ప్రేమికుల దినోత్సవానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి కూడా తన భర్త తారకరత్న గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
సినీ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఈయన ఉన్నఫలంగా గుండెపోటుకు గురయ్యారు. దాదాపు 20 రోజులకు పైగా హాస్పిటల్ లో చికిత్స పొందినటువంటి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.
ఇలా తన భర్త మరణించినప్పటికీ ఈమె తరచు తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూ వచ్చారు. తాజాగా వాలెంటైజ్ డే సందర్భంగా అలేఖ్యరెడ్డి షేర్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది. ఒక ఫ్లవర్ బొకే తీసుకెళ్లి తారకరత్న ఫోటో వద్ద పెట్టడమే కాకుండా తారకరత్న ఫోటోకి ముద్దు పెడుతూ ఆ ఫోటోని హగ్ చేసుకున్నారు.
వాలెంటైన్స్ డే ఓబు..
ఇకపోతే తన ముగ్గురు పిల్లలు కూడా తారకరత్న ఫోటో వద్ద ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే ఓబు అంటూ ఈమె తారకరత్నను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇలా తారకరత్నను అలేఖ్య రెడ్డి ఎంతో మిస్ అవుతున్నారనే చెప్పాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…