Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బాలయ్య అద్భుతమైనటువంటి హిట్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగుకు బాలకృష్ణ బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఏకంగా రెండు నెలలపాటు సినిమా షూటింగ్లకు ఈయన దూరం కాబోతున్నారు.
వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలయ్య ఉన్నఫలంగా షూటింగుకు బ్రేక్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నికలలో బిజీ కానున్నారు ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.
ఎన్నికలలో బిజీబిజీ…
ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయన సినిమా షూటింగులు అన్నింటికీ కూడా కాస్త బ్రేక్ ఇచ్చేసి రాజకీయాలలో బిజీ కానున్నారు ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఏపీ అంతటా కూడా బాలకృష్ణ పర్యటించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించే పనులలో బాలయ్య బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…